ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్ పరాగ్ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు
''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ'' రియాన్ పరాగ్‌పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్ ప్లేయర్ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్ 2023 ఏడు మ్యాచ్‌లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ఓవరాక్షన్ ప్లేయర్‌ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్ చేశారు.
జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ..
జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది.
ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు
సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్.
స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్.
కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్).
Riyan Parag after selection be like 😅#RiyanParag pic.twitter.com/IxlHQIhG8r
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) July 4, 2023
Riyan Parag scored a 33(45) in a tough wicket and is the 2nd highest scorer in the first Innings of the match between East zone and Central Zone #DuleepTrophy pic.twitter.com/a7SDXUNXFu
— ' (@riyanparagfc_) June 29, 2023
Riyan Parag selected in India A squad
— CHINMOY RAY (@ChinmoyRay07) July 4, 2023
Meanwhile me : pic.twitter.com/jiWU96Qnt3
చదవండి: Asia Cup- India A: ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు
Comments
Please login to add a commentAdd a comment