ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక టీమిండియాకు షాకిచ్చింది. ఇవాళ (జులై 28) జరిగిన ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారీ అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కవిష దిల్హరి (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (2 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఏకైక వికెట్ లభించింది. ఈ టోర్నీలో ఆది నుంచి ఆజేయంగా నిలిచిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది.
Comments
Please login to add a commentAdd a comment