దులీప్ ట్రోఫీ 2024లో ఇవాళ (సెప్టెంబర్ 19) మూడో రౌండ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇండియా-డి, ఇండియా-బి తలపడుతుండగా.. రెండో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-సి జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు అనంతపురం ఆర్డీటీ స్టేడియమ్స్‌లో జరుగుతున్నాయి.
టీమిండియా ప్లేయర్లు విఫలం
ఇండియా-సితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (6), తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో ఆ జట్టు 36 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి ఇండియా-ఏ స్కోర్ 67/5గా ఉంది.
షాశ్వత్ రావత్ (20), షమ్స్ ములానీ (19) ఇండియా-ఏని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అర్ద సెంచరీల దిశగా పడిక్కల్, శ్రీకర్ భరత్
ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (44), శ్రీకర్ భరత్ (46) అర్ద సెంచరీల దిశగా సాగుతున్నారు.
పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇండియా-సి తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా-బి ఏడు, ఇండియా-ఏ ఆరు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇండియా-డి సున్నా పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది.
చదవండి: ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం
Comments
Please login to add a commentAdd a comment