Emerging T20 tournment
-
సంచలనం.. 34 పరుగులకే ఆలౌట్; భారత్ ఘన విజయం
ఏసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో సంచలనం చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ వుమెన్స్, ఇండియా వుమెన్స్-ఏ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్‌లో ఇండియా వుమెన్స్ బౌలర్ల దాటికి హాంగ్‌కాంగ్ కేవలం 34 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంకా పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తిటాస్ సాదు ఒక వికెట్ తీశాడు. హాంగ్ కాంగ్ బ్యాటర్లలో మరికో హిల్ 14 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో నాలుగు డకౌట్లు ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ వుమెన్స్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి 38 పరుగులు చేసి టార్గెట్‌ను అందుకుంది. గొంగిడి త్రిష 19, ఉమా చెత్రీ 16 పరుగులు చేశారు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన ఇండియా-ఏ వుమెన్స్ భారీ విజయం అందుకొని టేబుల్ టాపర్స్‌గా ఉన్నారు. Patil’s 5-fer demolishes Hong Kong! Put into bat, the 🇭🇰 batters had no answers to the Indian spinners - ending with just 34 runs. The 🇮🇳 top order completed the chase with over 14 overs to spare! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/8e11IyECs5 — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 Shreyanka Patil was terrific today! She picked up 5 wickets and conceded just 2 runs. Her splendid spell has put India ‘A’ in the drivers seat at the break! #WomensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/UqF0HPd3Xs — AsianCricketCouncil (@ACCMedia1) June 13, 2023 చదవండి: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
‘ఎమర్జింగ్’ టి20 టోర్నీకి ఈసీడీజీ జట్ల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జరగనున్న అంతర్ రాష్ట్ర ఎమర్జింగ్ టి20 టోర్నీకి ఎమర్జింగ్ క్రికెటర్స్ డెవలప్మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) సీనియర్, జూనియర్ జట్లను ఎంపిక చేసింది. సౌరభ్ గంగూలీ అకాడమీ, అరుణ్‌లాల్ అకాడమీల్లో ఈ టోర్నీ జరగనుంది. ఈసీడీజీ సీనియర్ జట్టు: అబ్దుల్ యూసుఫ్ (కెప్టెన్), మహ్మద్ నౌమాన్, మహ్మద్ అబ్రార్, అబ్దుల్ ఐజాజ్, ఖాజా హమీదుద్దీన్, వి.అభినవ్ కుమార్, మహ్మద్ అజహరుద్దీన్, మహ్మద్ నదీమ్‌ఖాన్, ఇబ్రాహీం ప్రత్యూష, ఫరీద్ అహ్మద్, ఫసియుద్దీన్, నయీమ్‌ఖాన్ (కోచ్), ఫయాజ్ గాజీ (మేనేజర్). జూనియర్ జట్టు: ఖాజా జోహబుద్దీన్ (కెప్టెన్), అర్చిత్ గుప్తా, మహ్మద్ అబ్దుల్ నాసిర్, అమృతాన్షు జైన్, అభిషేక్ రాజ్, ఆదిత్య వళ్లమూడి, దేవ్ శుభాంకర్, తృణబ్ త్యాగి, మహ్మద్ యాకూబ్, మహ్మద్ బషీర్, ముస్తఫా మోయిజ్, కుమార్ (కోచ్).