ఆసియాకప్ 2022లో భాగంగా శుక్రవారం హాంకాంగ్, పాకిస్తాన్ మధ్య కీలకమ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరజట్లకు చావోరేవో లాంటిది. గెలిచిన జట్టు సూపర్-4కు వెళితే.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. అయితే మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను.. హాంకాంగ్ కెప్టెన్ నిజాఖత్ ఖాన్ కలిశాడు. ఇద్దరు కరచాలనం చేసుకొని సరదాగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో నిజాఖత్ ఖాన్.. బాబర్ ఆజంను బ్యాటింగ్ టిప్స్ అడిగాడు. అందుకు బాబర్.. ''నిన్ను నువ్వు నమ్ము.. బాగా ప్రాక్టీస్ చెయ్యు.. పరుగులు అవే వస్తాయి'' అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే మ్యాచ్‌లో మాత్రం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన బాబర్.. మరోసారి నిరాశపరిచాడు. 9 పరుగులు మాత్రమే చేసి ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో బాబర్ ఆజంను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. కెప్టెన్ అయ్యుండి నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు అంటూ ట్రోల్ చేశారు. గతేడాది టి20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం 9 టి20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజం 190 పరుగులు మాత్రమే చేశాడు.
©️ meets ©️
— Pakistan Cricket (@TheRealPCB) September 1, 2022
Candid chat between the two skippers 🇵🇰🇭🇰#AsiaCup2022 | #PAKvHK pic.twitter.com/mMEwXihuiP
చదవండి: పాక్‌కు చావోరేవో.. గెలిస్తే సూపర్-4కు; ఓడితే ఇంటికి
Comments
Please login to add a commentAdd a comment