
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో దక్షిణాఫ్రికా మాస్టర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం వడోదర వేదికగా ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో టి అంబ్రోస్(53) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(36), స్కోఫీల్డ్(20) రాణించారు. ఓపెనర్లు మస్టర్డ్(0), ఇయాన్ బెల్ నిరాశపరిచనప్పటికి మోర్గాన్, అంబ్రోస్ కీలక ఇన్నింగ్స్‌లతో ఇంగ్లీష్ జట్టును అదుకున్నారు. ఆఖరిలో ట్రిమ్‌లెట్( 4 బంతుల్లో 19 పరుగులు) హ్యాట్రిక్ సిక్స్‌లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ప్రోటీస్ బౌలర్లలో ఫిలాండర్, హెన్రీ డేవిడ్స్, సబాలాల, కుర్గర్ తలా వికెట్ సాధించారు.
హసీమ్ ఆమ్లా విధ్వంసం..
158 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. సఫారీల కెప్టెన్ హషీమ్ ఆమ్లా అద్బతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు పీటర్సన్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మీకర్ రెండు, ర్యాన్ సైడ్‌బాటమ్ ఓ వికెట్ సాధించారు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం పాయింట్లపట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.
చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment