Hashim Amla
-
ఆమ్లా, పీటర్సన్ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 టోర్నీలో దక్షిణాఫ్రికా మాస్టర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. సోమవారం వడోదర వేదికగా ఇంగ్లండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టి అంబ్రోస్(53) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(36), స్కోఫీల్డ్(20) రాణించారు. ఓపెనర్లు మస్టర్డ్(0), ఇయాన్ బెల్ నిరాశపరిచనప్పటికి మోర్గాన్, అంబ్రోస్ కీలక ఇన్నింగ్స్‌లతో ఇంగ్లీష్ జట్టును అదుకున్నారు. ఆఖరిలో ట్రిమ్‌లెట్( 4 బంతుల్లో 19 పరుగులు) హ్యాట్రిక్ సిక్స్‌లు బాది జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. ప్రోటీస్ బౌలర్లలో ఫిలాండర్, హెన్రీ డేవిడ్స్, సబాలాల, కుర్గర్ తలా వికెట్ సాధించారు.హసీమ్ ఆమ్లా విధ్వంసం..158 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది. సఫారీల కెప్టెన్ హషీమ్ ఆమ్లా అద్బతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు పీటర్సన్(56) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మీకర్ రెండు, ర్యాన్ సైడ్‌బాటమ్ ఓ వికెట్ సాధించారు. సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం పాయింట్లపట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.చదవండి: అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్‌కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో (Hashim Amla) కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.The Moment Babar Azam created History in ODIs ⚡- Joint fastest to complete 6000 runs....!!!!! pic.twitter.com/U29MXMJ8xW— Johns. (@CricCrazyJohns) February 14, 2025కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ట్రై సిరీస్ (Pakistan Tri Series) ఫైనల్లో బాబర్ ఈ ఘనత సాధించాడు. ఆమ్లా, బాబర్ తర్వాత టీమిండియా స్టార్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Viart Kohli) వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని తాకేందుకు విరాట్‌కు 136 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్లలో బాబర్, ఆమ్లా, విరాట్ తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రై సిరీస్‌లోనే (సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో) కేన్ విలియమ్సన్ 6000 పరుగుల క్లబ్లో చేరాడు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. పాక్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేని బాబర్ ఆజమ్ (29) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఫకర్ జమాన్ (10), సౌద్ షకీల్ (8) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (0), సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ స్వదేశంలో ముక్కోణపు సిరీస్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో పాక్ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఫైనల్ ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్ 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
వారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) సూపర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్’ ఈ ఘనత సాధించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేన.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.గిల్ సూపర్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, గత మ్యాచ్‌లో శతకం(119) బాదిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం సెంచరీతో మెరిశాడు.తొలి యాభై ఇన్నింగ్స్లోమొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్‌గానూ శుబ్‌మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో మూడో వన్డేలో గిల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.కోహ్లి కూడా ఫామ్లోకిఇక ఈ మ్యాచ్‌తో మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అహ్మదాబాద్‌లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత హాఫ్ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో 2587, 1893, 578 పరుగులు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు👉శుబ్‌మన్ గిల్(ఇండియా)- 2587 పరుగులు👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు👉ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)- 2386 పరుగులు👉ఫఖర్ జమాన్(పాకిస్తాన్)- 2262 పరుగులు👉షాయీ హోప్(వెస్టిండీస్)- 2247 పరుగులుఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు👉ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా)- వాండరర్స్ స్టేడియం, జొహన్నస్‌బర్గ్👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- నేషనల్ స్టేడియం, కరాచి👉క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్👉శుబ్‌మన్ గిల్(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డుJubilation as @ShubmanGill gets to a fine CENTURY!Keep at it, young man 🙌🙌Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J— BCCI (@BCCI) February 12, 2025 -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
Asia Cup 2023: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. రికార్డు శతకం నమోదు
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్‌తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో 109 బంతులు ఎదుర్కొన్న బాబర్ 10 బౌండరీల సాయంతో కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసి, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన పాక్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత వేగంగా 19 వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా.. వన్డే క్రికెట్లో బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బాబర్‌కు 19 సెంచరీలు సాధించేందుకు కేవలం 102 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇంత వేగంగా 19 సెంచరీల మార్కును అందుకోలేదు. బాబర్‌కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా హషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌ల్లో) పేరిట ఉండేది. రన్ మెషీన్ విరాట్ కోహ్లి 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీల మార్కును అందుకున్నారు. కాగా, నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొత్తంగా 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేసి ఔటయ్యాడు. -
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సౌతాఫ్రికా బ్యాటింగ్ లెజెండ్
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ హషీమ్ ఆమ్లా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ దిగ్గజ ఓపెనర్ జొహనెస్‌బర్గ్ బేస్డ్ ఫ్రాంచైజీ గౌటెంగ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. మూడేళ్ల పాటు ఆమ్లా ఈ పదవిలో కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ స్థానంలో ఆమ్లా గౌటెంగ్ లయన్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ పనిచేసిన ఆమ్లా.. ఈ ఏడాదే ప్లేయర్‌గా చివరిసారిగా మైదానంలో కనిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో అతను వరల్డ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. దిగ్గజ బ్యాటర్‌గా ఖ్యాతి గడించిన 40 ఏళ్ల ఆమ్లా 2004-19 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో 50కు దగ్గరగా సగటు కలిగిన ఆమ్లా.. తన 13 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ 2000, 3000, 4000, 6000, 7000 పరుగుల రికార్డులు ఇప్పటికీ ఆమ్లా ఖాతాలోనే ఉన్నాయి. కెరీర్లో 124 టెస్ట్‌లు ఆడిన ఆమ్లా.. 28 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీల సాయంతో 46.6 సగటున 9282 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యుత్తమ స్కోర్ 311 నాటౌట్‌గా ఉంది. అలాగే 181 వన్డేలు ఆడిన ఆమ్లా... 27 సెంచరీలు, 39 హాఫ్‌సెంచరీల సాయంతో 49.5 సగటున 8113 పరుగులు చేశాడు. 2009-18 మధ్యలో 44 టీ20 ఆడిన ఆమ్లా.. 8 అర్ధశతకాల సాయంతో 1277 పరుగలు చేశాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఆమ్లా 2016, 2017 సీజన్లలో 16 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 141.8 స్ట్రయిక్‌రేట్‌తో 577 పరుగులు చేశాడు. -
ఒకే ఇన్నింగ్స్‌తో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
PAK VS NZ 4th ODI: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు).. వన్డేల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు (97 ఇన్నింగ్స్‌ల్లో) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు దిగ్గజ సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు 18 సెంచరీలు సాధించేందుకు 102 ఇన్నింగ్స్‌లు ఆవసరమయ్యాయి. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో బాబర్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ మైలురాయిని అధిగమించాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాన్ మసూద్ (44), అఘా సల్మాన్ (58) రాణించగా.. ఆఖర్లో షాహీన్ అఫ్రిది (7 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, బెన్ లిస్టర్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్
PAK VS NZ 4th ODI: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతేడాది బాబర్.. హషీమ్ ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4000 పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఫీట్‌ను సాధిస్తే, బాబార్ 82 ఇన్నింగ్స్‌ల్లో ఆ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాకిస్తానీ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 28 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఫకర్ జమాన్ (14) త్వరగా ఔటవ్వగా.. షాన్ మసూద్ (44), మహ్మద్ రిజ్వాన్ (24) పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (55), అఘా సల్మాన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను పాక్ ఇదివరకే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కాకుండా సిరీస్‌లో మరో మ్యాచ్ (ఐదో వన్డే) మిగిలి ఉంది. అంతకుముందు ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ డ్రాగా ( 2-2) ముగిసింది. -
Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు
సౌతాఫ్రికా క్రికెట్లో మరొక శకం ముగిసింది. ప్రొటిస్ జట్టు సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా బుధవారం(జనవరి 18న) అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వివాదాలకు దూరంగా.. ఇస్లాం మతానికి గౌరవం ఇస్తూ కెరీర్‌ను కొనసాగించిన అరుదైన క్రికెటరగా గుర్తింపు పొందాడు. తాను ధరించే జెర్సీపై ఎలాంటి లోగో లేకుండానే బరిలోకి దిగడం ఆమ్లాకు అలవాటు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎక్కువగా స్పాన్సర్షిప్ ఇచ్చేది బీర్ల కంపెనీలే. ఇస్లాం మతంలో మద్యపానం నిషేధం. దానిని క్రికెట్ ఆడినంత కాలం మనసులో ఉంచుకున్న ఆమ్లా అంతర్జాతీయ మ్యాచ్‌లే కాదు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా జెర్సీపై దక్షిణాఫ్రికా జాతీయ చిహ్నం మినహా ఎలాంటి లోగో లేకుండా జాగ్రత్తపడేవాడు. కౌంటీ క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ ఇదే జాగ్రత్తలు తీసుకునేవాడు. -సాక్షి, వెబ్‌డెస్క్ కోహ్లితో పోటీపడి పరుగులు.. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హషీమ్ ఆమ్లా ఒక దశలో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లితో పోటీపడి పరుగులు సాధించేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . ముఖ్యంగా వన్డేల్లో ఆమ్లా, కోహ్లి మధ్య కొంతకాలం పరుగుల పోటీ నడిచిందని చెప్పొచ్చు.కోహ్లి ఒక రికార్డు అందుకోవడమే ఆలస్యం.. వెంటనే ఆమ్లా లైన్లోకి వచ్చి ఆ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18వేలకు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇక సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. మరి ఒకప్పుడు కోహ్లితో పోటీపడి పరుగులు సాధించిన ఆమ్లా ఆ తర్వాత ఎందుకనో వెనుకబడిపోయాడు. బహుశా వయస్సు పెరగడం.. ఫిట్నెస్ సమస్యలు.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడం అనుకుంటా. తర్వాత ఆమ్లాకు అవకాశాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయ క్రికెట్‌కు మెళ్లగా దూరమైన ఆమ్లా 2019 వన్డే ప్రపంచకప్ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. వివాదాలకు ఆమడ దూరం.. క్రికెట్ ఆడినంత కాలం ఆమ్లా ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ఆమ్లా చాలా నెమ్మదస్తుడు. ఒక్కసారి క్రీజులో అడుగుపెట్టాడంటే అతన్ని ఔట్ చేయడం అంత సులువు కాదు. ఎన్నోసార్లు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. భారత్ మూలాలున్న హషీమ్ ఆమ్లా స్పిన్ బౌలింగ్‌ను అవలీలగా ఆడగల సమర్థుడు. డీన్ జోన్స్ వివాదం ఆమ్లా క్రికెట్ కెరీర్లో ఏదైనా వివాదం ఉందంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. కామెంటేటర్ డీన్ జోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. 2013లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ సందర్భంగా మాటల మధ్యలో డీన్ జోన్స్ ఆమ్లాను ఉగ్రవాది అని సంబోధించాడు. ఆ మ్యాచ్‌లో కుమార సంగక్కర ఇచ్చిన క్యాచ్‌ను ఆమ్లా అందుకున్నాడు. వెంటనే డీన్ జోన్స్.. ఉగ్రవాదికి మరొక వికెట్ లభించింది. ఇది పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత డీన్ జోన్స్ తన వ్యాఖ్యలపై ఆమ్లాకు క్షమాపణ చెప్పినప్పటికి బ్రాడ్‌కాస్టర్స్ అతన్ని జాబ్ నుంచి తొలగించారు. అంతర్జాతీయ క్రికెట్లో 18వేలకు పైగా పరుగులు.. ఆమ్లా తన కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 124 టెస్టులు ఆడి 46.64 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. 4 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోరు.. 311. ఇక 181 వన్డేలలో 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఇక 44 టీ20లలో 8 అర్ధశతకాలతో 1277 పరుగులు చేశాడు. ఇక కౌంటీ క్రికెట్ లో ఆమ్లా గణాంకాలు రికార్డులే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పనుకున్నాక ఆమ్లా సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 265 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన ఆమ్లా 19521 పరుగులు చేశాడు. హైయెస్ట్ స్కోర్.. 311 నాటౌట్. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో 247 మ్యాచుల్లో10020 పరుగులు చేశాడు.హైయెస్ట్ స్కోరు 159. ఇక టీ20 క్రికెట్ లో 164 మ్యాచుల్లో 2 సెంచరీల సాయంతో 4563 పరుగులు చేశాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..? -
రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
Hashim Amla: సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న ఆమ్లా.. ఈ ఏడాది (2023) కౌంటీ సీజన్ బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేసి తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ ప్రకటనలో ఆమ్లా.. సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. -
మాజీలు సైమన్ కటిచ్, హషీమ్ ఆమ్లాలకు కీలక పదవులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్‌ను కీలక పదవి వరించింది. సౌతాఫ్రికా టి20 లీగ్‌లో భాగంగా ముంబై కేప్‌టౌన్‌ను.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై కేప్‌టౌన్‌కు కొత్త కోచ్‌లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ పామెంట్‌ను.. అలాగే జట్టు జనరల్ మేనేజర్‌గా రాబిన్ పీటర్సన్‌ను ఎంపిక చేస్తూ ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైమన్ కటిచ్‌కు ట్విటర్ వేదికగా వెల్కమ్ చెప్పింది. ''సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ కోచ్‌గా ఎంపికవ్వడం మాకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా మీకు మా ఫ్యామిలీలోకి స్వాగతం'' అంటూ పేర్కొంది. ఇక సైమన్ కటిచ్ స్పందింస్తూ.. ''ముంబై కేప్‌టౌన్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచి ఒక కొత్త జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బాధ్యత అప్పగించారు. జట్టులో ఆటగాళ్ల నైపుణ్యతను, సమతుల్యతను పెంచేలా పనిచేస్తాను. లోకల్ ఆటగాళ్ల నైపుణ్యతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ తెలిపాడు. ఇక జనవరిలో జరగనున్న ఆరంభ ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతుంది. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. WELCOME, COACH KATICH! 🙌 We are eXXcited to announce that Simon Katich has joined the #OneFamily and will be the Head Coach of MI Cape Town! 💙 Read more here: https://t.co/36VSv8n7F0 #OneFamily #MICapeTown #SA20 @SA20_League pic.twitter.com/BFBigOjVvv — MI Cape Town (@MICapeTown) September 15, 2022 చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
ఆమ్లా రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ బాబర్ అదరగొడుతున్నాడు. తాజాగా మంగళవారం నెదార్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో ఆజం 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేట్ హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును ఆజం బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో 88 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆజం నిలిచాడు. ఇప్పటి వరకు ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 4473 పరుగులతో ఆమ్లా తొలి స్థానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌లో బాబర్ 4516 పరుగులు సాధించి ఈ రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌కు నెదార్లాండ్స్ చుక్కలు చూపించింది. నెదార్లాండ్స్ 16 పరుగులతో ఓటమి పాలైనప్పటికీ.. అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 109 పరుగులుతో చెలరేగగా..కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో రాణించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్ బీక్కు రెండు, బాస్ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ్‌జిత్ సింగ్ (65),టామ్ కూపర్(65),స్కాట్ ఎడ్వర్డ్స్( 71) పరుగులు సాధించారు. చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా చంద్రకాంత్ పండిట్.. కేకేఆర్ దశ మారనుందా! -
వెస్టిండీస్ ఓపెనర్ వన్డేల్లో అరుదైన ఫీట్.. మూడో ఆటగాడిగా..!
వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌తో కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. రిచర్డ్స్ 88 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకోగా.. హోప్ కూడా 88 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన హోప్(127) ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 విండీస్ తరపున అరంగేట్రం చేసిన హోప్.. ఇప్పటి వరకు 88 ఇన్నింగ్స్‌లలో 4026 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా ఈ ఘనతను 81 ఇన్నింగ్స్‌లలో సాధించి తొలి స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 82 రెండు ఇన్నింగ్స్‌లలో సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్ -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్.. కోహ్లి, ఆమ్లాల కంటే వేగంగా..!
PAK VS AUS: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (84 ఇన్నింగ్స్‌లు) 16 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హాషిమ్ ఆమ్లా (94 ఇన్నింగ్స్‌ల్లో 16 శతకాలు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (110 ఇన్నింగ్స్‌లు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (110 ఇన్నింగ్స్‌లు)ల రికార్డులను అధిగమించాడు. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ (115 బంతుల్లో 105; 12 ఫోర్లు) సాధించడం ద్వారా బాబర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇదే సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలోనూ శతకం బాదిన బాబర్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) వన్డే క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7, 13, 14, 15 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రికార్డులతో పాటు బాబర్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ నాలుగో సెంచరీ సాధించిన కెప్టెన్‌గా టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ (4) రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (13) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. మహ్మద్ వసీం (3/40), హరీస్ రౌఫ్ (3/39), షాహీన్ అఫ్రిది (2/40) నిప్పులు చెరగడంతో ఆసీస్‌ను 41.5 ఓవర్లలో 210 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదనలో బాబర్ ఆజమ్ (105 నాటౌట్), ఇమామ్ (89 నాటౌట్) రాణించడంతో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1 తేడాతో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ నెగ్గడం పాక్‌కు ఇదే తొలిసారి. చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్ సొంతం -
కోహ్లి, ఆమ్లా రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ బాబార్ ఆజం, ఓపెనర్ ఇమాముల్ హక్ వీరోచిత శతకాలతో తమ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరును చేధించింది. మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వన్డేల్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 83 బంతుల్లో 114 పరుగులు చేసిన బాబర్ వన్డేల్లో 15వ సెంచరీ అందుకున్నాడు. 83 ఇన్నింగ్స్‌ల్లోనే బాబర్ 15 సెంచరీలు సాధించాడు. తద్వారా అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బాబర్ ఆజం దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. అంతకముందు ఆమ్లా 86 ఇన్నింగ్స్ ద్వారా 15వ సెంచరీ సాధించాడు. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లికి 15వ వన్డే సెంచరీ సాధించడానికి 106 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(108 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్(108 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెన్ మెక్‌డెర్మట్ (108 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా...ట్రవిస్ హెడ్ (70 బంతుల్లో 89; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్నస్ లబ్‌షేన్ (49 బంతుల్లో 59; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. షాహిన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ 49 ఓవర్లలో 4 వికెట్లకు 352 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్), ఇమామ్ ఉల్ హఖ్ (97 బంతుల్లో 106; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగగా, ఫఖర్ జమాన్ (64 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. తాజా ఫలితంతో సిరీస్ 1–1తో సమం కాగా, చివరి వన్డే శనివారం జరుగుతుంది. చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం.. Pak Vs Aus 2nd ODI: ఆసీస్‌పై సంచలన విజయం.. బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు! -
278 బంతుల్లో 37 నాటౌట్.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్‌కు పెట్టింది పేరు. అతని తర్వాత ఆ స్థానాన్ని టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆక్రమించాడు. అయితే వీరిద్దరి డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హాషీమ్ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది. Hashim Amla has played one of the great first-class innings - 37* off 278!balls to secure a draw for Surrey against Hampshire. An epic performance. pic.twitter.com/QfBF388UDl — Derek Alberts (@derekalberts1) July 7, 2021 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. ఇందులో హషీమ్ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. దీంతో ఫాలో ఆన్ ఆడిన సర్రే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా తన క్లాస్ ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డ ఆయన.. బౌన్సర్లు, యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రికెట్లోని క్లాస్‌ను ప్రత్యర్ధులకు రుచి చూపించాడు. Hashim Amla batting on 5 runs in 114 deliveries for Surrey. Pujara bhai Wada Wau Wau moment for England series loading. — Silly Point (@FarziCricketer) July 7, 2021 తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. హాంప్‌షైర్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. తాను ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టిన ఈ మిస్టర్ డిఫెన్స్.. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే మ్యాచ్ ముగిసే సమయానికి 122/8తో నిలిచింది. దీంతో ఆ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఈ క్రమంలో ఆమ్లా ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రికార్డును తిరగరాశాడు. 40లోపు పరుగులు(37*) సాధించేందుకు అత్యధిక బంతులను(278) ఎదుర్కొన్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆమ్లా ఆడిన ఈ మాస్టర్ క్లాస్ డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నయా వాల్ చతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా కూడా జట్టును రక్షించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Most balls faced in a first-class innings of less than 40: 278 HM Amla (37*) Surrey v Hampshire Southampton 2021 277 TE Bailey (38) England v Australia Leeds 1953 (where balls faced are known) — Andrew Samson (@AWSStats) July 7, 2021 -
బాబర్ అజమ్ కొత్త రికార్డు.. కోహ్లి, ఆమ్లాను దాటేసి
సెంచూరియన్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్ నిలిచాడు. అంతకముందు కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. హషీమ్ ఆమ్లాకు 83 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా బాబర్ అజమ్ మాత్రం 13 వన్డే సెంచరీలు చేయడానికి 76 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకొని కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబుచులాడిన ఈ మ్యాచ్‌లో చివరికి పాక్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు సాధించింది. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డస్సెన్ అజేయ శతకం (134 బంతుల్లో 123 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో ఆదుకున్నాడు. అతడు మిల్లర్ (50; 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఇక 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ సరిగ్గా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి కేవలం మూడు పరుగులు అవసరమయ్యాయి. చేతిలో నాలుగు వికెట్లున్నాయి. ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్ ఖాన్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్)ను అవుట్ చేశాడు. తర్వాతి మూడు బంతులకు ఫెలుక్వాయో ఒక్క పరుగూ ఇవ్వలేదు. దాంతో పాక్ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. అయితే ఫాహిమ్ అష్రఫ్ (5 నాటౌట్) ఐదో బంతికి రెండు పరుగులు, చివరి బంతికి ఒక పరుగు సాధించి పాకిస్తాన్‌ను గట్టెక్కించాడు. చదవండి: 'కెప్టెన్సీ.. పంత్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయం' టీమిండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఎక్కువే: మోర్గాన్ -
'ఐపీఎల్లో ఆడనందుకు నాకు బాధ లేదు'
ముంబై : చటేశ్వర్ పుజార.. పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఇప్పటితరంలో అద్భుతమైన స్ట్రోక్ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న పుజార పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టీ20 పనికిరాడంటూ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అంశమే అతన్ని టీ20తో పాటు ఐపీఎల్‌కు దూరం చేసింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో పుజారను ఏ ఐపీఎల్ జట్టు కూడా కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. తాజాగా ఐపీఎల్ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చటేశ్వర్ పుజార మరోసారి స్పందించాడు. 'నేను ఐపీఎల్ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధ లేదు. ఐపీఎల్‌కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారని.. అందులో వరల్డ్ క్లాస్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న హషీమ్ ఆమ్లా లాంటి ఆటగాడు కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు.. అందులో నేను ఒకడిని. మేము ఐపీఎల్లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్‌గా మాత్రమే గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా. టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్‌లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది చెప్పండి. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్లో సాధించే విజయం కన్నా దేశంకోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజార 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి. -
సవాల్‌ను ఎదుర్కొంటాం!
విజయనగరం: భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌పైనే తామంతా దృష్టిపెట్టామని...ప్రత్యర్థితో ముఖాముఖి సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాన్ ఫిలాండర్. దిగ్గజ క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ అనంతరం తొలిసారిగా టెస్టు సిరీస్ ఆడబోతున్న సఫారీలు... దీంతో పాటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాతో సిరీస్ కఠినమైనదని పేర్కొంటూనే జట్టులోని సీనియర్లు రాణించి ప్రత్యర్థికి షాకివ్వాలని ఫిలాండర్ అన్నాడు. ‘తమదైన ముద్ర చూపేలా ఇప్పుడు సీనియర్లపై పెద్ద బాధ్యత ఉంది. దానిని నిర్వర్తించడమే మా విధి. మేం విజయాల వేటను ఆలస్యంగా ప్రారంభిస్తామన్న పేరుంది. ఈసారి మాత్రం మెరుగ్గా మొదలుపెట్టాలి. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉన్నది వాస్తవమే. రాబోయే సిరీస్‌లో జూనియర్లు త్వరగా నేర్చుకోవాలి. సీనియర్లు వారికి మార్గదర్శకంగా నిలిచి భవిష్యత్‌లో మంచి జట్టుగా ఎదిగేందుకు మార్గం చూపాలి’ అని అతడు పేర్కొన్నాడు. ఫిలాండర్ గతేడాది మొదట్లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్‌ను తన పేస్‌తో దెబ్బకొట్టాడు. మూడు టెస్టుల్లో 15 వికెట్లు తీశాడు. -
సంధి దశలో సఫారీలు
ఒక్కొక్కరుగా దిగ్గజాల రిటైర్మెంట్, ఫిట్నెస్ సమస్యలు, బోర్డు పాలన వైఫల్యాలతో దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయి. గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు ఫర్వాలేదనిపించిన ఆ జట్టు అనంతరం డీలా పడిపోయింది. ఆఖరికి శ్రీలంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక వన్డే ప్రపంచ కప్‌లో వారి వైఫల్యం దీనికి పరాకాష్ట. ప్రతిభావంతులను గౌరవించకపోవడం, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం... ఇలా అనేక తప్పిదాలతో ప్రొటీస్ పరిస్థితి దిగజారింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు లేకుంటే మరింతగా పతనమయ్యే ప్రమాదమూ ఉంది. సాక్షి క్రీడా విభాగం పేరుకు 12 జట్లున్నా... ప్రస్తుతం టెస్టు హోదా ఉన్న దేశాల్లో బలమైనవని చెప్పుకోదగ్గవి ఆరే! అవి... భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్. వీటిలోనూ విండీస్ ఆట మూడు దశాబ్దాలుగా అనిశ్చితం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో మరో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. మేటి అనదగ్గ ఆటగాళ్లు ఒకరివెంట ఒకరు నిష్క్రమిస్తుండటంతో సఫారీలు నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మిగిలారు. విధ్వంసక ఏబీ డివిలియర్స్‌తో మొదలైన రిటైర్మెంట్ల పరంపర... నిలకడకు మారుపేరైన హషీమ్ ఆమ్లా వరకు వచ్చింది. వీరిద్దరి మధ్యలో ప్రధాన పేసర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ వీడ్కోలు పలకడం ప్రొటీస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడా జట్టులో మిగిలిన నాణ్యమైన ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ మాత్రమే. మిగతా వారిలో కొందరు అంతర్జాతీయ క్రికెట్లో తమ ముద్ర వేసే దిశలో ఉండగా... ఇంకొందరు ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తిగా సంధి కాలం అనదగ్గ ఇలాంటి దశను అధిగమించేందుకు దక్షిణాఫ్రికా బోర్డు గట్టి చర్యలు చేపట్టకుంటే... ఆ జట్టు ఓ సాధారణమైనదిగా మిగిలిపోవడం ఖాయం. రెండు, మూడేళ్లయినా ఆడగలిగినవారే! తమ దిగ్గజ ఆటగాళ్లు అర్ధంతర రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఏ దేశ క్రికెట్ బోర్డయినా ఏం చేస్తుంది? తక్షణమే సంప్రదింపులు జరిపి, వారి సేవలు ఎంత కీలకమో వివరించి నిర్ణయాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకునేలా చేయడమో, మూడు ఫార్మాట్లలో వారి సేవలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ తగిన విధంగా వాడుకునేలా చేయడమో చేస్తుంది. కానీ, దక్షిణాఫ్రికా బోర్డు ఇలాంటి చొరవేదీ చూపుతున్నట్లు లేదు. డివిలియర్స్ ఉదంతమే దీనికి పక్కా నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మైదానంలోనైనా రాణించగలిగే అతడు గతేడాది ఏప్రిల్‌లో అనూహ్యంగా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపర్చాడు. అప్పటికి ఏబీ వయసు 34 ఏళ్లే. తన ఫామ్‌ను అంతకుమించిన ఫిట్నెస్ను చూస్తే కనీసం రెండేళ్లయినా మైదానంలో మెరుపులు మెరిపించగల స్థితిలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో 2018 మార్చి 30న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన టెస్టు తర్వాత ఇక ఆడనంటూ తప్పుకొన్నాడు. ఇదే టెస్టుతో, అంతకుమందే ప్రకటించిన మేరకు పేసర్ మోర్నీ మోర్కెల్ బై బై చెప్పాడు. ఆ సమయంలో అతడికి 33 ఏళ్లే. గాయాలు వేధిస్తున్నాయని అనుకున్నా... మోర్కెల్ మరీ ఫామ్ కోల్పోయి ఏమీ లేడు. పెద్ద జట్లతో సిరీస్‌లైనా ఆడేలా అతడిని ఒప్పించలేకపోయారు. మోర్కెల్ లేని లోటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తెలిసొచ్చింది. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా... లంకకు టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఇక 36 ఏళ్ల స్టెయిన్‌ది మరో కథ. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన అతడు వరుసగా గాయాలతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో టెస్టులకు రాం రాం చెప్పాడు. దీంతో ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్ల సేవలను కోల్పోయినట్లైంది. మరో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ అద్భుత బౌలరే. అయితే, 34 ఏళ్లు దాటిన అతడు గాయాలతో కొంతకాలంగా ప్రధాన స్రవంతి క్రికెట్లో లేడు. తాజాగా హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్తో దక్షిణాఫ్రికా మరో స్టార్ ఆటగాడిని కోల్పోయినట్లైంది. వాస్తవానికి 36 ఏళ్ల ఆమ్లా విరమణపై ఊహాగానాలు ఉన్నా... కనీసం ఇంకో ఏడాదైనా టెస్టుల వరకు ఆడతాడని భావించారు. అతడు మాత్రం మూడు ఫార్మాట్లకు అస్త్రసన్యాసం చేశాడు. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎలాగో... బ్యాటింగ్, బౌలింగ్‌లో మూలస్తంభాలైన నలుగురి రిటైర్మెంట్తో ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎదుర్కోనున్న అసలు సవాలు టెస్టు చాంపియన్‌షిప్. ఆ జట్టు చాంపియన్‌షిప్‌లో 16 టెస్టులు ఆడనుంది. వీటిలో వచ్చే జనవరి లోపు భారత్ (3), ఇంగ్లండ్ (4 సొంతగడ్డపై)లతోనే ఏడు టెస్టులున్నాయి. విండీస్, పాక్, లంకలతోనూ రెండేసి ఆడాల్సి ఉంది. చివరగా ఆస్ట్రేలియాతో 3 టెస్టుల్లో తలపడుతుంది. బౌలింగ్‌లో రబడ మినహా ఇంకెవరిపైనా ఆశలు లేని నేపథ్యంలో డు ప్లెసిస్, డికాక్‌లకు తోడు ఓపెనర్ మార్క్రమ్, ఎల్గర్ సత్తా చాటితేనే సఫారీలు కనీసం పోటీ ఇవ్వగలరు. పెద్దరికం లేని బోర్డు... దూరదృష్టి లేని క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) తీరే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆటగాళ్లు, బోర్డు అధికారుల మధ్య సత్సంబంధాలు లేవు. వన్డే ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ ముందుండగా రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌కు నచ్చజెప్పి ఆపే పెద్దరికం, కప్‌నకు తుది జట్టును ప్రకటించే సమయంలో తిరిగొస్తానన్న అతడిని తీసుకునే విశేష చొరవ ఎవరికీ లేకపోయింది. గాయాలతో ఉన్న స్టెయిన్‌ను జాగ్రత్తగా కాపాడుకునే వ్యూహం, ఆమ్లాను కొన్నాళ్లు ఆగేలా చేసే ప్రయత్నమూ వారిలో కొరవడింది. వన్డేలు, టి20ల కంటే స్టెయిన్ టెస్టుల్లోనే దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవసరం. కానీ, అతడు టెస్టులకే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇక్కడా బోర్డు నిష్క్రియాపరత్వం కనిపిస్తోంది. ఇప్పుడు సీఎస్ఏ... ఫుట్‌బాల్ తరహాలో జట్టుకు మేనేజర్‌ను నియమించి అతడే కోచింగ్ సిబ్బందిని, కెప్టెన్‌ను ఎంపిక చేసేలా కొత్త విధానం తీసుకురావాలని చూస్తోంది. ప్రధాన కోచ్ గిబ్సన్, సహాయ సిబ్బంది కాంట్రాక్టు కూడా ముగియనుంది. వచ్చేవారైనా దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలిసితీసి బాధ్యతలను సమర్థంగా నెరవేరిస్తేనే ప్రొటీస్ జట్టు పటిష్టంగా ఉంటుంది. -
'నీ ఆటతీరు యువ ఆటగాళ్లకు ఆదర్శం'
ముంబయి : దక్షిణాప్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా గురువారం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై ప్రకటించిన సంగతి తెలిసిందే. అతని ఆటతీరుకు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శుక్రవారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా హషీమ్ ఆమ్లాను పొగడ్తలతో ముంచెత్తాడు. ' మిత్రమా ! నీ కెరీర్ ఆసాంతం ఏ స్వార్థం ఆశించకుండా మీ దేశానికి సేవ చేసినందుకు అభినందిస్తున్నాను. సొగసైన ఆటతీరుతో ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచావు. ఆట నుంచి తప్పుకున్న నీకు మిగిలిన జీవితం అద్భుతంగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు' ట్వీట్ చేశాడు. అంతకు ముందు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్టు రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ' ఎన్నోసార్లు మీ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్సమెన్ను ముప్పతిప్పలు పెట్టావు. మైదానంలో నీ బౌలింగ్‌ను ఎదుర్కొని బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించేవాడిని. ఒక మిత్రుడిగా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించిన రెండు రోజులకే హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, స్టెయిన్ పరిమిత ఓవర్ల ఆటలో కొనసాగనున్నాడు. తాను అంతర్జాతీయ ఆట నుంచి తప్పుకున్నా, దేశవాళీ క్రికెట్లో మాత్రం తాను కొనసాగనున్నట్లు హషీం ఆమ్లా స్పష్టం చేశాడు. -
ఆమ్లా అల్విదా
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మూడు రోజుల వ్యవధిలో మరో దిగ్గజ క్రికెటర్ సేవలు కోల్పోయింది. సోమవారం స్టెయిన్ టెస్టుల రిటైర్మెంట్ తర్వాత మరో సీనియర్ బ్యాట్స్‌మన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. దశాబ్దన్నర కాలం పాటు సఫారీ బ్యాటింగ్ మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచిన హషీమ్ మొహమ్మద్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్లో పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఆమ్లా వన్డేల్లోనూ తన సత్తా చాటాడు. జొహన్నెస్‌బర్గ్: రుషిలాంటి ఏకాగ్రత...వీరుడిలాంటి పోరాటపటిమ... హషీమ్ ఆమ్లా రిటైర్మెంట్ సందర్భంగా సహచర క్రికెటర్ ఒకరు చేసిన ప్రశంస ఇది. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోయే తత్వం, చూడముచ్చటైన స్ట్రోక్‌లు, వివాదాలు లేని, బ్యాట్‌తోనే తప్ప ఏనాడూ నోటితో సమాధానం చెప్పని తనదైన ప్రత్యేక వ్యక్తిగత జీవన శైలి...ఇవన్నీ హషీం ఆమ్లాను విశేష క్రికెటర్‌గా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల ఆమ్లా ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆమ్లా కెరీర్లో చివరిది. లంకపైనే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమ్లా తన ఆఖరి టెస్టు ఆడాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ సఫారీ స్టార్ చివరకు ఆట ముగించాలని నిర్ణయించుకున్నాడు. టెస్టు ల్లో గత 29 ఇన్నింగ్స్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన అతను... వన్డే ప్రపంచ కప్‌లో కూడా 7 ఇన్నింగ్స్‌లలో కలిపి 203 పరుగులే చేయగలిగాడు. అద్భుతమైన ప్రదర్శనలతో... 2002 అండర్–19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమ్లా కోల్‌కతాలో భారత్‌పైనే 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది. మరుసటి ఏడాది లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతూ సెంచరీతో తన జట్టును రక్షించడంతో ఆమ్లా పోరాటపటిమ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 2012 సిరీస్‌లో చేసిన రెండు సెంచరీలు, అంతకు ముందు ఏడాది స్వదేశంలో అదే జట్టుపై సాధించిన రెండు వరుస శతకాలు ఆమ్లా కెరీర్లో చెప్పుకోదగ్గవి. 2012లో ఇంగ్లండ్‌పై ఓవల్ మైదానంలో 13 గంటలకు పైగా క్రీజ్‌లో నిలిచి అజేయంగా సాధించిన 311 పరుగులు అతని కెరీర్లో హైలైట్. 2006నుంచి 2015 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా జట్టు విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదంటే అందులో ఆమ్లా పోషించిన పాత్ర అద్భుతం. 14 టెస్టుల్లో సఫారీ జట్టుకు అతను కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌లో సూపర్... ఆమ్లా భారత్‌లో 3 సార్లు పర్యటించాడు. 2004లో విఫలమైన అతను 2008 సిరీస్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 2010 సిరీస్‌లోనైతే ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 253 నాటౌట్, 114, 123 నాటౌట్ పరుగులతో మన బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. 2015లో కెప్టెన్‌గా వచ్చి 0–3తో సిరీస్ చేజార్చుకున్నా...ఢిల్లీ టెస్టులో మ్యాచ్‌ను కాపాడేందుకు 244 బంతుల్లో 25 పరుగులు చేసిన అతని పట్టుదలను ఎవరూ మరచిపోలేరు. వన్డేల్లోనూ దూకుడు... శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్ కోసమే పుట్టినట్లుగా అనిపించినా...వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. ఇదే ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 75 సగటు, 104 స్ట్రైక్‌రేట్‌లో 1058 పరుగులు చేయడం విశేషం. ఒక దశలో అతను వేగంలో కోహ్లితో పోటీ పడ్డాడు. కెరీర్లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగుల వరకు ప్రతీ వేయి పరుగుల మైలురాయిని అందరికంటే వేగంగా ఆమ్లానే చేరుకోవడం మరో ఘనత. దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (27) సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ (311 నాటౌట్) సాధించిన ఏకైక క్రికెటర్ ఆమ్లా -
ప్రపంచకప్: కివీస్ లక్ష్యం 242
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 242 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బుధవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు అదే నిలకడలేమి ప్రదర్శనను కనబర్చింది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(55; 83 బంతుల్లో 4ఫోర్లు), డస్సెన్(67; 64 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్లు)మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ మూడు వికెట్లతో రెచ్చిపోగా.. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, సాంట్నర్లు తలో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్(5)ను ట్రెంట్ బౌల్ట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లాతో కలిసి సారథి డుప్లెసిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం డుప్లెసిస్(23)ను ఫెర్గుసన్ పెవిలియన్‌కు పంపించాడు. ఓ వైపు వికెట్లు పెడుతున్నా మరో వైపు ఆమ్లా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం ఆమ్లా కూడా పెవిలియన్ బాట పట్టాడు. అయితే చివరల్లో డస్సెన్ ఒంటరి పోరాటం చేయడంతో సఫారీ జట్టు కనీసం పోరాడే స్కోర్‌ను నమోదు చేసింది. కివీస్ కట్టుదిట్టంగా.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విజయవంతం అయ్యారు. క్రమంగా వికెట్లు తీస్తూ సఫారీ జట్టుపై ఒత్తిడి పెంచారు. కివీస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి సఫారీ బ్యాట్స్‌మెన్ నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్ పిచ్‌లపై నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం. -
ఆమ్లా అందుకోలేకపోయాడు.. కోహ్లి రికార్డు సేఫ్
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్ ఆరంభం నుంచి ఎంతగానో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్, సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లాను ఊరిస్తున్న రికార్డును ఎట్టకేలకు సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా 24 పరుగులు చేయడంతో వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 175 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకోగా, ఆమ్లా 176 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక అత్యంత వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో సఫారి జట్టు విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా 8000 పరుగుల క్లబ్లో చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో జాక్వస్ కలిస్(11,579), డివిలియర్స్(9577), గిబ్స్(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమ్లా ఫామ్‌లో లేకపోవడంతో ఈ రికార్డు కాస్త ఆలస్యం అయింది. 36 ఏళ్ల ఆమ్లాకి ఇదే ఆఖరి ప్రపంచకప్‌గా అందరూ భావిస్తున్నారు. 8️⃣0️⃣0️⃣0️⃣ ODI runs for Hashim Amla 👏 He is the second fastest to the landmark in terms of innings batted 😱 Can he go on and celebrate with a big one today?#CWC19 pic.twitter.com/V1GvAkYrwZ — Cricket World Cup (@cricketworldcup) 19 June 2019 -
కోహ్లి రికార్డు బద్దలయ్యేనా?
సౌతాంప్టన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల గురించే చెప్తే ఒడిసేది కాదు.. రాస్తే పుస్తకం సరిపోదు. లెక్కలేనన్ని రికార్డులు కోహ్లి సొంతం. అయితే ప్రపంచకప్‌లో భాగంగా నేడు(బుధవారం) దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో కోహ్లికి సంబంధించిన ఓ రికార్డుకు ముప్పు ఉంది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా ఆ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరగులు పూర్తి చేసిన రికార్డు భారత సారథి పేరిట ఉంది. 183 మ్యాచ్‌లు, 175 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. అప్పటి వరకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలయర్స్(190 మ్యాచ్‌లు..182 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూల్, రోహిత్ శర్మ, రాస్ టేలర్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమ్లాకు ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది. 175 మ్యాచ్‌లు 172 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమ్లా 7923 పరుగులు చేశాడు. కోహ్లి రికార్డుకు ఇంకా 77 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే నేడు జరిగే మ్యాచ్ ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆమ్లా ఈ పరుగులు సాధిస్తే కోహ్లి రికార్డు బద్దలుకానుంది. నేటి మ్యాచ్ ఇన్నింగ్సే కాకున్నా.. మరో ఇన్నింగ్స్‌లో సాధించిన కోహ్లిని అధిగిమించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సైతం 8 వేల పరుగులు పూర్తిచేయడానికి 22 పరుగుల దూరంలో ఉన్నప్పటికి వేగవంతమైన జాబితాలో లేడు. అయితే ఆమ్లా ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఆరంభమ్యాచ్‌లో గాయపడి.. బంగ్లాదేశ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భారత్‌తో మ్యాచ్‌కు సిద్దమైనప్పటికి గాయంతో కొలుకుని ఏమాత్రం రాణిస్తాడనేది ప్రశ్న. ఇప్పటికే వరుస రెండు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సఫారీలు.. భారత్‌తో ఏ మాత్రం రాణిస్తారో చూడాలి. -
దక్షిణాఫ్రికాకు షాక్.. ఆమ్లా రిటైర్డ్ హర్ట్
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన నాల్గో ఓవర్ ఐదో బంతిని పుల్ షాట్ ఆడబోయి ఆమ్లా గాయపడ్డాడు. దాంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆర్చర్ వేసిన సదరు బంతి 145 కి.మీ వేగంతో దూసుకొచ్చి ఆమ్లా హెల్మెట్‌ను బలంగా తాకింది. ఈ క్రమంలోనే మైదానంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆమ్లా హెల్మెట్‌ను మార్చడం కోసం సంకేతాలు ఇవ్వడంతో మోరిస్ కొన్ని హెల్మెట్లను మైదానంలోకి తీసుకొచ్చాడు. అయితే ఆ హెల్మెట్లు ఆమ్లాకు సరిపోలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి ఆమ్లాను పరీక్షించాడు. బంతి తగిలిన చోట కొద్దిపాటి వాపు కూడా రావడంతో ఆమ్లా మైదానాన్ని వీడాడు. ఇలా ఆమ్లా మైదానాన్ని వీడటం దక్షిణాఫ్రికా శిబిరాన్ని ఆందోళనకు గురి చేసింది. ఇంకా ఆమ్లా గాయంపై స్పష్టత రాలేదు. (ఇక్కడ చదవండి: మోర్గాన్.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా) ఇంగ్లండ్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డీకాక్, ఆమ్లాలు ఆరంభించారు. ఆమ్లా రిటైర్డ్ హర్ట్ కాగా, దక్షిణాఫ్రికా పది ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మర్కరమ్(11), డుప్లెసిస్(5)లు నిరాశపరిచారు. ఫలితంగా సఫారీలు 44 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన తొలి రెండు వికెట్లను జోఫ్రా ఆర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
కోహ్లి మరో రికార్డుపై కన్నేసిన ఆమ్లా
లండన్ : ప్రపంచకప్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండగ. 46 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండగ ఇంగ్లండ్ వేదికగా నేడు ప్రారంభమైంది. ప్రపంచకప్ 2019లో భాగంగా నేడు ఆతిథ్య ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతోంది. అయితే ప్రపంచకప్ ఆరంభపు మ్యాచ్‌లోనే ప్రొటీస్ సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా విరాట్ కోహ్లి రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతకుముందు విరాట్ ఈ ఘనతను 175 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ఇప్పటివరకు ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు పూర్తి చేశాడు. మంచి హిట్టింగ్తో ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమ్లా.. వన్డేల్లో 2000, 3000, 5000, 6000, 7000 పరుగులు సాధించిన ఆటగాడిగా ఆమ్లా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు అందుకుంటే దక్షిణాఫ్రికా తరుపున ఎనిమిది వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ఆమ్లా చేరతాడు. ఈ జాబితాలో జాక్వస్ కలిస్(11,550), డివిలియర్స్(9427), గిబ్స్(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఫామ్‌లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్లా ఈ మ్యాచ్‌లో రాణించాలని కసిగా ఉన్నాడు. ఇక ప్రొటీస్ జట్టుకూడా ఆమ్లాతో సహా టాపార్డర్ రాణిస్తే తమకు ఎదురుండదని భావిస్తోంది. చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం ఇమ్రాన్ తాహీర్ నయా రికార్డ్.. -
ఆమ్లా స్థానం పదిలం
డర్బన్: కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణాఫ్రికా సెలెక్టర్లు హషీమ్ ఆమ్లా వైపు మొగ్గు చూపారు. ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 174 వన్డేలు ఆడిన ఆమ్లా 27 సెంచరీలు, 37 అర్ధ సెంచరీల సహాయంతో 7910 పరుగులు సాధించాడు. అయితే గత 17 ఇన్నింగ్స్‌లో అతను ఒక సెంచరీ మాత్రమే చేయడంతో ఆమ్లాకు ప్రపంచకప్ బెర్త్ దక్కుతుందా లేదా అనే సందేహం కలిగింది. 2015 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈసారి వరల్డ్ కప్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు: డు ప్లెసిస్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఆమ్లా, మార్క్రమ్, డసెన్, డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, స్టెయిన్, రబడ, ఇన్‌గిడి, యాన్రిచ్ నోర్తె, ఇమ్రాన్ తాహిర్, షమ్సీ. -
దక్షిణాఫ్రికా 235 ఆలౌట్
డర్బన్: ఇంటాబయట వరుస పరాజయాలతో కుదేలైన శ్రీలంక... దక్షిణాఫ్రికా పర్యటనను మాత్రం ఆశావహంగా ప్రారంభించింది. బుధవారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టులో సఫారీలను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు... లంక పేసర్లు విశ్వ ఫెర్నాండో (4/62), రజిత (3/68) ధాటికి తడబడి 110 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మార్క్రమ్ (11), ఎల్గర్ (0), వెటరన్ హషీమ్ ఆమ్లా (3) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. బవుమా (47), కెప్టెన్ డు ప్లెసిస్ (35) కాసేపు నిలిచారు. ఈ దశలో వికెట్ కీపర్ డికాక్ (94 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్), కేశవ్ మహరాజ్ (29) ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక రోజు ముగిసే సమయానికి తిరిమన్నె (0) వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే (28 బ్యాటింగ్), ఒషాదా ఫెర్నాండో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
కోహ్లి రికార్డు బ్రేక్.. ఆమ్లాపై విమర్శలు
పోర్ట్ ఎలిజబెత్: క్రికెట్లో విజయాలు, రికార్డులనేవి టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇంటి చిరునామాగా మారిన విషయం తెలిసిందే. మహామహా సారథులు, ఆటగాళ్లతో సాధ్యం కాని పలు రికార్డులు, విజయాలను టీమిండియాకు అందించిన ఘనత కోహ్లికి దక్కుతుంది. అయితే కోహ్లికి సంబంధించిన ఓ రికార్డును తాజాగా దక్షిణాప్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా అధిగమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో సాధించిన శతకం సాధించడంతో కోహ్లిని వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఆమ్లా(108;120 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్) సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు 300 పరుగుల మార్క్ కూడా చేరలేకపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నప్పటికీ ధాటిగా ఆడకుండా సెంచరీ కోసం తాపత్రయపడ్డాడని మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఆమ్లా తన స్వార్థం చూసుకోకుండా ఆడి ఉంటే జట్టు స్కోరు 300 దాటేదని.. అప్పుడు దక్షిణాఫ్రికా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండేవని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. -
ఆమ్లా సెంచరీ: దక్షిణాఫ్రికా 266/2
పోర్ట్ ఎలిజబెత్: వెటరన్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా (120 బంతుల్లో 108 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చాన్నాళ్ల తర్వాత తనదైన స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు. అతడి అజేయ శతకంతో పాటు అరంగేట్ర ఆటగాడు వాన్ డెర్ డసెన్ (101 బంతుల్లో 93; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరవడంతో శనివారం పాకిస్తాన్‌తో తొలి వన్డేలో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. మరో ఓపెనర్ హెన్డ్రిక్స్ (67 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆమ్లా, హెన్డ్రిక్స్ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. 18వ ఓవర్లో షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో హెన్డ్రిక్స్ ఔటయ్యాడు. అనంతరం ఆమ్లా, వాన్ డెర్ రెండో వికెట్‌కు 155 పరుగులు జత చేశారు. సెంచరీ దిశగా సాగుతున్న వాన్ డెర్ 47వ ఓవర్లో హసన్ అలీ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హఫీజ్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఆమ్లా కెరీర్లో 27వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 42 ఓవర్లలో నాలుగు వికెట్లకు 223 పరుగులు చేసింది. -
పాండ్యా సూపర్ ఫీల్డింగ్.. టర్నింగ్ పాయింట్ ఇదే!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. గత నాలుగు వన్డేల్లో అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ విజయం సులువైంది. భువనేశ్వర్ వేసిన 35 ఓవర్ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా రెప్పపాటులో బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్ వికెట్ల వైపు విసరడంతో బంతి నేరుగా వికెట్లను తాకింది. ఫీల్డ్ అంపైర్ ధర్డ్ అంపైర్‌కు నివేదించాడు. అందరూ ఆమ్లా క్రీజులో బ్యాట్ పెట్టారని భావించారు. థర్డ్ అంపైర్‌కు సైతం నిర్ణయం ప్రకటించడం సవాలుగా మారింది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్ ఆమ్లా బ్యాట్ క్రీజుకు మిల్లీమీటర్ దూరంలో ఉండటాన్ని గుర్తించి అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆమ్లా పెవిలియన్ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అప్పటికి ఆతిథ్య జట్టు 166 పరుగుల చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆమ్లా అవుట్ కాకుంటే భారత్ విజయానికి చాలా కష్టమయ్యేదని, పాండ్యా సూపర్ ఫీల్డింగే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాండ్యా సూపర్ ఫీల్డింగ్.. టర్నింగ్ పాయింట్ ఇదే!
-
వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
-
హషీమ్ ఆమ్లా విఫలం
డర్బన్: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా బూమ్రా వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ఆమ్లా(16) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో దక్షిణాఫ్రికా 30 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ తీసుకుంది. దాంతో సఫారీల ఇన్నింగ్స్‌ను డీకాక్, ఆమ్లాలు కుదురుగా ఆరంభించారు. అయితే పేసర్లు భువనేశ్వర్ కుమార్, బ్రూమాల బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆమ్లా.. చివరకు బూమ్రా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. -
మూడొందలైనా ఫర్వాలేదు: ఆమ్లా
జొహన్నెస్‌బర్గ్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరదైన మూడో టెస్టు రసకందాయంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకు ఆలౌటైతే, సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు చాపచుట్టేశారు. దాంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శనపైనే విజయాకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 250 పరుగులకు పైగా చేస్తే పోరాడటానికి అవకాశం ఉంటుంది. కాగా, పేస్ విపరీతంగా అనుకూలిస్తున్నపిచ్పై మూడొందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా ఛేదిస్తామని సఫారీ స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తమకు భారత జట్టు మూడొందల లక్ష్యాన్ని నిర్దేశించినా ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆమ్లా 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కీలక వికెట్లు నేలరాలిన సమయంలో ఆమ్లా రాణించడంతో దక్షిణాఫ్రికా కాస్త ఫర్వాలేదనిపించింది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా భారత్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు కేఎల్ రాహుల్(16), చతేశ్వర పుజారా(1)లు మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరారు. -
ఆమ్లా రనౌటే టర్నింగ్
టెస్టు సిరీస్‌లో భారత్‌ను నిలబెట్టాలనే కసి కోహ్లి ఆటలో కనబడింది. గత టెస్టులో తడబడినట్లు కాకుండా అతను ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసం కనబరిచాడు. క్రీజ్‌లోకి రాగానే వచ్చే ఒత్తిడిని దరి చేరనీయకుండా చక్కని షాట్లతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టాడు. పిచ్ నుంచి కూడా సహకారం లభిస్తుండటంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను ఆధిగమించే అవకాశం భారత బ్యాట్స్‌మెన్ చేతిలో ఉంది. ఇప్పటికే తమకు లాభించే పిచ్‌ను తయారు చేయకపోవడంతో ప్రొటీస్ ఆత్మరక్షణలో పడినట్లుంది. చూస్తుంటే భారత్‌కు మేలుచేకూర్చేలా ఈ పిచ్ ఉందనిపిస్తుంది. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ ప్రొటీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రయోగించి ఫలితాలు సాధించాడు. అతనికి ఇషాంత్ శర్మ మంచి తోడ్పాటు అందించాడు. వారి ఇన్నింగ్స్‌ను ఆమ్లా రనౌట్ మలుపుతిప్పింది. హర్దిక్ పాండ్యా మెరుపు వేగంతో స్పందించి నేరుగా వికెట్లను గిరాటు వేశాడు. ఇది భారత్ పట్టుబిగించేందుకు దోహదం చేసిందనే చెప్పాలి. కానీ దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల్లోపే ఆలౌట్ చేయలేకపోవడం భారత శిబిరాన్ని కాస్త నిరాశపరిచింది. 335 పరుగులు తక్కువేం కాదు. ఇప్పటికైతే పిచ్ బ్యాటింగ్‌కు కలిసొచ్చేలా ఉంది. దీన్ని అనువుగా మలచుకొని భారత్ ఈ మ్యాచ్‌లో నిలిచేందుకు పోరాడాలి. ఈ నేపథ్యంలో మూడోరోజు భారత్‌కు కీలకం కానుంది. -
శభాష్ హార్దిక్
-
వాటే ఎ త్రో హార్దిక్
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్బుతమైన ఫీల్డింగ్‌తో శభాష్ అనిపించాడు. మ్యాచ్‌పై సఫారీలు పట్టుబిగిస్తున్న వేళ హార్దిక్ ఒక అద్భుతమైన త్రో ద్వారా హాషీమ్ ఆమ్లా(82;153 బంతుల్లో 14 ఫోర్లు)ను రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 81 ఓవర్‌ను అందుకున్న హార్దిక్.. ఐదో బంతికి ఆమ్లాకు షాకిచ్చాడు. ఆ బంతిని క్రీజ్ దగ్గరగానే డిఫెన్స్ ఆడిన ఆమ్లా పరుగు కోసం యత్నించాడు. అయితే అంతే వేగంగా అథ్లెట్‌ను తలపిస్తూ బంతిపైకి దూసుకొచ్చిన హార్దిక్.. బంతిని అందుకున్న మరుక్షణమే నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వికెట్లను నేలకూల్చాడు. అప్పటికి ఇంకా క్రీజ్‌లో చేరుకోలేని ఆమ్లా భారంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనిపై రివ్యూకు వెళ్లినా ఆమ్లాకు నిరాశ తప్పలేదు. దాంతో 246 పరుగుల వద్ద సఫారీలు నాల్గో వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అటు తరువాత డీకాక్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆపై ఫిలిండర్ రనౌట్‌గా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 251 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ ఒక వికెట్ తీశాడు. రెండు వికెట్లు రనౌట్ల రూపంలో వచ్చాయి. -
ఆమ్లా అరుదైన ఘనత
సెంచూరియన్: దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. సెంచూరియన్‌లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆమ్లా ఈ ఘనతను సాధించాడు. తద్వారా ఇప్పటివరకూ జాక్వస్ కల్లిస్ పేరిట (1267) రికార్డును ఆమ్లా సవరించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆమ్లా 65 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా కల్లిస్ రికార్డును బద్దలు కొట్టాడు. సెంచూరియన్‌లో 12 టెస్టు మ్యాచ్‌లో ఆడిన ఆమ్లా ఈ ఫీట్ సాధించగా, కల్లిస్ 16 టెస్టుల్లో ఆడాల్సి వచ్చింది. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్(1177) మూడో స్థానంలో ఉన్నాడు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఎల్గర్(31), మర్క్రామ్(94)లు శుభారంభం అందించారు. అటు తరువాత ఆమ్లా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. సఫారీలు కోల్పోయిన మూడు వికెట్లలో రెండు అశ్విన్ సాధించగా, ఒక వికెట్ ఇషాంత్‌కు లభించింది. -
'ఆ క్రికెటర్‌ను కాపీ కొట్టే వాణ్ని'
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో విరాట్ కోహ్లిని పోల్చడం ఎక్కువైతే, అదే సమయంలో కోహ్లితో వేరే క్రికెటర్లని పోల్చడం కూడా సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లలో విరాట్ ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇలా విరాట్ కోహ్లితో పోల్చే ఆటగాళ్లలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డీకాక్‌తో పాటు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజమ్ కూడా ఉన్నాడు. కాగా, తన అభిమాన క్రికెటర్ల గురించి మరోసారి పెదవి విప్పిన బాబర్.. తాను ఫాలో అయ్యే క్రికెటర్లలో కోహ్లికే తొలిస్థానం ఇచ్చాడు 'ప్రస్తుతం నేను విరాట్ బ్యాటింగ్‌ను ఫాలో అవుతున్నా. గతంలో ఏబీ డివిలియర్స్‌ను ఎక్కువగా అనుసరించే వాణ్ని. ఎంతలా అంటే అతను ఆడే షాట్లను ప్రత్యేకంగా సాధన చేసేవాడిని. ఒక్కమాటలో చెప్పాలంటే ఏబీని కాపీ కొట్టేవాడిని. ప్రధానంగా నెట్స్‌లో కనీసం కొన్ని షాట్లైనా ఏబీ మ్యాచ్‌ల్లో కొట్టిన షాట్లను ప్రాక్టీస్ చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు నేను ఫాలో అయ్యే క్రికెటర్లలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడు. కోహ్లి బ్యాటింగ్ శైలిని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటా. కోహ్లి, ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌ల బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. దాంతోనే వారిపై విపరీతమైన అభిమానం ఏర్పడింది' అని బాబర్ అజమ్ తెలిపాడు. తనను కోహ్లితో పోల్చడంపై కూడా అజమ్ స్పందించాడు. కోహ్లితో పోల్చడం గర్వకారణమే అయినా, అతను సాధించిన ఘనతల్ని తాను సాధించలేదనే వాస్తవం గ్రహించాలన్నాడు. ఆ నేపథ్యంలో తనకు కోహ్లితో పోలిక సరికాదన్నాడు. -
ఫీల్డ్ లో ఇద్దరు ఆమ్లాలు!
బ్లోమ్ ఫోంటీన్:దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ ల జట్ల మధ్య జరిగిన ఇక్కడ గురువారం జరిగిన తొలి టీ 20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ఓపెనర్లు హషీమ్ ఆమ్లా-డీకాక్ లు ఆరంభించిందుకు అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇద్దరు ఆమ్లాలు ఒకేసారి కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చమొదలైంది. వారిద్దరూ ధరించిన జెర్సీలపై ఆమ్లా అని పేరు ఉండటంతో దీన్ని చూసిన ప్రేక్షకులు కొద్దిపాటిఇబ్బందికి గురయ్యారు. అయితే కాసేపటికి జరిగిన విషయాన్ని తెలుసుకుని నవ్వుకోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు డీకాక్ జెర్సీ కనిపించలేదు. ఎంత వెదికినా తన జెర్సీ దొరక్కపోవడంతో ఆమ్లా తన జెర్సీని అందించాడు. ఆ క్రమంలోనే ఆమ్లా జెర్సీ వేసుకుని డీకాక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. అయితే మ్యాచ్ కాసేపు జరిగే వరకూ ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఆమ్లా(3)అవుటైన తరువాత డివిలియర్స్ తో కలిసి డీకాక్ ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల్లో గందరగోళం మొదలైంది. ఆమ్లా అవుటై పెవిలియన్ కు చేరితే మళ్లీ ఎలా వచ్చాడనే సందిగ్థత ఏర్పడింది. కాకపోతే చివరకు అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.మొదటి టీ 20లో సఫారీలు 20 పరుగుల తేడాతో విజయం సాధించారు. -
కోహ్లి రికార్డులకు డేంజర్?
సాక్షి : టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు చూస్తుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును అందుకునేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించటం లేదు. అయితే కోహ్లీ రికార్డులపైనే కన్నేసిన ఓ క్రికెటర్ మాత్రం అతని కంటే ముందుగా ఆ పని చేస్తాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సౌతాఫ్రికా జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా, మరో రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో కోహ్లి సాధించిన 26 సెంచరీల రికార్డును.. ఆమ్లా తక్కువ మ్యాచ్‌ల్లోనే అధిగమించటం విశేషం. ఆదివారం బంగ్లాదేశ్‌తో డైమండ్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా ఈ ఫీట్‌ను సాధించాడు. కోహ్లి 166 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే... ఆమ్లా కేవలం 154 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆమ్లాకు కోహ్లి రికార్డులను బద్ధలు కొట్టడం కొత్తేం కాదు. గతంలో కోహ్లి 7 వేల పరుగుల ఘనతను కూడా అతితక్కువ మ్యాచ్‌ల్లోనే ఆమ్లా సాధించాడు. ఆమ్లా 150 ఇన్నింగ్స్, కోహ్లి 169 ఇన్నింగ్స్‌లతో ఆ ఘనత అందుకున్నారు. సౌతాఫ్రికా జట్టు తరపున అత్యంత వేగం పరుగులు సాధిస్తున్న క్రీడాకారుడిగా ఆమ్లా రికార్డుకెక్కాడు. అయితే ఆమ్లా తన కన్నా వయసులో పెద్దవాడు కావటం.. ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించే అవకాశాలు లేకపోవటంతో భవిష్యత్తులో కోహ్లి హవా కొనసాగొచ్చనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాతోనే జరిగిన మ్యాచ్‌లోనే మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. వికెట్ కోల్పోకుండా 279 పరుగుల లక్ష్యాన్ని చేధించి వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా మూడో స్థానంలో ఆమ్లా-డి కాక్ నిలిచారు. బంగ్లా తరపున సౌతాఫ్రికాపై తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా ముషిఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. -
సఫారీల వేట షురూ
♦ శ్రీలంకపై ఘనవిజయం ♦ హషీమ్ ఆమ్లా శతకం ♦ చాంపియన్స్ ట్రోఫీ ఓవల్: శ్రీలంక జట్టుపై తమ ఆధిపత్యాన్ని దక్షిణాఫ్రికా మరోసారి చాటుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ హషీమ్ ఆమ్లా (103; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి సెంచరీకి తోడు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (4/27)) బౌలింగ్ జోరుతో సఫారీ జట్టు 96 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. లంకపై దక్షిణాఫ్రికాకు వరుసగా ఇది ఎనిమిదో విజయం కావడం విశేషం. కెరీర్లో 25వ శతకం బాదిన ఆమ్లా 151 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించి కోహ్లి (162 ఇన్నింగ్స్)ని వెనక్కినెట్టాడు. అంతకుముందు ప్రొటీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 299 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక 41.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తాత్కాలిక కెప్టెన్ ఉపుల్ తరంగ (69 బంతుల్లో 57; 6 ఫోర్లు), డిక్వెలా (33 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్), పెరీరా (66 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. గాయం కారణంగా శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ మాథ్యూస్ బరిలోకి దిగలేదు. ఆమ్లా శతకం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హషీమ్ ఆమ్లా శతకం, డు ప్లెసిస్ అర్ధ సెంచరీ కీలకంగా నిలిచాయి. అయితే ఆరంభంలో లంక పేసర్లు వేసిన కట్టుదిట్టమైన బంతులకు పరుగులు తీసేందుకు జట్టు ఇబ్బంది పడింది. ఏడో ఓవర్లో జట్టుకు తొలి ఫోర్ లభించింది. క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బందిపడిన డి కాక్ (42 బంతుల్లో 23; 2 ఫోర్లు) 13వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక్కడి నుంచి ఆమ్లా, డు ప్లెసిస్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. 24వ ఓవర్లో ఆమ్లా ఓ సిక్స్ బాదగా డు ప్లెసిస్ ఓ ఫోర్ కొట్టడంతో జట్టు రన్నేట్ తొలిసారిగా ఐదుకి చేరింది. 52 బంతుల్లో డుప్లెసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రదీప్ బౌలింగ్‌లో చండిమాల్ అందుకున్న అద్భుత క్యాచ్‌కు అతడు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెండో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. డి విలియర్స్ (4) నిరాశపరిచాడు. 112 బంతుల్లో ఆమ్లా సెంచరీ పూర్తి చేసుకోగా... మరుసటి బంతికే మిల్లర్ (18; 1 ఫోర్, 1 సిక్స్)ను లక్మల్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్ (43)లో ఆమ్లా రనౌట్ అయినా... చివర్లో డుమిని (20 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), మోరిస్ (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) చెలరేగి భారీ స్కోరును అందించారు. తరంగ ఒక్కడే... 300 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ప్రొటీస్ పేసర్లపై ఎదురుదాడికి దిగిన ఓపెనర్లు డిక్వెల్లా, తరంగ ధాటికి రన్‌రేట్ దూసుకెళ్లింది. అయితే ఏడో ఓవర్లో వరుసగా 6,4 బాదిన డిక్వెలాను మోర్కెల్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు 14 ఓవర్లలోనే వంద పరుగులు చేసిన లంక స్కోరు ఆ తర్వాత ఒక్కసారిగా నెమ్మదించింది. స్పిన్నర్ తాహిర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో మిడిలార్డర్ తడబడింది. కపుగెడెరను డకౌట్ చేసిన తాహిర్ కొద్దిసేపట్లోనే క్రీజులో కుదురుకున్న తరంగను కూడా అవుట్ చేయడంతో లంక ఆశలు వదులుకుంది. చివర్లో పెరీరా పోరాటం వృథా అయ్యింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా రనౌట్ 103; డికాక్ (సి) డిక్వెలా (బి) ప్రదీప్ 23; డు ప్లెసిస్ (సి) చండిమాల్ (బి) ప్రదీప్ 75; డివిలియర్స్ (సి) కపుగెడెర (బి) ప్రసన్న 4; మిల్లర్ (సి) ప్రసన్న (బి) లక్మల్ 18; డుమిని నాటౌట్ 38; మోరిస్ రనౌట్ 20; పార్నెల్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 299. వికెట్ల పతనం: 1–44, 2–189, 3–194, 4–226, 5–232, 6–277. బౌలింగ్: మలింగ 10–0–57–0, లక్మల్ 10–0–51–1, ప్రదీప్ 10–0–54–2, గుణరత్నే 10–0–64–0; ప్రసన్న 10–0–72–1. శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) పార్నెల్ (బి) మోర్కెల్ 41; తరంగ (సి) మిల్లర్ (బి) తాహిర్ 57; మెండిస్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 11; చండిమాల్ రనౌట్ 12; కపుగెడెర ఎల్బీడబ్ల్యూ (బి) తాహిర్ 0; పెరీరా నాటౌట్ 44; గుణరత్నే (సి) పార్నెల్ (బి) తాహిర్ 4; ప్రసన్న ఎల్బీడబ్ల్యూ (బి) మోరిస్ 13; లక్మల్ రనౌట్ 0; మలింగ (బి) రబడ 1; ప్రదీప్ (సి) డుమిని (బి) తాహిర్ 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (41.3 ఓవర్లలో ఆలౌట్) 203. వికెట్ల పతనం: 1–69, 2–94, 3–116, 4–117, 5–146, 6–155, 7–191, 8–191, 9–192, 10–203. బౌలింగ్: రబడ 8–1–46–1, పార్నెల్ 10–0–54–0, మోర్కెల్ 6–0–31–1, మోరిస్ 7–0–32–2, ఇమ్రాన్ తాహిర్ 8.3–0–27–4, డుమిని 2–0–7–0. -
కోహ్లి మరో రికార్డు బద్దలైంది..
లండన్: వేగంగా ఇరవై ఐదు వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. తాజాగా ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అధిగమించాడు. గతేడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వేగంగా 25 సెంచరీలు సాధించిన రికార్డను విరాట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రికార్డును దాదాపు ఏడాది వ్యవధిలో ఆమ్లా బద్ధలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆమ్లా(103) శతకం సాధించాడు. తద్వారా 25వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఆ రికార్డును వేగవంతంగా సాధించిన అరుదైన ఘనతను ఆమ్లా సొంతం చేసుకున్నాడు. ఈ ఫీట్ ను సాధించడానికి ఆమ్లాకు 151 ఇన్నింగ్స్ లు అవసరమైతే, కోహ్లి 162 ఇన్నింగ్స్ లో నమోదు చేశాడు. అంతకుముందు విరాట్ కోహ్లి వన్డేల్లో వేగంగా ఏడువేల పరుగులు చేసిన రికార్డును కూడా ఆమ్లానే సవరించడం ఇక్కడ విశేషం. ఇటీవల ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో ఆమ్లా ఏడు వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. దాంతో ఆమ్లా 151 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకొని ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఆ క్రమంలోనే కోహ్లి 161 ఇన్నింగ్స్‌లలోనే నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. -
కోహ్లి రికార్డుకు సఫారీ ఎసరు
వన్డేలలో వేగంగా ఏడువేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హాషిమ్ ఆమ్లా కోహ్లిని అధిగమించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, ఫైనల్ వన్డేలో అతను ఏడువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతంలో ఈ రికార్డు సఫారీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండటం గమనార్హం. డివిలియర్స్ 166 ఇన్నింగ్స్‌లలో ఏడువేల పరుగులు పూర్తిచేయగా, కోహ్లి 161 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అధిగమించి వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు మరో సఫారీ బ్యాట్స్‌మన్ ఆమ్లా 151 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకొని ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. నిజానికి ఈ రికార్డు భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట చాలాకాలం కొనసాగింది. గంగూలీ 174 ఇన్నింగ్స్‌లలోనే 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న వెస్టిండీస్ లెజండ్ బ్రియాన్ లారా 183 ఇన్నింగ్స్‌ల్లో ఈ క్లబ్బులో చేరాడు. ఈ వారమే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానున్న నేపథ్యంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు సొంతం చేసుకుంది. మూడో వన్డేను దక్షిణాఫ్రికా గెలుపొందినప్పటికీ, మొదటి రెండు వన్డేలలో ఇంగ్లండ్ గెలువడంతో సిరీస్ ఆ జట్టును వరించింది. మూడో వన్డేలో 55 పరుగులు చేసిన ఆమ్లా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
గెలిపించని శతకాలు ఇవే..
హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం. హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017) ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు. ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా ఆమ్లా గుర్తింపు పొందాడు. పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016) ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు. వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014) ఐపీఎల్-2014 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94) చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011) ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010) ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా, రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు. ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008) ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61) విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. -
'ఇక్కడ బ్యాట్స్‌మెన్ సక్సెస్ రేటు ఎక్కువ'
మొహాలి: క్రికెటర్లు బ్యాట్స్‌మెన్ గా సక్సెస్ కావడానికి ట్వంటీ 20 ఫార్మాట్ అనేది ఎంతగానో దోహదపడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్, కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. పెద్దగా హిట్టింగ్ చేయని తనలాంటి ఆటగాళ్లకు ట్వంటీ 20 క్రికెట్ అనేది భారీగా పరుగులు చేయడానికి ఉపయోగపడుతుందన్నాడు. దీని ద్వారా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను కూడా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆమ్లా తెలిపాడు. 'ఇక్కడ సక్సెస్ కావడానికి క్రికెట్ గురించి లోతైన శోధన అవసరం లేదు. ట్వంటీ 20 ఫార్మాట్ క్రికెట్ ద్వారా ప్రతీ బంతిని ఎదుర్కోవడం తెలియాలి. దాదాపు 10 ఏళ్ల ఈ ఫార్మాట్ ను పరిశీలిస్తే అనేక మంది విజయవంతమైన క్రికెటర్లు ఉన్నారు. ఇది బ్యాట్స్‌మెన్ సక్సెస్ ఫార్మాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు .ఈ ఫార్మాట్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మందికి తొలుత భారీ హిట్టింగ్ అనేది తెలియకపోవచ్చు. ఇక్కడకు వచ్చిన తరువాత దీనికి అలవాటై పరుగులు ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నారు. ఆ రకంగా బ్యాట్స్‌మెన్ సక్సెస్ కు ఐపీఎల్ కానీ, ట్వంటీ 20 క్రికెట్ కానీ ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం. ఇక్కడ బ్యాట్స్‌మెన్ సక్సెస్ రేటు ఎక్కువ' అని ఆమ్లా తెలిపాడు. -
రెండు సెంచరీలు... ప్చ్!
మొహాలీ: అతడు రెండుసార్లు సెంచరీ కొట్టినా జట్టు విజయం సాధించలేదు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడి శతకాలు బాదినా గెలుపు మాత్రం దక్కలేదు. ఐపీఎల్-10లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు హషిమ్ ఆమ్లా సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు పరాజయం పాలైంది. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా అద్భుతంగా ఆడి (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆమ్లా శతకం వృధా అయింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా శతకం బాదాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమ్లా శ్రమ ఫలించలేదు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆమ్లా తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుందని, తాను మంచి షాట్లు కొట్టానని చెప్పాడు. తమ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశానికి పయనమవుతున్న ఆమ్లా మిగతా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఈ సీజన్లో అతడు 10 మ్యాచులు ఆడి 420 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. -
ఎంతమంది బ్యాట్స్ మెన్ ఇలా చేస్తున్నారు!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీం ఆమ్లా నిజాయితీని మెచ్చుకున్నాడు. ఈ కాలంలో కూడా అతనిలా ఎవరైనా నిజాయితీగా ఉంటూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించగలరా అని ప్రశ్నించాడు. అసలు విషయం ఇది.. నిన్న (శుక్రవారం) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్లోనే హషీం ఆమ్లా ఔటయ్యాడు. బెంగళూరు బౌలర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతిని ఆమ్లా ఆడగా ఎడ్జ్ తీసుకుంది. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేదార్ జాదవ్ చేతుల్లో పడింది. బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేసేలోగానే ఆమ్లా క్రీజు వదిలి వెళ్లిపోయాడు. వాస్తవానికి ఆ బంతి బ్యాట్ కు తాకిందా లేదా అన్నదానిపై కీపర్ జాదవ్, బౌలర్ చౌదరికి స్పష్టతలేకున్నా.. ఆమ్లా మాత్రం నిజాయితీగా ఔట్ ను ఒప్పుకున్నాడు. దీనిపై గుజరాత్ లయన్స్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో ప్రశంసించాడు. ‘ఎంత మంది బ్యాట్స్ మెన్.. బౌలర్లు అప్పీలు చేయకుండానే క్రీజు వదిలి వెళ్లిపోతున్నారు. ఆమ్లా నిజాయితీని చూసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి’ అంటూ పఠాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో పట్టుదలతో ఆడిన పంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. How many batsmen would walk without bowler appealing but that's how this guy plays his cricket @amlahash @IPL #honestman — Irfan Pathan (@IrfanPathan) 5 May 2017 -
టీమిండియా వైదొలిగితే భారీ నష్టం
బెంగళూరు: చాంపియన్స్ ట్రోఫి నుంచి టీమిండియా వైదొలిగితే భారీ నష్టం ఏర్పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీం ఆమ్లా, డేవిడ్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికమంది క్రికెట్ అభిమానులున్నారని, ఈ టోర్నీలో భారత్ ఆడకపోతే ఆదరణ తగ్గుందని, భారీ నష్టం తప్పదని చెప్పారు. చాంపియన్స్ ట్రోఫీలో టాప్-8 జట్లు ఆడితేనే ఆసక్తిగా ఉంటుందని మిల్లర్, ఆమ్లా అభిప్రాయపడ్డారు. భారత్ రాకుంటే ఆ జట్టు స్థానంలో ఎవరు ఆడుతారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. దీనివెనుక రాజకీయాల గురించి తమకు తెలియదన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను గత నెల 25వ తేదీ లోపు ప్రకటించాల్సివుండగా.. బీసీసీఐ గడువులోపు జట్టును ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు వచ్చాయి. ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలే ఇందుకు కారణమన్న వాదనలు తెరపైకి వచ్చాయి. -
లయన్స్‌పై ‘పంజా’బ్
►26 పరుగులతో కింగ్స్ ఎలెవన్ విజయం ►హషీమ్ ఆమ్లా అర్ధ సెంచరీ ►దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం రాజ్‌కోట్: వరుసగా నాలుగు ఓటముల అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కోలుకుంది. ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 26 పరుగుల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (40 బంతుల్లో 65; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో అర్ధ సెంచరీతో చెలరేగగా... అక్షర్ పటేల్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు; 2 వికెట్లు) ఆల్‌రౌండ్ మెరుపులతో అలరించాడు. సొంత వేదికపై లయన్స్ జట్టుకిది వరుసగా రెండో ఓటమి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ రైనా (24 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. కరియప్ప, అక్షర్, సందీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆమ్లా జోరు...: కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన పేసర్ నాథూ సింగ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ వోహ్రా (2)ను అవుట్ చేశాడు. ఈ క్యాచ్‌ను అందుకున్న దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో వంద మందిని అవుట్ చేయడంలో భాగమైన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. నాథూ తన రెండో ఓవర్లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వగలిగాడు. ఆరో ఓవర్లో ఆమ్లా రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 50 పరుగులు చేయగలిగింది. ఇదే జోరుతో 30 బంతుల్లో ఆమ్లా మరో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు వరుసగా సిక్స్, ఫోర్ బాది జోరు మీదున్న మార్ను టై దెబ్బతీశాడు. 14వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ రెండు సిక్సర్లతో విరుచుకుపడినా అదే ఓవర్లో ఆమ్లా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మ్యాక్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు.19వ ఓవర్లోఅక్షర్ రెండు సిక్సర్లు, ఫోర్‌తో రెచ్చిపోయి అదే ఓవర్లో అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు రావడంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది. లయన్స్ తడబాటు: లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టులో దినేశ్ కార్తీక్ మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. తొలి ఓవర్లోనే మెకల్లమ్ (6) అవుటవ్వడంతోపాటు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. రైనా వేగంగా ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్ దగ్గర మ్యాక్స్‌వెల్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా (9), డ్వేన్ స్మిత్ (4), అక్షదీప్ వరుస ఓవర్లలో అవుట్ కాగా... అటు రన్‌రేట్ కూడా భారీగా పెరిగిపోవడంతో లయన్స్ కోలుకోలేకపోయింది. మరోవైపు గాయం కారణంగా లయన్స్ జట్టు సభ్యుడు డ్వేన్ బ్రేవో ఐపీఎల్–10 నుంచి వైదొలిగాడు. -
ఎదురులేని ముంబై
-
ఎదురులేని ముంబై
► వరుసగా ఐదో విజయం ► చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ► చెలరేగిన బట్లర్, నితీశ్ రాణా ► ఆమ్లా శతకం వృథా హషీమ్ ఆమ్లా.. పక్కా టెస్టు ఆటగాడు.. అసలు ఇలాంటి ఆటగాడికి ఐపీఎల్లో చోటు ఎలా దక్కిందో.. ఇవీ సగటు క్రికెట్ అభిమాని అతడిపై చేసే కామెంట్స్. అయితే అలాంటి వారికి సమాధానంగా అన్నట్టు పొట్టి ఫార్మాట్లోనూ తనదైన క్లాస్ ఇన్నింగ్స్‌కు చోటుంటుందని ఈ ఓపెనర్ నిరూపించాడు. అతడి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఔరా.. ఆడుతోంది ఆమ్లానేనా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఒక్క సిక్స్ కొడితే గ్రేట్ అనుకునే తన బ్యాట్ నుంచి ఏకంగా ఆరు సిక్సర్లు బుల్లెట్ వేగంతో స్టాండ్స్‌ను ముద్దాడగా.. 58 బంతుల్లోనే కెరీర్లో తొలి టి20 శతకాన్ని అందుకుని జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డాడు. ఇందులో 51 పరుగులు ఒక్క మలింగ బౌలింగ్‌లోనే సాధించడం విశేషం. అయితే జోస్ బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌కు తోడు పార్థివ్, నితీశ్ రాణాల మెరుపు ఆటతో ముంబై ఇండియన్స్ 199 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే కింగ్స్ ఎలెవన్‌ను చిత్తు చేసి వరుసగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై మళ్లీ అగ్రస్థానానికి చేరింది. ఇండోర్: ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్ చెలరేగుతోంది. 199 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం తడబడకుండా 15.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఓపెనర్ జోస్ బట్లర్ (37 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో పాటు నితీశ్ రాణా (34 బంతుల్లో 62 నాటౌట్; 7 సిక్సర్లు) టోర్నీలో మూడో అర్ధ సెంచరీ సాధించగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 198 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (60 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) టి20 కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగినా లాభం లేకపోయింది. మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మెక్లీనగన్‌కు రెండు, కృనాల్.. బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలో రెండు వికెట్లకు 199 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు బట్లర్‌కు దక్కింది. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఆమ్లా సూపర్ శతకం సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన షాన్ మార్‡్ష (21 బంతుల్లో 26; 5 ఫోర్లు) ఉన్నంతసేపు బౌండరీలతో మెరిశాడు. ఆరో ఓవర్లో తను వెనుదిరగ్గా వృద్ధిమాన్ సాహా (15 బంతుల్లో 11) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే ఆమ్లా, కెప్టెన్ మ్యాక్స్‌వెల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ఉరకలెత్తించారు. 34 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన మ్యాక్స్‌వెల్ మరుసటి ఓవర్లో మెక్లీనగన్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,6,4,4,6తో రెచ్చిపోవడంతో 28 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్లో ఆమ్లా ఒక్కసారిగా జూలు విదిల్చి రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టి 22 పరుగులు అందించాడు. ఈ రెండు ఓవర్లలోనే జట్టుకు 50 పరుగులు రావడం విశేషం. 17వ ఓవర్లో బుమ్రా తన అప్పర్ కట్‌తో మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీశాడు. అప్పటికే మూడో వికెట్‌కు 33 బంతుల్లోనే 83 పరుగులు జత చేరాయి. తర్వాత ఓవర్లో స్టొయినిస్ (1) అవుట్ అయినా చివరి ఓవర్లో ఆమ్లా వరుసగా రెండు సిక్సర్లు బాది టి20 కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు. బట్లర్, రాణా తుఫాన్ ఇన్నింగ్స్ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు సంచలన ఆరంభం లభించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్, బట్లర్ మెరుపు ఆటతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరి ధాటికి పవర్‌ప్లేలో ముంబై తమ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 82 పరుగులు సాధించింది. ఇందులో ఆరు మాత్రమే డాట్ బంతులుండగా.. 14 బౌండరీలు బాదారంటే వీరిద్దరి జోరును అర్థం చేసుకోవచ్చు. స్టొయినిస్ వేసిన ఆరో ఓవర్లో పార్థివ్ వరుసగా 6,4 బాదినా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తొలి వికెట్‌కు 81 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత బట్లర్‌కు నితీశ్ రాణా జత చేరడంతో స్కోరు అదే వేగంతో దూసుకెళ్లింది. 24 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ చేశాడు. 12వ ఓవర్లో రాణా వరుసగా రెండు సిక్సర్లు బాదగా ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ కూడా వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో చేయాల్సిన రన్‌రేట్ బాగా తగ్గిపోయింది. అయితే 13వ ఓవర్లో బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌కు మోహిత్ శర్మ తెరదించడంతో రెండో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అప్పటికే మ్యాచ్ ముంబై చేతుల్లోకి రావడంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. 15వ ఓవర్లో రాణా ఓ సిక్సర్‌తో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా హార్ధిక్ పాండ్యా (4 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇదే ఓవర్లో వరుసగా 6,4,4 కొట్టడంతో చివరి ఐదు ఓవర్లలో లక్ష్యం 8 పరుగులకు చేరింది. దీంతో మరో 27 బంతులుండగానే ముంబై సునాయాసంగా నెగ్గింది. ►ఐపీఎల్లో ముంబైకిదే అత్యధిక లక్ష్య ఛేదన. 2014లో రాజస్తాన్ రాయల్స్‌పై 190 పరుగులు ఛేదించింది. ► ఇన్నింగ్స్‌లో ఒక్క మలింగ బౌలింగ్‌లోనే ఆమ్లా 51 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్లో ఇది రెండో అత్యధికం. గతంలో ఉమేశ్ బౌలింగ్‌లో కోహ్లి 52 పరుగులు చేశాడు. ఐపీఎల్లో నేడు కోల్‌కతా & గుజరాత్ వేదిక: కోల్‌కతా, రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వరుస విజయాలు.. కింగ్స్ వెనుక ఉన్నదెవరు?
గత ఏడాది అత్యంత చెత్త ప్రదర్శనతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు.. ఈసారి సరికొత్త ఉత్సాహంతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నది. తాజా టోర్నమెంటులో వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదుంది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌పై ఆరు వికెట్లతో విజయం సాధించిన పంజాబ్ తాజాగా పటిష్టమైన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎనిమిది వికెట్లతో సునాయసంగా మట్టికరిపించింది. మరీ, పంజాబ్ జట్టు వరుస విజయాలు వెనుక ఉన్నదెవరంటే.. ఈ క్రెడిట్ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్దేనంటున్నాడు ఆ జట్టు బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా. ‘ఒక శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అయిన సెహ్వాగ్ ఆటగాళ్ల విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేశారు’ అని ఆమ్లా చెప్పాడు. ఒకప్పుడు వీరోచిత ఓపెనర్ అయిన సెహ్వాగ్ కింగ్స్ ఆటగాళ్ల విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని తెలిపాడు. తమ ఆటశైలిని మార్చాలని ఆయన ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని పేర్కొన్నాడు. ’భారత్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్‌లో వీరూ ఒకరన్న విషయం మా అందరికీ తెలుసు. ఒక ప్రత్యేకశైలికి అలవాటుపడాలని చెప్పే వ్యక్తి ఆయన కాదు. ప్రతి ఆటగాడు తమ సామర్థ్యంమేరకు ఉత్తమంగా రాణించాలని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు. జట్టుకు ఉపయోగపడేరీతిలో ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించేవారు’ అని ఆమ్లా తెలిపారు. ఇక జట్టు కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్ కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని, సీనియర్ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలు పట్టించుకుంటారని ఆమ్లా కొనియాడాడు. -
దక్షిణాఫ్రికా 123/4
హామిల్టన్: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలిరోజు కేవలం 41 ఓవర్ల ఆటే సాగింది. శనివారం మొదలైన ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (50; 9 ఫోర్లు) రాణించాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ, గ్రాండ్‌హోమ్ చెరో 2 వికెట్లు తీశారు. టెస్టుల్లో 32వ అర్ధసెంచరీ సాధించిన ఆమ్లా ఈ క్రమంలో టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
హషీమ్ ఆమ్లా అరుదైన ఘనత
సెంచూరియన్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా యాభై అంతర్జాతీయ సెంచరీలను పూర్తి చేసుకున్న ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో ఆమ్లా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం లంకేయులతో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో ఆమ్లా 134 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఆమ్లా వన్డే కెరీర్ లో 24వ సెంచరీ. మరొకవైపు ఏబీ డివిలియర్స్ తో కలిసి ఈ ఫార్మాట్ లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో 24 శతకాలు సాధించిన ఆమ్లా.. టెస్టుల్లో 26 సెంచరీలను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్(100) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(71) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(63) , దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు కల్లిస్(62), శ్రీలంక మాజీ ఆటగాడు మహేలా జయవర్ధనే(54), వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా(53)లు ఉన్నారు. -
ఆదాబ్ ఆమ్లా...
100వ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జొహన్నెస్‌బర్గ్: పుష్కర కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ప్రధాన భాగంగా మారిన హషీమ్ ఆమ్లా గురువారం అరుదైన మైలురాయిని చేరుకుంటున్నాడు. తన టెస్టు కెరీర్లో అతను వందో టెస్టు బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడి వాండరర్స్ మైదానంలో నేటినుంచి దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగే మూడో టెస్టు ఆమ్లాకు 100వ మ్యాచ్ కానుంది. ‘ప్రొటీస్’ టీమ్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలుస్తాడు. 2004 డిసెంబర్లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడిన హషీం, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్ సెంచరీ ఆమ్లా పేరిటే ఉంది. వ్యక్తిత్వం భిన్నం: మత విశ్వాసాలను పాటించే క్రమంలో టీమ్ జెర్సీపై లిక్కర్ కంపెనీ బ్రాండ్‌ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి హషీం ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్ డీన్‌జోన్స్ ‘టెర్రరిస్ట్’ అని సంబోధించడంతోనే ఆమ్లా ఎవరనేది అంతా ఆసక్తి చూపించారు. కానీ ఆమ్లా మాత్రం వీటన్నింటినీ అసలు పట్టించుకోలేదు. కేవలం తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు. వివాదాలకు దూరం, మాటల్లో ఎక్కడా నోరుజారని తత్వం, చెరగని చిరునవ్వు హషీంను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు, మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు, 15 టెస్టుల తర్వాత కూడా సగటు 25.50 మాత్రమే! ఫలితంగానే రెండేళ్ల పాటు జట్టుకు దూరం. కానీ పునరాగమనం చేసిన తర్వాత తిరుగులేని ఆటతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు. ఇటీవల విఫలమవుతున్న ఆమ్లా తన వందో టెస్టుతో ఫామ్‌లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేసిన డు ప్లెసిస్ ‘బహుశా దక్షిణాఫ్రికా తరఫున వంద టెస్టులు ఆడబోయే చివరి వ్యక్తి ఆమ్లానే’ అని సహచరుడిని ప్రశంసించాడు. ప్రైవేట్ వ్యక్తిగా, తనదైన సొంత ప్రపంచంలోనే ఉండేందుకు ఇష్టపడే ఆమ్లా, తన 100వ టెస్టు గౌరవార్ధం అధికారికంగా ప్రత్యేక డిన్నర్‌ను నిర్వహిస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు. -
హుందాగా వ్యవహరించండి : ఆమ్లా
అడిలైడ్:దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ హషీమ్ ఆమ్లాకు మరోసారి కోపం వచ్చింది. గత ఫిబ్రవరిలో ఓ మహిళా రిపోర్టర్ వేసుకున్న దుస్తులు ఇబ్బందికరంగా ఉండటం చేత ఇంటర్య్యూ ఇవ్వనంటూ స్పష్టం చేసిన ఆమ్లా.. తాజాగా ఆస్ట్రేలియా రిపోర్టర్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఎయిర్‌పోర్ట్‌లో దూకుడుగా వ్యవహరించిన సదరు రిపోర్టర్ తీరును ఆమ్లా తప్పుబట్టాడు. 'మేము ఎయిర్ పోర్ట్‌లో బస్సు ఎక్కడానికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక రిపోర్టర్ ఆటగాళ్ల మధ్యకు వచ్చేశాడు. మమ్మల్ని గౌరవించడం అటుంచితే, మాతో చాలా అమర్యాదగా మాట్లాడాడు. మూడుసార్లు అతనికి చెప్పి చూశాం. మా విజ్ఞప్తిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి మాతో దూకుడుగా ప్రవర్తించాడు. కొద్దిగా విజ్ఞత పాటించండి. మాకు కొన్ని విలువలుంటాయి. మీరు హుందాగా ప్రవర్తించి మా పనిని చేసుకోనీయండి. ఇదొకసారి కాదు.. ఇప్పటికి మూడుసార్లు ఆ రిపోర్టర్ దూకుడుగా వ్యవహరించాడు. అతనికి కనీసం అధికారిక అక్రిడేషన్ కూడా లేదు. దాంతో సెక్యూరిటీ-రిపోర్టర్ మధ్య వివాదం చేసుకుంది. మీడియా ప్రొటోకాల్ ను మరచి ఇలా ప్రవర్తించడం ఎంతవరకూ సమంజసం' అని ట్విట్టర్లో ఆమ్లా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. -
ఆమ్లా-బ్రేవో సరికొత్త రికార్డు
ట్రినిడాడ్: స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం కరీబియన్ లీగ్‌లో ట్రినిబాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ ఇద్దరు ఆటగాళ్లు రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ట్రినిబోగా నైట్ రైడర్స్ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో ఆమ్లా-బ్రేవోల జోడి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. తద్వారా టీ 20 చరిత్రలో ఐదో వికెట్ కు అత్యధిక భాగస్వామ్య రికార్డును ఈ జోడి తమ పేరిట లిఖించుకుంది. ఈ మ్యాచ్‌లో ఆమ్లా(81;54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రేవో (66 నాటౌట్; 46 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బార్బోడాస్ ట్రిడెంట్స్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 159 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో నైట్ రైడర్స్ కు 11 పరుగుల విజయం దక్కింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సహయజమానిగా ఉన్న ట్రినిబాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
విరాట్ మరో రికార్డు బద్దలైంది!
సెయింట్ కిట్స్: వాళ్లిద్దరూ ఆ రెండు జట్లకు వెన్నెముకలాంటి వాళ్లు. ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఒకరు నెమ్మదిగా సాంప్రదాయ తరహాలో తమ ఆటతీరుతో అలరిస్తే... మరొకరు దూకుడుతో చెలరేగిపోతారు. దాదాపుగా ఒకేసారి వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఇద్దరి కెరీర్ పోటాపోటీగా సాగుతోంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా అయితే మరొకరు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి. ఒకరి రికార్డును మరొకరు అధిగమిస్తూ పోటీలు పడి పరుగుల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ వన్డేల్లో నెలకొల్పిన వేగవంతమైన 23 సెంచరీల రికార్డును సఫారీ ఆటగాడు ఆమ్లా అధిగమించడమే వారి మధ్య పోటీకి అద్దం పడుతోంది. ముక్కోణపు సిరీస్ లోభాగంగా వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన వన్డేలో ఆమ్లా శతకంతో అలరించాడు. దీంతో కోహ్లి 23 వేగవంతమైన సెంచరీల రికార్డు బద్దలైంది. విరాట్ 157 ఇన్నింగ్స్‌లలో 23వ సెంచరీని చేస్తే, ఆమ్లాకు 132వ ఇన్నింగ్స్‌లోనే ఆ మార్కును చేరాడు. సమకాలీన క్రికెట్లో ఈ ఇద్దరు క్రికెటర్లు 2008లోనే అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ఆరంభించడం మరో విశేషం. ఒకవైపు రికార్డులు సృష్టించుకుంటూ విరాట్ ముందుకు సాగుతుంటే, ఆమ్లా వాటిని అధిగమిస్తునే ఉన్నాడు. గతంలో వేగంగా 20 సెంచరీలు, ఐదు వేల పరుగులులాంటి కోహ్లి సాధించిన ఘనతలను ఆమ్లా బ్రేక్ చేశాడు. మరోవైపు విరాట్ పిన్నవయసులో నమోదు చేసిన 10 సెంచరీల వన్డే రికార్డును దక్షిణాఫ్రికాకే చెందిన డీకాక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అధిగమించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా డీ కాక్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే, అదే విరాట్ 10 సెంచరీలు చేయడానికి 23 సంవత్సరాల 159 రోజులు పట్టింది. ఇదిలా ఉండగా కోహ్లి ఇప్పటివరకూ 171 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 25వ సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. -
తాహిర్ రికార్డ్.. సౌతాఫ్రికా విన్
బాసెటెరీ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్): హషిమ్ ఆమ్లా సెంచరీ ఇన్నింగ్న్, ఇమ్రాన్ తాహిర్ 'రికార్డ్' బౌలింగ్ తో వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించింది దక్షిణాఫ్రికా. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన ఆరో వన్డేలో విండీస్ పై 139 పరుగుల తేడాతో విజయం సాధించింది. 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 38 ఓవర్లలో 204 పరుగులకే చాప చుట్టేసింది. 35 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. చార్లెస్(49) టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో తాహిర్ 45 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడొట్టాడు. షాంసి 2 వికెట్లు తీశాడు. అతి తక్కువ వన్డేల్లో 100 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ గా తాహిర్ రికార్డు సృష్టించాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 343 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆమ్లా అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. 99 బంతుల్లో 13 ఫోర్లతో 110 పరుగులు సాధించాడు. అతడికి వన్డేల్లో ఇది 23వ సెంచరీ. అంతేకాకుండా విండీస్ పై అత్యుత్తమ బ్యాటింగ్ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు. డీకాక్(71), డుప్లెసిస్(73) అర్ధసెంచరీతో రాణించారు. మోరిస్ 40, డివిలియర్స్ 27, డుమిని 10 పరుగులు చేశారు. తాహిర్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. -
షాన్ మార్ష్ స్థానంలో ఆమ్లా
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి వెన్నునొప్పి కారణంగా వైదొలిగిన కింగ్స్ పంజాబ్ ఆటగాడు షాన్ మార్ష్ స్థానంలో హషీమ్ ఆమ్లాకు చోటు కల్పించారు. షాన్ మార్ష్ కు ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఆమ్లాను జట్టులోకి తీసుకుంటున్నట్లు కింగ్స్ పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది. త్వరలోనే ఆమ్లా జట్టుతో కలవనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ఆమ్లాను ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. ఆమ్లా కనీస ధర కోటి రూపాయిలున్నా అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిన ఆమ్లా టీ 20 రికార్డు కూడా మెరుగ్గానే ఉంది. ఇప్పటివరకూ 88 టీ 20లు ఆడిన ఆమ్లా 2,446 పరుగులు సాధించాడు. టీ 20ల్లో అతని సగటు 31. 35గా ఉండగా, స్ట్రైక్ రేట్ 125. 95 గా ఉంది. -
జెంటిల్మన్ క్రికెటర్
బైలైన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఇప్పుడు మాజీ కెప్టెన్‌గా మారిన హషీమ్ ఆమ్లాకు జేజేలు పలకండి. కపటత్వంతో కృత్రిమ వినమ్రతను ప్రదర్శించకుండా, తానెంత మంచివాడో చాటుతూ ఉపన్యాసం దంచకుండా తన గురించి తాను నిజాయితీగా చెప్పుకున్న మనిషి ఆమ్లా. కల లాంటి ఆ పదవికి ఎవరూ కోరకుండానే ఆయన రాజీనామా చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల వల్ల జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా తాను నిర్వహించాల్సిన కృషికి నష్టం వాటిల్లుతోందనే నిర్ణయానికి రావడంతో ఆమ్లా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. క్రికెట్ కెప్టెన్లలో చాలా మంది బ్యాట్స్మెన్లే. బ్యాటింగ్, ఆ క్రీడలోని ఏదో ఒక అగ్రకుల అంతస్తుకు చెందినది కావడం అందుకు కారణం కాదు. బాధ ఎక్కువ, గ్లామర్ తక్కువైన బౌలింగ్, కఠోర శ్రమతో కూడిన పని. ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బెనాడ్, మన కపిల్దేవ్లాంటి గొప్ప బౌలర్ కెప్టెన్లూ ఉన్నారు (ఇమ్రాన్ ఖాన్ , ఇయాన్ బోథామ్లాంటి ఆల్‌రౌండర్లు పూర్తిగా భిన్న శ్రేణికి చెందిన వారు). అయినా సెలెక్టర్లు బ్యాట్స్‌మెన్‌నే ఎక్కువగా కెప్టెన్లుగా ఎంచుకోవడానికి సజావైన కారణమే ఉంది. సుదీర్ఘమైన ఆ క్రీడలో కెప్టెన్‌గా మొత్తం ఆట నిర్వహణను అత్యంత అనుకూల దృష్టితో చూసే అవకాశం బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉంటుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో మాత్రమే ఒక కెప్టెన్‌ను సరిగ్గా పరీక్షించగలం. 20 ఓవర్ల ఆటలో కెప్టెన్ పాత్ర ఫుట్‌బాల్ కెప్టెన్లాంటిదే. ఇకఒక రోజు మ్యాచ్‌కు వస్తే, కెప్టెన్ ఆల్‌రౌండర్ అయితే మంచిదనడానికి సమంజసమైన కారణాలే ఉన్నాయి. కానీఅది వేరే కథ. అతి సుతారమైన ఆటగా క్రికెట్ (టెస్ట్ మ్యాచ్) మెల్లగా సాగే ఆట. ఎత్తుగడలపరమైన మార్పులతోపాటూ వ్యూహాత్మక నిర్ణయాలకు కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. టెస్ట్ కెప్టెన్, ఆట పురోగతిని నిరంతరం విశ్లేషించడం అవసరం. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రతి మూడు నాలుగు ఓవర్లకు అలా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. తన జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగుల వేగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి హషీం ఆమ్లా ఆడుతున్న తీరునుబట్టి చూస్తే అతను ఆలోచనాపరుడైన మనిషి. ఎప్పుడూ క్రీజ్‌కు నడుచుకుంటూ వెళ్తూనే... ఆయన ఆ ఆటలో పెద్దమనిషిగా మంచి గుర్తింపును సంపాదించుకు న్నాడు. ఇంగ్లండుతో జరుగుతున్న క్లిష్టమైన సిరీస్ మధ్యలో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చినప్పటి నుంచి ఆయన నడక సుదీర్ఘంగా సాగింది. అదే ఆయన జ్ఞాపకాన్ని నిర్వచించేది. ఆమ్లా నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఆట అధ్వానంగా సాగింది. ఇటీవల భారత్‌లో జరిగిన సిరీస్‌లో ఆఫ్రికన్లు చిత్తుగా ఓడారు. పిచ్‌పై వివాదాలు ఆ వాస్తవాన్ని పూర్తిగా దాచలేవు. ఏదిఏమైనా పిచ్‌ను ఒక ఆధారంగా ఉపయోగించుకోవడం ఆసక్తికరం. రెండు జట్లూ అదే పిచ్‌పై ఆడాల్సి ఉంటుంది. అది బాగా లేకపోతే ఇద్దరికీ బాగా లేకుండా ఉండాలి. గ్రీన్-టాప్ పిచ్ పేస్ బౌలర్లకు సహాయపడితే పిచ్‌ని ‘‘చెడగొట్టారని’’ ఎవరూ ‘‘ఆరోపించరు’’. అలాంటప్పుడు బ్రౌన్-టాప్ పిచ్ స్పిన్నర్లకు తోడ్పడి నప్పుడు కామెంటేటర్లు తీవ్రంగా ఎందుకు స్పందిస్తారు? భారత్‌తో సిరీస్‌ను కోల్పోయినప్పుడు ఆమ్లా... అయాచితంగా దొరికే అలాంటి సాకులను చూపలేదని గుర్తుంచుకోవడం సముచితం. తన స్కోర్లు స్వల్పంగా ఉండటంతో ఆమ్లా సమస్యలు రెట్టింపయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పుడు జరుగుతున్న సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పుడూ అదే వరుస కొనసాగింది. రెండవ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆటలోని అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మొదటి ఇన్నింగ్స్ స్కోర్‌ను సాధించింది. అయితే ఆమ్లా బ్యాటింగ్‌కు వచ్చేసరికి ఆ జట్టు దాదాపుగా ఓటమి అంచున ఉంది. అతను సాధించిన డబుల్ సెంచరీ బ్యాట్స్‌మన్‌గా ఆయన విలువను పునరుద్ధరించడమే కాదు, కెప్టెన్‌గా విశ్వసనీయతను కూడా కాపాడింది. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా బాక్స్‌లో కూచుని కెప్టెన్ చేసేది ఏమీ ఉండదని ఎన్నడూ అనుకోకండి. ఇన్నింగ్స్ పొడవునా అతను ప్రతి ఆటగాడి పాత్రను నిర్వచిస్తుంటాడు. కెప్టెన్ అంటే ఒక్క చేతి సంజ్ఞతోనే నియంత్రించే కాపరి. హషీమ్ ఆమ్లా సరిగ్గా తనపై ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసిన సమయంలోనే రాజీనామా చేశాడు. అటు ఆటగాడిగా, ఇటు నాయకునిగా తిరిగి అగ్రస్థానానికి వచ్చాకనే నాయకత్వ బాధ్యతల నుంచి నిష్ర్కమించాడు. కొద్దికాలంపాటూ ఆట బాగోనందుకే సెలెక్టర్లు కెప్టెన్‌ను శిక్షించేట్టయితే, ఏ కెప్టెనూ మహా అయితే రెండు లేదా మూడు సీజన్లకు మించి మనజాలడు. పోటీ క్రూరంగా ఉండే ఫుట్‌బాల్‌లో సైతం యజమానులు, జట్టు విఫలమౌతున్నా మేనేజర్లను మార్చడానికి సమయం తీసుకుంటారు. ఆమ్లాను ఎవరూ ఒత్తిడి చేయకున్నా, తమ జట్టు ప్రయోజనాలకు మంచిదని తనంత తానే అనుకుని రాజీనామా చేశాడు. అలాంటి ఉదాహరణలు ఎన్నో కనబడవు. పేర్లు వద్దుగానీ, కెప్టెన్లకు వారి అధికారం ద్వారా బహిరంగంగానూ, చాటుమాటుగానూ ఆర్థిక ప్రతిఫలాలు లభిస్తాయి. కాబట్టే వారు తమ అధికారాన్ని పట్టుకు వేలాడుతారు. క్రికెట్‌ను విచిత్రంగా ‘‘పెద్దమనుషుల ఆట’’ అని అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు అది అలాగే ఉన్నదని గట్టిగా చెప్పడం తీవ్ర అతిశయీకరణే. ఎక్కడైనా ఉండేట్టే ఇప్పుడు క్రికెట్లో కూడా ఎందరు పెద్దమను షులున్నారో అందరు ఆకతాయిలూ ఉన్నారు. ఇది మంచీ కాదు, చెడూ కాదు. రిపబ్లికన్ యుగంలో విలు వలు లేదా విలువల రాహిత్యం అనేవి ఒక వర్గానికి సం బంధించినవి కావు. ఎవరు ఉత్పత్తులను అమ్ముకోగలి గితే వారికే భారీగా డబ్బు వచ్చిపడుతుంది. అందుకే క్రీడలో ఒక పెద్ద మనిషి కనిపిస్తే అది సంబరపడటానికి కారణమవుతుంది. విధి ప్రతి ఒక్కరికీ వారు ధరించాల్సిన పాత్రను కేటాయిస్తుంది. ఒక ఆదర్శ నమూనా కాగలగడం మాత్రం ఆ వ్యక్తి సాధించాల్సినదే. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి: ఎం.జె. అక్బర్ -
'అందుకు డివిలియర్సే తగిన వ్యక్తి'
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా టెస్టు జట్టును నడిపించడానికి ఏబీ డివిలియర్సే తగిన వ్యక్తి అని ఆ ఫార్మెట్ నాయకత్వ పగ్గాలకు తాజాగా వీడ్కోలు చెప్పిన హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో తనతో పాటు చాలా మంది క్రికెటర్లకు టెస్టు జట్టును నడిపించే సామర్థ్యం ఉన్నా..అందుకు అన్ని అర్హతలున్న వ్యక్తి డివిలియర్సేనని ఆమ్లా స్పష్టం చేశాడు. ఇప్పటికే వన్డే పగ్గాలు మోస్తున్న డివిలియర్స్ ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసిందేనని ఆమ్లా తెలిపాడు. తన సహచరుడైన ఏబీ చాలా తెలివైన కెప్టెన్ అని ఈ సందర్బంగా కొనియాడాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే కేంద్రీకరించినట్లు ఆమ్లా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసిన అనంతరం టెస్టు క్రికెట్ కెప్టెన్సీకి ఆమ్లా గుడ్ బై చెప్పాడు. ఏడాదిన్నర క్రితం దక్షిణాఫ్రికా టెస్టు పగ్గాలు చేపట్టిన ఆమ్లా సారథ్యంలో 14 మ్యాచ్ లు జరగ్గా, అందులో నాలుగు టెస్టుల్లో విజయం, మరో నాల్గింటిలో ఓటమి ఉన్నాయి. మిగతా ఆరు మాత్రం డ్రా ముగిశాయి. -
ఆమ్లా డబుల్ సెంచరీ
కేప్ టౌన్:గతేడాదిగా పేలవమైన ఫామ్ తో తంటాలు పడుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆమ్లా డబుల్ సెంచరీ తో అదరగొట్టాడు. నాలుగు రోజు ఆటలో ఆమ్లా(200 బ్యాటింగ్;467 బంతుల్లో 27 ఫోర్లు) రాణించడంతో దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 160.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 428 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆమ్లాకు జతగా డు ప్లెసిస్(88 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. 358/3 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ విరామానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ను 629/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా
♦ తొలి ఇన్నింగ్స్‌లో 353/3 ♦ ఆమ్లా అజేయ శతకం ♦ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు కేప్‌టౌన్: హాషిం ఆమ్లా, డివిలియర్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ కారణంగా.... ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (371 బంతుల్లో 157 బ్యాటింగ్: 21 ఫోర్లు) టెస్టు కెరీర్లో 24వ సెంచరీ పూర్తి చేసుకోగా... డివిలియర్స్ (211 బంతుల్లో 88; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం కోల్పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 183 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం ఆమ్లాతో పాటు డు ప్లెసిస్ (115 బంతుల్లో 51; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 85 పరుగులు జత చేసింది. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా మరో 276 పరుగులు వెనుకబడి ఉంది. 141/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆమ్లా, డివిలియర్స్ జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యాలు కలిసి రావడంతో వీరిద్దరు మూడు సార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. 50 పరుగుల వద్ద డివిలియర్స్ టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. జాక్ కలిస్, గ్రేమ్ స్మిత్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. మరో వైపు 93 పరుగుల వద్ద ఆమ్లా కూడా 7 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం మూడో రోజు ఆటలో విశేషం. నాలుగో రోజు ఆట మధ్యాహ్నం గం. 2.00 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం -
అదే నా చెత్త ప్రదర్శన: ఆమ్లా
డర్బన్ : ఇటీవల భారత్ లో జరిగిన టెస్టు సిరీస్ లో తన ఆట తీరు అత్యంత పేలవంగా ఉందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ హషీమ్ ఆమ్లా పేర్కొన్నాడు. ప్రత్యేకంగా ఢిల్లీ టెస్టు మ్యాచ్ లో ఆడిన తీరే తనను ఎక్కువగా నిరాశకు గురి చేసిందని.. ఈ ఏడాది కాలంలో ఇదే తన అత్యంత చెత్త ప్రదర్శనగా చెప్పుకోవచ్చని ఆమ్లా స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో 241 పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం అత్యంత చెత్త ప్రదర్శన అనే ప్రశ్నకు ఆమ్లా పై విధంగా బదులిచ్చాడు. ప్రతి ఒక్కరి కెరీర్ లో చెత్త ప్రదర్శన అనేది చాలా నిరాత్సహానికి గురి చేస్తుందన్నాడు. ఒకసారి పేలవంగా ఆడితే ఎంతటి స్థాయి క్రికెటర్ అయినా అనుకోకుండానే నమ్మకాన్ని కోల్పోతాడన్నాడు. దాని నుంచి బయటపడటానికి ఎంతకాలం పడుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమన్నాడు. తాను 2014 లో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ఘన విజయాలను సాధించిన సంగతిని ఈ సందర్భంగా ఆమ్లా గుర్తు చేశాడు. గతేడాది జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్‌లపై సిరీస్ లను గెలిచి ముందంజలో పయనిస్తే.. ఈ ఏడాది మాత్రం బంగ్లాదేశ్ తో సిరీస్ డ్రా చేసుకోవడంతో పాటు భారత్‌తో సిరీస్ కోల్పోవడం తీవ్ర నిరాశను కలగచేసిందన్నాడు. -
చెలరేగిన బ్రాడ్ : దక్షిణాఫ్రికా 137/4
డర్బన్: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (3/16) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో నాలుగు వికెట్లకు 137 పరుగులు చేసింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ వాన్జిల్ను వెనక్కి పంపిన బ్రాడ్ ఆ తర్వాత కెప్టెన్ హషీమ్ ఆమ్లా (7), డివిలియర్స్ (49; 7 ఫోర్లు; 1 సిక్స్) వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టాడు. ఎల్గర్ (67 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), బవుమా (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అలీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు 179/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 100.1 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాంప్టన్ (85; 8 ఫోర్లు) రాణించాడు. స్టెయిన్, మోర్కెల్లకు నాలుగేసి వికెట్లు దక్కాయి. -
'ఆమ్లా ఫామ్ పైనే ఆందోళన'
ముంబై: గత కొంతకాలంగా విఫలం చెందుతున్న తమ స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఫామ్ పైనే ఆందోళనగా ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రస్సెల్ డొమినిగో తెలిపాడు. తొలి టెస్టు ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆమ్లా ఒక పరుగు మాత్రమే చేసి మరోసారి విఫలం కావడం కలవరపెడుతుందన్నాడు. అయితే ఆమ్లా ఒక భారీ ఇన్నింగ్స్ తో తిరిగి గాడిలో పడతాడని డొమినిగో ఆశాభావం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా- బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన అనంతరం డొమినిగో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. గత ఎనిమిది మ్యాచ్ ల నుంచి ఆమ్లా ఒక సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదన్నాడు. భారత్ లో జరిగిన ట్వంటీ 20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా ఆమ్లా వైఫల్యం చెందడమే జట్టులో ఆందోళన కల్గిస్తుందన్నాడు. నవంబర్ ఐదో తేదీ నుంచి మొహాలీలో జరిగే తొలి టెస్టులో పిచ్ పెద్దగా టర్న్ కాకపోవచ్చన్నాడు. ప్రస్తుతం తమ జట్టులోని ఆటగాళ్లంతా టెస్టు మ్యాచ్ లకు సిద్ధంగా ఉన్నా.. పిచ్ ను చూసిన తరువాతే జట్టు ఎంపిక జరుగుతుందన్నాడు. -
కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా
ముంబై: దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి అతడీ రికార్డు సృష్టించాడు. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు. -
భారీ స్కోరు చేస్తేనే..
ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో తమ జట్టు భారీ పరుగులు చేస్తేనే విజయం సాధ్యపడుతుందని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. నాల్గో వన్డేలో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాను కట్టడి చేయాలంటే భారీ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు. తాము తొలుత బ్యాటింగ్ చేస్తే సాధ్యమైనన్ని ఎక్కువ లక్ష్యాన్ని ప్రత్యర్థి టీమిండియా ముందు ఉంచుతామన్నాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో చివరిదైన ఐదో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారడంతో టీమిండియాను కట్టడి చేసేందుకు కసరత్తులు చేస్తున్నామన్నాడు. 'రేపటి వన్డేలో భారీ పరుగులు చేస్తేనే దాన్ని కాపాడుకోవడానికి సాధ్యపడుతుంది. భారీ స్కోరు అనేది ఫలితంపై ప్రభావం చూపుతుంది. ముందు బ్యాటింగ్ చేస్తే మా లక్ష్యం ఎక్కువ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచడమే. మేము మంచి క్రికెట్ ఆడితే మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా గెలుస్తాం' అని ఆమ్లా తెలిపాడు. ఐదో వన్డేకు తమ పేసర్ మోర్నీ మోర్కెల్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. కాలి గాయంతో బాధపడుతున్న మోర్కెల్ తుది వన్డేలో ఆడకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మూడో వన్డేలో 39 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపులో ప్రముఖ్ పాత్ర పోషించిన మోర్కెల్ నిర్ణయాత్మక వన్డేలో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు. -
ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌కు...
దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన జొహన్నెస్‌బర్గ్ : భారత గడ్డపై సుదీర్ఘ పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్ల జట్లను ప్రకటించింది. టెస్టుల్లో స్పిన్ పిచ్‌లు ఎదురయ్యే అవకాశం ఉండటంతో తమ జట్టులో కూడా ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. టెస్టు జట్టులోకి లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్లు డేన్ పైడ్, సైమన్ హార్మర్లను ఎంపిక చేసినట్లు దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జోండి ప్రకటించారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు ఆడిన జట్టులో లేని తాహిర్, పైడ్లతో డివిలియర్స్ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. మూడు జట్లలో చూస్తే టి20 సిరీస్‌కు ఎంపికైన బ్యాట్స్‌మన్ ఖాయా జోండో ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు. ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు డివిలియర్స్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, తాహిర్‌లు మూడు ఫార్మాట్లలోనూ ఉన్నారు. వన్డే, టి20 జట్లలో కూడా ఎలాంటి సంచలనాలు లేకుండా రెగ్యులర్ సభ్యులనే ఎంపిక చేశారు. గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమైన రోసో... వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లాంటి ప్రధాన బౌలర్లకు టి20ల్లో విశ్రాంతినిస్తూ మోరిస్, డి లాంజ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నెల 29న జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 7న ముగుస్తుంది. దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: హషీం ఆమ్లా (కెప్టెన్), డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, ఇమ్రాన్ తాహిర్, బవుమా, ఎల్గర్, హార్మర్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, పైడ్, రబడ, స్టెయిన్, వాన్‌జిల్, విలాస్. -
వేలంలో అమ్ముడుపోని టాప్ బ్యాట్స్ మన్
బెంగళూరు: ఇండిన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో వరల్డ్ టాప్ ర్యాంకింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లాను ఎవరూ కొనలేదు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న ఆమ్లాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఆమ్లా ప్రాథమిక ధరను రూ. 2 కోట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం తమ జట్టు తరపున వన్డే ప్రపంచకప్ ఆడుతున్న ఆమ్లా ఇప్పటివరకు 108 వన్డేలు ఆడాడు. అతడి బ్యాటింగ్ సగటు 55.93 గా ఉంది. 19 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 153. అయితే టి20ల్లో అతడి రికార్డు అంత ఘనంగా లేదు. 26 టి20 మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 25 సగటుతో 600 పరుగులు చేశాడు. -
ఆమ్లా డబుల్ సెంచరీ
అరంగేట్రంలో వాన్ జిల్ సెంచరీ దక్షిణాఫ్రికా 552/5 డిక్లేర్డ్ విండీస్‌తో తొలి టెస్టు సెంచూరియన్: దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (371 బంతుల్లో 208; 22 ఫోర్లు) కెరీర్లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే తన తొలి టెస్టులోనే స్టియాన్ వాన్ జిల్ (130 బంతుల్లో 101 నాటౌట్; 15 ఫోర్లు) అదరగొట్టే ఆటతీరుతో సెంచరీ సాధించాడు. దీంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ జట్టు రెండో రోజు గురువారం 140.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 552 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీ విరామానికి అరగంట ముందు తమ ఇన్నింగ్స్‌ను ముగించినా... వర్షం కారణంగా విండీస్ బ్యాటింగ్‌కు దిగలేకపోయింది. అంతకుముందు 340/3 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీ తొలి సెషన్లోనే డివిలియర్స్ (235 బంతుల్లో 152; 16 ఫోర్లు; 2 సిక్సర్లు) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆమ్లాకు 27 ఏళ్ల వాన్ జిల్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి విండీస్ పసలేని బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంది. 180 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న ఆమ్లా 359 బంతుల్లో ద్విశతకం సాధించాడు. స్వదేశంలో తనకిది తొలి డబుల్. అటు వాన్ జిల్ కూడా మెరుగ్గా రాణించి 129 బంతుల్లోనే తొలి సెంచరీ సాధించాడు. అరంగేట్ర టెస్టులో శతకం సాధించిన ఐదో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. రోచ్, బెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
దక్షిణాఫ్రికాదే వన్డే సిరీస్
రెండో మ్యాచ్‌లోనూ కివీస్ చిత్తు ఆమ్లా సెంచరీ మౌంట్ మున్గాన్ (న్యూజిలాండ్): హషీమ్ ఆమ్లా (135 బంతుల్లో 119; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే సఫారీ జట్టు 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (67), డివిలియర్స్ (37) రాణించారు. బౌల్ట్, సౌతీ, మెక్లీంగన్, అండర్సన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 46.3 ఓవర్లలో 210 పరుగులకే పరిమితమైంది. రోంచి (79) టాప్ స్కోరర్. మెక్లీంగన్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించినా మిగతా వారు విఫలమయ్యారు. స్టెయిన్, ఫిలాండర్, డివిలియర్స్, తాహిర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే హామిల్టన్‌లో సోమవారం జరుగుతుంది. -
ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం
బులావాయో: ఆమ్లా (132 బంతుల్లో 122; 6 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 93 పరుగుల తేడాతో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగినసఫారీ 50 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. డికాక్ (63), డుప్లెసిస్ (59)రాణించారు. అనంతరం జింబాబ్వే 49.5 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. మసకద్జ (61), విలియమ్స్ (51) అర్ధ సెంచరీలు సాధించారు. -
ధైర్యే సాహసే విజయం
ఫలించిన ఆమ్లా నిర్ణయం తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 153 పరుగులతో గెలుపు స్టెయిన్, మోర్కెల్ విజృంభణ శ్రీలంక 216 ఆలౌట్ గాలే: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హషీమ్ ఆమ్లా ధైర్యంతో తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఫలితాన్ని ఇచ్చింది. 14 ఏళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై తొలి విజయాన్ని అందించింది. తమ సారథి దూకుడు ప్రణాళికలను సరిగ్గా అర ్థం చేసుకున్న పేసర్లు డేల్ స్టెయిన్ (4/45), మోర్నీ మోర్కెల్ (4/29) విరుచుకుపడి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించడంతో తొలి టెస్టులో సఫారీ జట్టు 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లతో అదరగొట్టిన స్టెయిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. -నాలుగు సెషన్ల ఆట ఉండగానే... శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌ను (206/6) డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు ఆమ్లా 370 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. అయితే 110/1 ఓవర్‌నైట్ స్కోరుతో మంచి స్థితిలో ఉన్న లంక చివరి రోజు ఆదివారం పేలవ ఆటతో 71.3 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుమార సంగక్కర (145 బంతుల్లో 76; 9 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. -తొలి సెషన్ నాలుగో ఓవర్లోనే స్టెయిన్.. కౌశల్ సిల్వా (98 బంతుల్లో 38; 5 ఫోర్లు) వికెట్‌ను తీసి లంక పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఓవర్లో సంగక్కర 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను డి కాక్ విఫలం చేశాడు. జయవర్ధనే (10) మరోసారి నిరాశ పరచగా దూకుడు మీదున్న సంగక్కర వికెట్‌ను డుమిని తీసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఆ తర్వాత స్టెయిన్, మోర్కెల్ మూకుమ్మడి దాడి నేపథ్యంలో వరుసగా వికెట్లు కోల్పోయిన లంక గెలుపుపై ఆశలు వదులుకుంది. ఓ దశలో 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కోలుకోలేకపోయింది. ఈనెల 24న మొదలయ్యే రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా గెలిస్తే... ఆస్ట్రేలియా నుంచి తిరిగి నంబర్‌వన్ ర్యాంకు చేజిక్కించుకునే అవకాశముంది. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా
జొహన్నెస్‌బర్గ్: సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గ్రేమ్ స్మిత్ గత మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతని స్థానంలో ఆమ్లాను నియమించారు. భారత సంతతికి చెందిన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఆమ్లా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. దక్షిణాఫ్రికాకు ఓ బీర్ బ్రాండ్ స్పాన్సర్‌గా ఉండటంతో.. ఆ లోగో ఉన్న డ్రెస్సును, కిట్‌ను వాడేందుకు ఇష్టపడటం లేదని, అందుకే కెప్టెన్సీ వద్దంటున్నాడని అయితే ఆమ్లా తన డ్రెస్సుతో పాటు కిట్పైనా బీర్ బ్రాండ్ లోగో ఉపయోగించకుండా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నాడు. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా ఆమ్లా
జొహాన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ గా హషీం ఆమ్లాను నియమించారు. గత మార్చిలో రిటైరయిన గ్రేమ్ స్మిత్ స్థానంలో ఆమ్లాకు జట్టు పగ్గాలు అప్పగించారు. క్రికెట్ సౌతాఫ్రికా ఈ నియామకం చేపట్టింది. కెప్టెన్సీ పదవికి గతంలో ఆమ్లా వినిపించినా బ్యాటింగ్ పైనే పూర్తిగా దృష్టి సారించాలనే ఉద్దేశంతో అతను తిరస్కరించాడు. అయితే పదేళ్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన స్మిత్ రిటైరయ్యాక ఆమ్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బ్యాటింగ్ తో పాటు జట్టును సమర్థవంతంగా నడిపించడానికి కృషి చేస్తానని 31 ఏళ్ల ఆమ్లా చెప్పాడు.