![Hashim Amla Retires From International Cricket, Gets Tribute From Sachin Tendulkar - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/9/Amla.jpg.webp?itok=3rEwbA6f)
ముంబయి : దక్షిణాప్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా గురువారం అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై ప్రకటించిన సంగతి తెలిసిందే. అతని ఆటతీరుకు అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శుక్రవారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా హషీమ్ ఆమ్లాను పొగడ్తలతో ముంచెత్తాడు. ' మిత్రమా ! నీ కెరీర్ ఆసాంతం ఏ స్వార్థం ఆశించకుండా మీ దేశానికి సేవ చేసినందుకు అభినందిస్తున్నాను. సొగసైన ఆటతీరుతో ఎంతోమంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచావు. ఆట నుంచి తప్పుకున్న నీకు మిగిలిన జీవితం అద్భుతంగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు' ట్వీట్ చేశాడు. అంతకు ముందు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్టు రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. ' ఎన్నోసార్లు మీ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్సమెన్‌ను ముప్పతిప్పలు పెట్టావు. మైదానంలో నీ బౌలింగ్‌ను ఎదుర్కొని బ్యాటింగ్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించేవాడిని. ఒక మిత్రుడిగా నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించిన రెండు రోజులకే హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, స్టెయిన్ పరిమిత ఓవర్ల ఆటలో కొనసాగనున్నాడు. తాను అంతర్జాతీయ ఆట నుంచి తప్పుకున్నా, దేశవాళీ క్రికెట్లో మాత్రం తాను కొనసాగనున్నట్లు హషీం ఆమ్లా స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment