దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ అద్బుతమైన ఫీల్డింగ్‌తో హార్దిక్ శభాష్ అనిపించాడు. మ్యాచ్‌పై సఫారీలు పట్టుబిగిస్తున్న వేళ హార్దిక్ ఒక అద్భుతమైన త్రో ద్వారా హాషీమ్ ఆమ్లా(82;153 బంతుల్లో 14 ఫోర్లు)ను రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 81 ఓవర్‌ను అందుకున్న హార్దిక్.. ఐదో బంతికి ఆమ్లాకు షాకిచ్చాడు. ఆ బంతిని క్రీజ్ దగ్గరగానే డిఫెన్స్ ఆడిన ఆమ్లా పరుగు కోసం యత్నించాడు. అయితే అంతే వేగంగా దూసుకొచ్చిన హార్దిక్ బంతిని అందుకున్న మరుక్షణమే నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వికెట్లను నేలకూల్చాడు.
Published Sat, Jan 13 2018 8:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement