కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా | Hashim Amla becomes the fastest to score 6000 runs in ODI | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా

Published Sun, Oct 25 2015 1:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా

కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా

ముంబై: దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి అతడీ రికార్డు సృష్టించాడు. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement