kohli record
-
మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ
బాలీవుడ్నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆమె గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చూడండి: భారత్-ఆసీస్ ఫైనల్ పోరు.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే? Anushka Sharma has arrived at Ahmedabad for the finals with Vamika #INDvsAUS #WorldcupFinal#AUSvsSA #SAvsAUS #CWC23#ViratKohli𓃵 #RohithSharma#NarendraModiStadium#anushkasharmapic.twitter.com/U0FsYm6TDs — 𝑴𝑺 𝑭𝑶𝑶𝑻𝑪𝑹𝑰𝑪 ⚽🏏 (@IFootcric68275) November 18, 2023 -
కోహ్లి రికార్డును దాటేసిన ఆమ్లా
ముంబై: దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి అతడీ రికార్డు సృష్టించాడు. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. 84 టెస్టులు ఆడి 23 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 6770 పరుగులు చేశాడు.