మ్యాచ్‌ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ | Anushka Sharma Reached Ahmedabad with Daughter Vamika | Sakshi
Sakshi News home page

IND vs AUS Match: మ్యాచ్‌ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ

Published Sun, Nov 19 2023 7:03 AM | Last Updated on Sun, Nov 19 2023 7:03 AM

Anushka Sharma Reached Ahmedabad with Daughter Vamika - Sakshi

బాలీవుడ్‌నటి అనుష్క శర్మ మరోమారు గర్భం దాల్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో అనుష్కశర్మ బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అనుష్కకు సంబంధించి తాజా వీడియో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో భారత్-ఆస్ట్రేలియా మధ్య  జరగనున్న ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు ఆమె గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆమెతో పాటు కుమార్తె వామికా కోహ్లీ కూడా ఉంది. ఒక అభిమాని షేర్ చేసిన ఈ వీడియోలో మొదట వామికా కోహ్లీ, తరువాత అనుష్క శర్మ ప్రైవేట్ విమానం నుంచి తెల్లటి సూట్‌లో బయటకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. 

ఈ వీడియోను షేర్ చేసిన యూజర్‌..‘ఫైనల్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ కుమార్తె వామికాతోపాటు అహ్మదాబాద్ చేరుకున్నారు’ అని రాశారు. కాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో  ఎప్పటిది? అనేది స్పష్టం కా లేదు. నవంబర్ 19న భారత్- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
ఇది కూడా చూడండి: భారత్‌-ఆసీస్‌ ఫైనల్‌ పోరు.. హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement