జొహన్నెస్‌బర్గ్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరదైన మూడో టెస్టు రసకందాయంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకు ఆలౌటైతే, సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు చాపచుట్టేశారు. దాంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శనపైనే విజయాకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 250 పరుగులకు పైగా చేస్తే పోరాడటానికి అవకాశం ఉంటుంది. కాగా, పేస్ విపరీతంగా అనుకూలిస్తున్నపిచ్‌పై మూడొందల పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా ఛేదిస్తామని సఫారీ స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
తమకు భారత జట్టు మూడొందల లక్ష్యాన్ని నిర్దేశించినా ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఆమ్లా 61 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కీలక వికెట్లు నేలరాలిన సమయంలో ఆమ్లా రాణించడంతో దక్షిణాఫ్రికా కాస్త ఫర్వాలేదనిపించింది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా భారత్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు కేఎల్ రాహుల్(16), చతేశ‍్వర పుజారా(1)లు మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే పెవిలియన్ చేరారు.
Comments
Please login to add a commentAdd a comment