దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. గత నాలుగు వన్డేల్లో అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.