
దక్షిణాఫ్రికాదే వన్డే సిరీస్
రెండో మ్యాచ్‌లోనూ కివీస్ చిత్తు ఆమ్లా సెంచరీ
మౌంట్ మున్‌గాన్ (న్యూజిలాండ్): హషీమ్ ఆమ్లా (135 బంతుల్లో 119; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే సఫారీ జట్టు 2-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (67), డివిలియర్స్ (37) రాణించారు. బౌల్ట్, సౌతీ, మెక్లీంగన్, అండర్సన్ తలా రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 46.3 ఓవర్లలో 210 పరుగులకే పరిమితమైంది. రోంచి (79) టాప్ స్కోరర్. మెక్లీంగన్ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించినా మిగతా వారు విఫలమయ్యారు. స్టెయిన్, ఫిలాండర్, డివిలియర్స్, తాహిర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే హామిల్టన్‌లో సోమవారం జరుగుతుంది.