హామిల్టన్: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలిరోజు కేవలం 41 ఓవర్ల ఆటే సాగింది. శనివారం మొదలైన ఈ టెస్టులో మొదట బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా (50; 9 ఫోర్లు) రాణించాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ, గ్రాండ్‌హోమ్ చెరో 2 వికెట్లు తీశారు. టెస్టుల్లో 32వ అర్ధసెంచరీ సాధించిన ఆమ్లా ఈ క్రమంలో టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.