PAK VS AUS: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (84 ఇన్నింగ్స్‌లు) 16 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హాషిమ్ ఆమ్లా (94 ఇన్నింగ్స్‌ల్లో 16 శతకాలు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (110 ఇన్నింగ్స్‌లు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (110 ఇన్నింగ్స్‌లు)ల రికార్డులను అధిగమించాడు.
ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ (115 బంతుల్లో 105; 12 ఫోర్లు) సాధించడం ద్వారా బాబర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇదే సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలోనూ శతకం బాదిన బాబర్ (83 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్) వన్డే క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7, 13, 14, 15 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఈ రికార్డులతో పాటు బాబర్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ నాలుగో సెంచరీ సాధించిన కెప్టెన్‌గా టీమిండియా మాజీ సారధి, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ (4) రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (13) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. మహ్మద్ వసీం (3/40), హరీస్ రౌఫ్ (3/39), షాహీన్ అఫ్రిది (2/40) నిప్పులు చెరగడంతో ఆసీస్‌ను 41.5 ఓవర్లలో 210 పరుగులకే కట్టడి చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఛేదనలో బాబర్ ఆజమ్ (105 నాటౌట్), ఇమామ్ (89 నాటౌట్) రాణించడంతో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1 తేడాతో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ నెగ్గడం పాక్‌కు ఇదే తొలిసారి.
చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్ సొంతం
Comments
Please login to add a commentAdd a comment