PAK VS NZ 4th ODI: కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు).. వన్డేల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు (97 ఇన్నింగ్స్‌ల్లో) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు దిగ్గజ సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు 18 సెంచరీలు సాధించేందుకు 102 ఇన్నింగ్స్‌లు ఆవసరమయ్యాయి. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో బాబర్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ మైలురాయిని అధిగమించాడు. బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాన్ మసూద్ (44), అఘా సల్మాన్ (58) రాణించగా.. ఆఖర్లో షాహీన్ అఫ్రిది (7 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, బెన్ లిస్టర్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment