హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్‌లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్‌లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది.
అంతకుముందు పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది.
మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు.
బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment