Cricket World Cup 2023 Schedule: India To Play Warm-Up Match Against England - Sakshi
Sakshi News home page

ODI WC 2023: సెప్టెంబర్‌ 30నే ఇంగ్లండ్‌తో భారత్‌ ఢీ.. హైదరాబాద్‌లో పాక్‌కు మరో మ్యాచ్‌ 

Published Wed, Jun 28 2023 10:45 AM | Last Updated on Wed, Jun 28 2023 11:13 AM

CWC 2023 Schedule: India To Play Warm Up Match Against England, Here Are Practice Games Details - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ నిన్న (జూన్‌ 27) విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 

దీనికి ముందు ఓ వారం​ రోజుల పాటు వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ పోటీలు సెప్టెంబర్‌ 29న మొదలై అక్టోబర్‌ 3 వరకు సాగుతాయి. ఇందులో భారత్‌ రెండు మ్యాచ్‌లు, పాక్‌ ఓ మ్యాచ్‌ ఆడనున్నాయి. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌‌తో, అక్టోబర్ 3న త్రివేండ్రంలో (తిరువనంతపురం) క్వాలిఫయర్-1తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.

వార్మప్‌ మ్యాచ్‌ల వివరాలు..

  • సెప్టెంబర్‌ 29: పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ (హైదరాబాద్‌)
  • సెప్టెంబర్‌ 30: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (గౌహతి)
  • అక్టోబర్‌ 3: ఇండియా వర్సెస్‌ క్వాలిఫయర్‌-1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement