CWC 2023: Total Three Matches To Be Played At Uppal Stadium, Hyderabad - Sakshi
Sakshi News home page

CWC 2023: హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే.. పాకిస్తాన్‌వే రెండు మ్యాచ్‌లు

Published Tue, Jun 27 2023 1:01 PM | Last Updated on Tue, Jun 27 2023 1:26 PM

CWC 2023: Total Three Matches To Be Played At Uppal Stadium Hyderabad - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్‌వి కావడం విశేషం. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ క్వాలిఫయర్‌-1తో తలపడుతుంది. 

ఉప్పల్‌ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • అక్టోబర్‌ 6 (శుక్రవారం​): పాకిస్తాన్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌-1
  • అక్టోబర్‌ 9 (సోమవారం​): న్యూజిలాండ్‌‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌-1
  • అక్టోబర్‌ 12 (గురువారం​): పాకిస్తాన్‌ వర్సెస్‌ క్వాలిఫయర్‌-2 

హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్ధులుగా ఉండే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement