Rajiv Gandhi International Cricket Stadium
-
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
ENG vs IND 1st Test: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పై చేయి
England Vs India 1st Test Match Day 1 Score Updates ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పై చేయి హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఇంగ్లండ్‌పై టీమిండియా పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(76), శుబ్‌మన్ గిల్(14) పరుగులతో ఉన్నారు. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 80 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు. జైశ్వాల్ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 9 ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-0 భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 41, రోహిత్ శర్మ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్.. తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ జైశ్వాల్ ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. క్రీజులో జైశ్వాల్(18), రోహిత్ శర్మ(1) పరుగులతో ఉన్నారు. 3ఓవర్లకు భారత్ స్కోర్: 22/0 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(70) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో స్పిన్నర్లు చెలరేగారు. రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 61.3: అశ్విన్ బౌలింగ్‌లో మార్క్‌వుడ్ బౌల్డ్ అయ్యాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో జాక్ లీచ్ క్రీజులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో భాగంగా మార్క్‌వుడ్ రూపంలో అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ జమైంది. ఇక ఇప్పటికే జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నారు. బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ 60.2: జడేజా బౌలింగ్‌లో సిక్స్ బాది ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 61 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 233-8 ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్ 193 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన హార్ట్లీ.. జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయాడు. క్రీజులోకి మార్క్ వుడ్ వచ్చాడు. 56 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 184/7 ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 56 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(22), టామ్ హార్ట్లీ(20) పరుగులతో ఉన్నారు. ఏడో వికెట్ డౌన్ 155 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కేఎస్ భరత్ క్యాచ్ పట్టడంతో రెహాన్ అహ్మద్ (13) ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆరో వికెట్ డౌన్.. ఫోక్స్ ఔట్ 137 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన బెన్ ఫోక్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ ఔట్ లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జో రూట్.. జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో బెన్ ఫోక్స్ వచ్చాడు. 37 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 128/5 నాలుగో వికెట్ డౌన్ 121 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 37 పరుగులతో మంచి టచ్‌లో కన్పించిన బెయిర్ స్టోను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ►33 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 118/3, క్రీజులో జో రూట్(26), జానీ బెయిర్ స్టో(37) పరుగులతో ఉన్నారు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ స్కోర్: 108/3 మొదటి రోజు లంచ్ విరామానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(18), జానీ బెయిర్ స్టో(32) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా ఒక్క వికెట్ సాధించారు. 24 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 95/3 వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టల్లో పడ్డ ఇంగ్లండ్‌ను బెయిర్ స్టో(21), జో రూట్(16) అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 24 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 95/3 సిరాజ్ సూపర్ క్యాచ్.. ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ(20) ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్‌తో క్రాలీని పెవిలియన్‌కు పంపాడు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 58 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ డౌన్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బెన్ డకెట్.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 58/1 5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/0 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్‌కు ఛాన్స్ లభించింది. ఇక ఇంగ్లండ్ జట్టు కూడా మూడు స్పిన్నర్లు, ఒక పేసర్‌తో ఆడుతోంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్),యశస్వి జైస్వాల్,శుభమన్ గిల్,శ్రేయస్ అయ్యర్,కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజా,శ్రీకర్ భరత్,అక్షర్ పటేల్,రవిచంద్రన్ అశ్విన్,జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలీ,బెన్ డకెట్,ఒల్లీ పోప్,జో రూట్,జానీ బెయిర్‌స్టో,బెన్ స్టోక్స్ (కెప్టెన్),బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్),రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ,మార్క్ వుడ్,జాక్ లీచ్ -
ఈనెల 25న భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
-
అజారుద్దీన్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
WC 2023 NZ Vs NED Match Pics: ఉప్పల్‌లో న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్(ఫొటోలు)
-
NZ vs PAK: ప్రేక్షకులు లేకుండానే క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్–న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సన్నాహక మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈమేరకు రాచకొండ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ బీసీసీఐ, హెచ్‌సీఏ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులతో పాటు బీసీసీఐ/ఐసీసీ అధికారులు తప్ప సాధారణ వీక్షకులకు ప్రవేశం లేదని చెప్పారు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కావున క్రీడాకారులకు ఎలాంటి శాంతిభద్రత సమస్యలు లేకుండా చూడా లని పోలీసుల సిబ్బందికి సూచించారు. సమావేశంలో రిటైర్డ్ డీజీపీ (సీఆర్పీఎఫ్) దుర్గాప్రసాద్, డీసీపీ అభిషేక్ మహంతి, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాల, ఏసీపీలు నరేష్ రెడ్డి, శ్రీనివాస్, బీసీసీఐ, హెచ్‌సీఏ అధికారులు పాల్గొన్నారు. -
World Cup: హైదరాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లు ఇవే.. పాకిస్తాన్‌వే రెండు మ్యాచ్‌లు
వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. భారత్‌లో జరిగే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్వి కావడం విశేషం. మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్వాలిఫయర్-1తో తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్-1 అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్-2 హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, జింబాబ్వే ప్రత్యర్ధులుగా ఉండే అవకాశం ఉంది. -
SRH Vs DC: ఉప్పల్‌లో కింగ్! అప్పుడు మా వార్నర్ అన్న.. ఇప్పుడు..
IPL 2023 SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆస్ట్రేలియా ఓపెనర్. హైదరాబాద్ సారథిగా జట్టును ముందుకు నడిపించి 2016లో సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్ అందించాడు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచి మైదానంలో ఆటతో ఆకట్టుకున్న వార్నర్ భాయ్.. మైదానం వెలుపల టాలీవుడ్ హీరోల రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. వార్నర్‌తో పాటు అతడి కుటుంబం మొత్తం ఆరెంజ్ ఆర్మీలో భాగమైంది. ‘వార్నర్ అన్నా’ అంటూ అభిమానులు అతడిని అక్కున చేర్చుకున్నారు. అవమానకర రీతిలో జట్టును వీడి కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అవమానకర రీతిలో వార్నర్ రైజర్స్‌ను వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ హైదరాబాదీల ప్రేమను నేటికీ పొందుతున్నాడతడు. ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఉప్పల్ మైదానంలో వార్నర్ అడుగుపెట్టనున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత.. ఫ్యాన్స్ ఎమోషనల్ రిషభ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ స్టార్.. సోమవారం నాటి మ్యాచ్‌తో నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌ను గుర్తు చేసుకుని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఉప్పల్‌లో కింగ్ వార్నర్ ‘‘అన్నా.. నువ్వు ఏ జట్టులో ఉన్నా.. మాకు మాత్రం ఎప్పుడూ హైదరాబాదీవే!’’ అంటూ ట్వీట్లు, మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్ పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. కాగా 2014- 21 వరకు వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆఖరి సీజన్ మినహా ప్రతి ఎడిషన్‌లో 500 పైచిలుకు(528, 562, 848, 641, 692, 548, 195) పరుగులతో ఎస్ఆర్హెచ్ టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఉప్పల్ స్టేడియంలో ఆడిన 31 ఇన్నింగ్స్‌లో వార్నర్ సాధించిన పరుగులు 1602. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, మూడు శతకాలు ఉన్నాయి. చదవండి: ధోని కోపంతో బ్యాట్ విరగ్గొట్టాడు: హర్భజన్ సింగ్ ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెప్పలేనన్న సచిన్! అంజలి అంతటి త్యాగం చేసిందా? David Warner coming to uppal after 5 years🥹 pic.twitter.com/bkQgozSe6B — Remo Mama (@RemoMowa) April 24, 2023 David Warner at the Rajiv Gandhi International Stadium: Innings - 31. Runs - 1,602. Average - 66.75. Strike Rate - 161.65. Fifties - 15. Hundreds - 3. - 18 fifty plus scores in just 31 innings! Hyderabad's favourite returns after 4 long years, but this time for DC. pic.twitter.com/9ZAhYQ0ODl — Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023 David Warner returns to Hyderabad today, it will be an emotional day, he was the heart of soul of SRH, played 7 seasons for Orange Army. 2014 - 528 runs 2015 - 562 runs 2016 - 848 runs 2017 - 641 runs 2019 - 692 runs 2020 - 548 runs 2021 - 195 runs The GOAT of SRH - Warner. pic.twitter.com/bWfoFtISJW — Johns. (@CricCrazyJohns) April 24, 2023 -
ఉప్పల్‌లో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ గెలుపు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్.. 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. మంగళవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వివరాలు Ðð ల్లడిస్తున్న రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ► 2,500 మంది పోలీసులు, 250 మందితో సెక్యూరిటీ వింగ్ , 403 మంది ట్రాఫిక్ సిబ్బంది, 1091 మంది లా అండ్ ఆర్డర్, నాలుగు ప్లాటూన్ల టీఎస్ఎస్పీ బృందాలు, ఆరు ప్లటూన్ల ఆర్మ్డ్ సిబ్బంది, రెండు ఆక్టోపస్ టీంలు, మౌంటెడ్ పోలీస్, వజ్రా తదితర సిబ్బందితో భారీ బందోబస్తు. ►అలాగే ఎస్బీ, సీసీఎస్, ఎస్ఓటీ, రెండు ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేడియం పరిసర ప్రాంతాలు, స్డేడియంలో, ప్రేక్షకులు కూర్చునే చోటు, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో కలిసి మొత్తం 300 సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ టీవీలతో గస్తీ.. ►సీసీ టీవీల దృశ్యాలను ఎప్పటికప్పుడు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూం. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో నిరంతర గస్తీ. ►పేలుడు పదార్థాలను గుర్తించేలా ప్రత్యేక టీంల ఏర్పాటు. బ్లాక్ టికెట్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికే 4 కేసులు బుక్ చేశాం. చదవండి: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి ఎక్కడ మహిళలుంటే అక్కడ షీ టీం ►ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి వచ్చే మహిళల భద్రతకు ప్రాధాన్యం. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ షీటీంలు అందుబాటులో ఉంటాయి. వీఐపీలకే గేట్ నంబర్ వన్.. ఈసారి గేట్ నంబర్ వన్ను వీఐపీలకే అనుమతి ఉంటుంది. 12 నంబర్ గేట్‌ను గేట్ 1ఏగా గుర్తించి.. దాని ద్వారా జనరల్ పబ్లిక్‌ను అనుమతి ఇవ్వనున్నాం. భారీ వాహనాల దారి మళ్లింపు ►బుధవారం ఉదయం నుంచే ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు, సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే అన్ని భారీ వాహనాలను దారి మళ్లిస్తాం. ►వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచెర్ల, మల్లాపూర్‌ల మీదుగా దారి మళ్లిస్తాం. సెల్ఫోన్లకు మాత్రమే అనుమతి ప్రేక్షకులు కేవలం సెల్ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను స్టేడియంలోకి అనుమతి ఉండదు. ►తాగునీరు, తినుబండారాల విక్రయం ►తిను బండారాలు, తాగునీరు.. అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్‌సీఏ ద్వారా స్టేడియంలో విక్రయిస్తారు. ►సూచించిన రేట్లకే స్టాల్స్ నిర్వాహకులు వీటిని విక్రయించాలి. లేనిపక్షంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. సూచించిన స్థలాల్లోనే పార్కింగ్.. ►హబ్సిగూడ చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు, రామంతాపూర్ విశాల్ మార్ట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు రోడ్డుకిరువైపులా ఎలాంటి వాహనాలను పార్క్ చేయొద్దు. ►కేటాయించిన స్థలాల్లోనే పార్కు చేయాల్సి ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చినవారు టీఎస్ఐఐసీ స్థలంలోనే వాహనాలను పార్కు చేయాలి. ఏ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచించే బోర్డులను ఏర్పాటు చేశాం. -
హైదరాబాద్‌లో కివీస్‌తో మ్యాచ్.. ఆ కిక్కే వేరు.. టీమిండియాదే పైచేయి! ఈసారి..
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది. పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్‌రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్సన్.. ఇలా ఎందరో టాప్‌మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్‌తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్‌తో వన్డే సిరీస్‌లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్‌కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది. పిచ్‌ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా.. ►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్‌క్లిఫ్ 137 నాటౌట్). ► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268). ►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్గ్రేట్బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21). న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327). ►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48). మరుపురాని వన్డే మ్యాచ్ ఎప్పుడు: 1999, నవంబర్ 8 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39). సచిన్, సెహ్వాగ్‌ల వీర విహారం ఎప్పుడు: 2003, నవంబర్ 15 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38). ఉప్పల్‌లో భారత్ ఇలా.. 2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి 13 మ్యాచ్‌లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్‌ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది. -
ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే!
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రేపటితో తెరలేవనుంది. బుధవారం ఉప్పల్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. టీమిండియా హోంగ్రౌండ్స్లోనూ క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానాలు చాలానే ఉంటాయి. వాటినే మన భాషలో ఫెవరెట్ గ్రౌండ్ అని పిలుస్తుంటాం. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఉప్పల్ స్టేడియం అనగానే కోహ్లికి పూనకాలు రావడం గ్యారంటీ. ఈ పిచ్‌పై అద్బుతమైన బ్యాటింగ్ రికార్డు కలిగి ఉన్న కోహ్లి బ్యాట్ నుంచి మరో సెంచరీ వస్తుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు ఫార్మాట్లు కలిపి 74 సెంచరీలు బాదిన కోహ్లి.. 75వ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతనున్న ఫామ్ దృశ్యా ఇది అంత పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇక వన్డే క్రికెట్ అంటే కోహ్లికి కొట్టిన పిండి. 30 నుంచి 40 పరుగులు చేశాడంటే కచ్చితంగా సెంచరీ సాధించే దాకా క్రీజును వదలడం లేదు. ఇక కోహ్లి ఈ గ్రౌండ్లో కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 673 పరుగులు సాధించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో 66 పరుగులతో మెరిసిన కోహ్లి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు.. -
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హైదరాబాద్ వన్డే.. టికెట్ల విక్రయం ఎప్పుడు, ఎలా అంటే..?
IND VS NZ 1st ODI: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిశాక, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కివీస్ 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 18న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే, 21న రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే, 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. అనంతరం జనవరి 27న రాంచీ వేదికగా తొలి టీ20, 29న లక్నో వేదికగా రెండో టీ20, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న మూడో టీ20 ఆడనుంది. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి, టీ20లు రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం, మ్యాచ్‌కు ముందు షెడ్యూల్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. గతేడాది ఆసీస్‌తో టీ20 సందర్భంగా టికెట్ల విక్రయంలో జరిగిన రసాభసను దృష్టిలో ఉంచుకుని ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గతంలోలా కాకుండా ఈసారి టికెట్లను కేవలం ఆన్లైన్లో (పేటీయం) మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్లో టికెట్లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా సేల్ చేస్తామని తెలిపారు. మ్యాచ్‌కు రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని, విక్రయించిన టికెట్లను ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు (ఉదయం 10 నుండి 3 వరకు) కలెక్ట్ చేసుకోవాలని సూచించారు. స్టేడియం కెపాసిటీ 39,112 అయితే, 9695 కాంప్లిమెంటరీ టికెట్స్ పోగా మిగతా 29, 417 టికెట్స్ ఆన్లైన్లో సేల్ చేస్తామని తెలిపారు. న్యూజిలాండ్ టీమ్ జనవరి 14న హైదరాబాద్‌కు చేరుకుంటుందని, 15న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుందని, జనవరి 16న టీమిండియా నగరానికి చేరుకుంటుందని వివరించారు. -
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో సూపర్ మ్యాచ్
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టు రానుంది. హోం సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జనవరి 18న ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. కాగా చివరగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు. అయితే మరోసారి హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడంతో అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15 టీ20 సిరీస్‌తో ఆరంభం- వన్డే సిరీస్‌తో ముగింపు న్యూజిలాండ్ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1 వన్డే సిరీస్‌తో మొదలు- టీ20 సిరీస్‌తో ముగింపు ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22 టెస్టు సిరీస్‌తో ప్రారంభం- వన్డే సిరీస్‌తో ముగింపు -
IND VS AUS 3rd T20: వేలల్లో టికెట్లు.. కోట్లలో బెట్టింగ్‌లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ ద్వారా బ్లాక్‌మార్కెటింగ్, బెట్టింగ్ మాఫియాలు భారీగా డబ్బు దండుకున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు వరకు బ్లాక్‌లో టికెట్ల దందా యథేచ్ఛగా సాగగా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ సైతం జోరుగా జరిగింది. స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్, సౌత్ పెవిలియన్, నార్త్ పెవిలియన్, టెర్రస్.. ఇలా పలు రకాలుగా ఉండే టికెట్లను బ్లాక్ మార్కెట్ మాఫియా కనీసం నాలుగింతలు పెంచి అమ్మింది. మరోవైపు మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ మాఫియా రూ. కోట్లలో కొల్లగొట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన ఆటగాళ్లు చేయబోయే పరుగులు, వికెట్లు తీసే బౌలర్లు, మొత్తంగా జట్టు సాధించే స్కోర్.. ఇలా పలు విభాగాల్లో బెట్టింగ్ సాగింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ గ్రూపులు క్రియేట్ చేసి ఆధార్ కార్డుతో కూడిన వ్యక్తిగత వివరాలు పంపిన వారినే ఇందులో చేర్చుకున్నట్లు తెలిసింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా కేంద్రాలుగా సాగిన ఈ దందాలో రూ.1000 మొదలు రూ. 10 లక్షల దాకా ఒక్కో బంతికి లేదా ఒక్కో పరుగుకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, ఆక్టోపస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఐటీ సెల్, షీ టీమ్స్ అన్ని పోలీసు విభాగాలు విధుల్లో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. ట్రాఫిక్ ఆంక్షలిలా.. మైదానం చుట్టూ నేటి మధ్యాహ్నం నుంచి తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రవేశం లేదు. గేట్– 1 వీఐపీ ద్వారంలోని పెంగ్విన్ గ్రౌండ్లో 1,400 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్డేడియం నలువైపులా అయిదు క్రేన్లు అందుబాటులో ఉంటాయి. ఎన్జీఆర్ఐ గేట్ –1, జెన్‌ప్యాక్ట్‌లకు రోడ్డుకిరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక యాప్ ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్ మెసేజ్ రూపంలో వస్తుంది. 21 పార్కింగ్ ప్రాంతాలు ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 370 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. స్టేడియం చుట్టూ దాదాపు 21 పార్కింగ్ ప్రాంతాలను అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు స్టేడియం చుట్టూ 7.5 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లపై పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించినట్లు, ప్రధాన కూడళ్లు నాగోల్ చౌరస్తా, ఉప్పల్ చౌరస్తా, హబ్సిగూడ ఎల్జీ గోడౌన్ వద్ద, హబ్సిగూడ చౌరస్తాలో పార్కింగ్ ప్రదేశాలను చూపే అతి పెద్ద సమాచారమిచ్చే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు.. ►ఉప్పల్ వైపు వచ్చే అన్ని భారీ వామనాలను దారి మళ్లించనున్నారు. ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను చెంగిచర్ల వద్దే దారి మళ్లిస్తారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలను దారి మళ్లించి దిల్సుఖ్నగర్ మీదుగా వయా అంబర్‌పేట నుంచి పంపించనున్నారు. వీటికి అనుమతి లేదు.. ►స్టేడియం లోపలికి మొబైళ్లు, ఇయర్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. హెల్మెట్లు, కెమెరా, బైనాక్యులర్, ల్యాప్‌ట్యాప్, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, బ్లేడ్లు, చాకులు, వాటర్ బాటిళ్ల వంటివేవీ స్టేడియం లోనికి అనుమతించరు. -
ఉప్పల్ 'దంగల్'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
సాక్షి, హైదరాబాద్: నగర క్రీడాభిమానుల మూడేళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. మొహాలీలో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. నాగ్‌పూర్‌లో భారత్ మెరిసింది. ఇక చివరిదైన మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి రోహిత్ సేన, ఫించ్ బృందం సిద్ధమయ్యాయి. శనివారం సాయంత్రం రెండు జట్లూ హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం తర్వాత నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి వ్యూహాలకు పదును పెట్టుకోనున్నాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్ కావడం.. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం రావడం... ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానం ‘హౌస్‌ఫుల్’ కానుంది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని అభిమానులు ఎలాగైనా తమ అభిమానుల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.... టికెట్లపై ఆశలు వదులుకున్న వారు మాత్రం ఇంట్లో టీవీల ముందు కూర్చోని చూసేందుకు... లేదంటే మొబైల్స్‌లో వీక్షించడానికి... హోటల్స్‌లో పెద్ద స్క్రీన్లపై ఆస్వాదించడానికి సిద్ధమైపోయారు. సమరం... సమం.. ►2005 నుంచి ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో (వన్డే, టెస్టు, టి20) కలిపి 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టి20 మ్యాచ్ ఉన్నాయి. అయిదు టెస్టుల్లో భారత్ నాలుగింటిలో నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఇక ఆరు వన్డేల్లో భారత్ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో భారత్‌నే విజయం వరించింది. ►ఉప్పల్ వేదికపై భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా నాలుగుసార్లు (మూడు వన్డేలు, ఒక టెస్టు) తలపడ్డాయి. రెండుసార్లు భారత్... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య సిటీలో తొలిసారి పోరు జరగనుంది. ►2007 అక్టోబర్ 5న జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 290 పరుగులు సాధించింది. మాథ్యూ హేడెన్ (60; 10 ఫోర్లు), మైకేల్ క్లార్క్ (59; 4 ఫోర్లు), ఆండ్రూ సైమండ్స్ (89; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 47.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. యువరాజ్ సింగ్ (121; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో సెంచరీ సాధించాడు. ►2009 నవంబర్ 5న ఈ వేదికపై రెండోసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డేలో తలపడ్డాయి. ఈసారి ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 350 పరుగులు సాధించింది. షేన్ వాట్సన్ (93; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కామెరాన్ వైట్ (57, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... షాన్ మార్‡్ష (112; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అలరించాడు. 351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) గొప్పగా ఆడి సెంచరీ సాధించినా భారత్‌ను విజయతీరానికి చేర్చలేకపోయాడు. ►2013 మార్చి 2 నుంచి 5 వరకు ఇదే వేదికపై భారత్, ఆస్ట్రేలియా టెస్టు ఆడగా... భారత్ ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగా... భారత్ 503 పరుగులు సాధించింది. మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ, చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ చేశారు. 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 131 పరుగులకే కుప్పకూలింది. ►2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడోసారి వన్డేలో పోటీపడగా... ఈసారి భారత్‌ను విజయం వరించింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసి విజయం సాధించింది. కేదార్ జాదవ్ (81 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ధోని (59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో భారత్‌ను గెలిపించారు. -
కలిసొచ్చిన ఉప్పల్ స్టేడియం.. కోహ్లి మెరిసేనా!
భారత్‌లో విరాట్ కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఈ గ్రౌండ్లో కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 8 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 607 పరుగులు స్కోరు చేశాడు. 2019లో చివరిసారి ఈ గ్రౌండ్లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 94 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో కోహ్లి పెద్దగా రాణించలేదు. తొలి టి20లో 2 పరుగులకే వెనుదిరిగిన కోహ్లి.. నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టి20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ఈ మైదానం ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు అచ్చిరాలేదు. ఈ గ్రౌండ్లో రోహిత్ 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 46 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు కూడా ఈ గ్రౌండ్ కలిసి రాలేదు. 2019 మార్చి 2న భారత్‌తో ఇక్కడ జరిగిన వన్డేలో ఫించ్ ‘డకౌట్’ అయ్యాడు. ఇక తొలి రెండు టి20ల్లో చెరొక విజయం సాధించిన ఇరుజట్లు హైదరాబాద్‌లో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. చదవండి: ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా!
సాక్షి, ఉప్పల్: ఈ నెల 25న ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టీ– 20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసింది. క్రికెట్ క్రీడాభిమానులకు టికెట్లు ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లోకి తరలించడానికి హెచ్‌సీఏ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన పత్రాలతో ఏఐవైఎఫ్ ప్రతినిధులు టికెట్లతో పాటు ఆట సమయంలో తిను బండారాలు, శీతల పానీయాలను సైతం అధిక రేట్లకు విక్రయించే యత్నాలపైనా విచారణ చేపట్టాలని కోరారు. కేవలం 25 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించి 75 శాతం టికెట్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి హెచ్‌సీఏ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏఐవైఎఫ్ అధ్యక్షుడు వలి ఉలా ఖాద్రి, రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర పాల్గొన్నారు. రసూల్‌పుర: ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను రద్దు చేయాలి.. అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ను తొలగించాలి.. అజారుద్దీన్ డౌన్ డౌన్’ అంటూ క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్లో నినాదాలు చేశారు. భారత్– ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న టీ– 20 మ్యాచ్ నేపథ్యంలో.. టికెట్ల కోసం వేలాది మంది జింఖానా మైదానానికి వచ్చారు. టికెట్లు విక్రయించాలంటూ గోడ దూకి గ్రౌండ్ లోపలికి చేరుకున్నారు. చదవండి: జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ టికెట్లు ఇచ్చేవరకూ తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే బైఠాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్ల కోసం వచ్చామని.. తీరా చూస్తే వాటిని అమ్ముకున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే..?
IND VS AUS 3rd T20: రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వనుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నెల 20 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్.. ఉప్పల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25న జరిగే మూడో టీ20లో టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు రేపటి (సెప్టెంబరు 15) నుంచి అందుబాటులోకి వస్తాయి. పేటీయం ఇన్సైడర్ (ఆన్లైన్) ద్వారా, అలాగే స్టేడియం వద్దనున్న ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా వీటిని అభిమానులు కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధరలు రూ. 800 నుంచి ప్రారంభమవుతాయి. జీఎస్టీ అదనంగా ఉంటుంది. టికెట్ల ధరల్లో విద్యార్ధులకు ప్రత్యేక డిస్కౌంట్ ఉండనుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగే టీ20 సిరీస్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా.. సౌతాఫ్రికాతో మరో టీ20 సిరీస్, వన్డే సిరీస్ కూడా ఆడనుంది. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ -
ఉప్పల్ స్టేడియంను ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్‌గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్‌సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది. -
నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్
కొచ్చి: లీగ్ తెరపైకి కొత్తగా వాలీబాల్ వచ్చింది. స్కూల్, కాలేజ్ గ్రౌండ్లతో పాటు అక్కడక్కడ కనిపించే ఈ క్రీడ టీవీల్లో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ మొదలవుతోంది. ఆరు ఫ్రాంచైజీ జట్లు రెండు వేదికలు కొచ్చి, చెన్నైలో తలపడతాయి. మొదట 12 లీగ్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. మరో ఆరు మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు. ఈ నెల 22న టైటిల్ పోరు జరుగుతుంది. శనివారం కొచ్చి బ్లూ స్పైకర్స్, యూ ముంబా వాలీ జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లతో పాటు బ్లాక్‌హాక్స్ హైదరాబాద్, అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలకట్ హీరోస్, చెన్నై స్పార్టన్స్ బరిలో ఉన్నాయి. లీగ్ దశను 15 పాయింట్ల విధానంలో ఐదు సెట్ల మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. ఐదు సెట్లూ గెలిస్తే వైట్‌వాష్‌గా పేర్కొంటారు. ఇలా చేస్తే అదనంగా మూడు పాయిట్లు లభిస్తాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లను 25 పాయింట్ల విధానంలో నిర్వహిస్తారు. ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు రూపే స్పాన్సర్షిప్ చేస్తోంది. -
సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం
-
‘ఐపీఎల్’కు కట్టుదిట్టమైన భద్రత
ఉప్పల్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, అదనపు డీసీపీ ఉదయ్ కిరణ్, మల్కాజిగిరి డీసీపీ రమేష్ నాయుడులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రత ఏర్పాట్లను వెల్లడించారు. ఉప్పల్ స్టేడియంలో బుధవారం ప్రారంభ మ్యాచ్, వచ్చే నెల 21న ఫైనల్ సహా ఎనిమిది మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9, 17, 19, 30, మే 6, 8 తేదీల్లో మిగతా ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల కోసం ప్రత్యేకించి 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 700 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఆరు ప్లాటూన్ల ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సీసీఎస్ స్టాఫ్, రెండు టెండర్ స్క్వాడ్ సహా మొత్తం 1800 మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికార్లు వెల్లడించారు. పోలీస్ పహారాలో స్టేడియం... ఉప్పల్ స్టేడియంను సోమవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పోలీస్ భద్రతతో పాటు 88 సీసీ కెమెరాలు, అవసరమైన చోటల్లా చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్ టీమ్‌లతో 24 గంటలు పహారా కాస్తున్నట్లు తెలిపారు. అనుకోని సంఘటనలు ఎదురైతే అప్పటికప్పుడు స్పందించే విధంగా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై కన్నేసి ఉంచామని... అనుమానిత స్థలాల్లో రోజూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. స్టేడియం లోపల, బయట షీ టీమ్‌లను అందుబాటులో ఉంచుతామని, ఈవ్ టీజర్లను గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి వ్యాపారస్తులు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లకే తినుబండారాలు, శీతల పానీయాలను విక్రయించాలని, ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇందుకోసం ప్రత్యేక వెండర్ సూపర్వైజింగ్ బృందాలను నియమించామని కమిషనర్ చెప్పారు. బీసీసీఐ జారీ చేసే అక్రిడేషన్ కార్డులను బదిలీ చేసుకోవద్దని సూచించారు. 4 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు రెండు గంటలు ముందుగానే అనుమతిస్తామన్నారు. మొబైల్ ఫోన్లకు ఓకే.. కెమెరాలకు నో! మొబైల్ ఫోన్లను అనుమతిస్తామని ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, పెన్నులు, ఫర్ఫ్యూమ్స్, సెల్‌ఫోన్ రీచార్జి బ్యాటరీలను స్టేడియంలోపలికి అనుమతించరు. ట్రాఫిక్ దారి మళ్లింపు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్ఎఫ్సి బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవే కు కలవాల్సి ఉంటుంది. అటునుంచి వచ్చే వారు కూడా అదే దారిలో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్రాంతాలు సుమారు 9000 వాహనాల పార్కింగ్‌కు సరిపోయే స్థలాలను కేటాయించారు. ఐదు వేల ద్విచక్ర వాహనాలు, నాలుగు వేల ఫోర్ వీలర్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి గేట్ నంబర్ 1, 2 లకు వెళ్లాలి. కారు పాస్‌లు లేని వారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపుల తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. దివ్యాంగులు తమ వాహనాలను పార్క్ చేసుకున్న అనంతరం రామంతాపూర్ దారి గుండా స్టేడియంలోకి గేట్ నంబర్ –3 ద్వారా లోపలికి ప్రవేశించాలి. గేట్ నంబర్ 4 నుంచి 10 ద్వారా వెళ్లాల్సినవారు తమ వాహనాలను పెంగ్విన్ గ్రౌండ్లో పార్కు చేసి, ఏక్ మినార్ మజీద్ రోడ్ నుంచి లోపలికి వెళ్లొచ్చు. -
'ఉప్పల్ స్టేడియం పేరు మార్చితే ఊరుకోం'
ఉప్పల్ (హైదరాబాద్) : ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు మార్చినా.. అందుకు ప్రయత్నాలు చేసినా.. తీవ్ర పరిణామాలుంటాయని స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. గురువారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో హెచ్‌సీఏ కమిటీ సమావేశంలో స్టేడియం పేరు మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో వారి నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినోద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్టేడియం ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. గేటు ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్డేడియం వద్ద బైటాయించిన నాయకులు, కార్యకర్తలు హెచ్‌సీఏ అధికారులకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. పేరు మార్పిడి చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈలోపుగా నిరసన చేస్తున్న కార్యకర్తల వద్దకు చేరుకున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు హర్షద్ ఆయూబ్ వచ్చి పేరు మార్చే ఆలోచనను విరమించుకున్నట్లు తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది.