ఉప్పల్ (హైదరాబాద్) : ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు మార్చినా.. అందుకు ప్రయత్నాలు చేసినా.. తీవ్ర పరిణామాలుంటాయని స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. గురువారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో హెచ్‌సీఏ కమిటీ సమావేశంలో స్టేడియం పేరు మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో వారి నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినోద్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్టేడియం ఎదుట ఆదివారం ఆందోళన చేపట్టారు. గేటు ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
కొందరు కార్యకర్తలు స్టేడియంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్డేడియం వద్ద బైటాయించిన నాయకులు, కార్యకర్తలు హెచ్‌సీఏ అధికారులకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. పేరు మార్పిడి చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈలోపుగా నిరసన చేస్తున్న కార్యకర్తల వద్దకు చేరుకున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు హర్షద్ ఆయూబ్ వచ్చి పేరు మార్చే ఆలోచనను విరమించుకున్నట్లు తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది.
'ఉప్పల్ స్టేడియం పేరు మార్చితే ఊరుకోం'
Published Sun, May 29 2016 4:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM
Advertisement