టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రేపటితో తెరలేవనుంది. బుధవారం ఉప్పల్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. టీమిండియా హోంగ్రౌండ్స్‌లోనూ క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానాలు చాలానే ఉంటాయి. వాటినే మన భాషలో ఫెవరెట్ గ్రౌండ్ అని పిలుస్తుంటాం. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి.
ఉప్పల్ స్టేడియం అనగానే కోహ్లికి పూనకాలు రావడం గ్యారంటీ. ఈ పిచ్‌పై అద్బుతమైన బ్యాటింగ్ రికార్డు కలిగి ఉన్న కోహ్లి బ్యాట్ నుంచి మరో సెంచరీ వస్తుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు ఫార్మాట్లు కలిపి 74 సెంచరీలు బాదిన కోహ్లి.. 75వ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతనున్న ఫామ్ దృశ్యా ఇది అంత పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇక వన్డే క్రికెట్ అంటే కోహ్లికి కొట్టిన పిండి. 30 నుంచి 40 పరుగులు చేశాడంటే కచ్చితంగా సెంచరీ సాధించే దాకా క్రీజును వదలడం లేదు.
ఇక కోహ్లి ఈ గ్రౌండ్‌లో కోహ్లి మూడు ఫార్మాట్‌లలో కలిపి 9 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 673 పరుగులు సాధించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో 66 పరుగులతో మెరిసిన కోహ్లి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు
Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు..
Comments
Please login to add a commentAdd a comment