Batting record
-
Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు
ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు (25) 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఉస్మాన్ ఖ్వాజాతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో వార్నర్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను జాక్ హబ్స్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ (24)ల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మైఖేల్ ఆథర్టన్ (23), వీరేంద్ర సెహ్వాగ్ (23) మూడో స్థానంలో ఉన్నారు. కాగా, యాషెస్ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 38 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌కు నిలిపి వేశారు. ఆసీస్ గెలుపుకు ఇంకా 249 పరుగుల దూరంలో ఉంది. డేవిడ్ వార్నర్ (58), ఉస్మాన్ ఖ్వాజా (69) క్రీజ్‌లో ఉన్నారు. 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి.. యాషెస్‌లో 2017-18 సిరీస్ తర్వాత తొలిసారి శతక భాగస్వామ్యం నమోదైంది. ఆ సీజన్లో ఆసీస్ ఓపెనింగ్ పెయిర్ వార్నర్-కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ తొలి వికెట్‌కు 122 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేయగా.. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్-ఖ్వాజా జోడీ అజేయమైన 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా.. యాషెస్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. యాషెస్‌లో వార్నర్ ఇప్పటివరకు 8 సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌లో భాగమయ్యాడు. ఈ రికార్డుకు సంబంధించిన జాబితాలో జాక్ హబ్స్ (16) టాప్‌లో ఉండగా.. హెర్బర్ట్ సట్చ్క్లిఫ్ (15), మార్క్ టేలర్ (10) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. యాషెస్ ఐదో టెస్ట్ స్కోర్ వివరాలు (నాలుగో రోజు వర్షం అంతరాయం కలిగించే సమయానికి) ఇంగ్లండ్: 283 & 395 ఆసీస్: 295 & 135/0 -
ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
అజింక్యా రహానే కొన్నేళ్లుగా టీమిండియా తరపున టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతూ వచ్చాడు. గతేడాది సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత రహానే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రహానే పెద్దగా ఏం బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం తనను వెతుక్కుంటూ వస్తుందని భావించాడు. అయితే ఐపీఎల్‌ను అందుకు మూలంగా మార్చుకున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున ఆడిన రహానే ఎవరు ఊహించని రీతిలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రహానే.. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లాడి 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించాడు.ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శన రహానేను తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తుది జట్టులో చోటు సంపాదించాడు. ఒకప్పుడు రెగ్యులర్ టెస్టు బ్యాటర్ అయిన రహానే శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ ఏడు నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. రహానేను ఊరిస్తున్న రికార్డులు.. ఈ నేపథ్యంలోనే రహానే ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రహానే ఈ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 82 టెస్టులాడిన రహానే 4931 పరుగులు చేశాడు. మరో 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల మార్క్ అందుకుంటాడు. రహానే ఖాతాలో టెస్టుల్లో 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. మరొకటి పడితే వంద క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ఇక రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12,865 పరుగులు చేశాడు. మరో 135 పరుగులు చేస్తే 13వేల పరుగులు సాధించినట్లవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు మళ్లీ ఆసీస్‌తోనే ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమిండియా మూడు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకుంది. చివరి బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలు వచ్చారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ ఆడిన సీఎస్కే, గుజరాత్ టైటాన్స్‌లో సభ్యులు. మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నాడు. చదవండి: రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా? -
ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే!
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రేపటితో తెరలేవనుంది. బుధవారం ఉప్పల్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. టీమిండియా హోంగ్రౌండ్స్లోనూ క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానాలు చాలానే ఉంటాయి. వాటినే మన భాషలో ఫెవరెట్ గ్రౌండ్ అని పిలుస్తుంటాం. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న కోహ్లికి కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం ఒకటి. ఉప్పల్ స్టేడియం అనగానే కోహ్లికి పూనకాలు రావడం గ్యారంటీ. ఈ పిచ్‌పై అద్బుతమైన బ్యాటింగ్ రికార్డు కలిగి ఉన్న కోహ్లి బ్యాట్ నుంచి మరో సెంచరీ వస్తుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు ఫార్మాట్లు కలిపి 74 సెంచరీలు బాదిన కోహ్లి.. 75వ సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతనున్న ఫామ్ దృశ్యా ఇది అంత పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఇక వన్డే క్రికెట్ అంటే కోహ్లికి కొట్టిన పిండి. 30 నుంచి 40 పరుగులు చేశాడంటే కచ్చితంగా సెంచరీ సాధించే దాకా క్రీజును వదలడం లేదు. ఇక కోహ్లి ఈ గ్రౌండ్లో కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచ్‌లు (మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్) ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 673 పరుగులు సాధించాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో 66 పరుగులతో మెరిసిన కోహ్లి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: 71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు.. -
ముంబై క్రికెటర్ అబ్బురపరిచే బ్యాటింగ్ విన్యాసం.. ఏకధాటిగా 72 గంటల పాటు..!
ముంబై: ముంబై యువ క్రికెటర్ సిద్దార్థ్ మోహితే అబ్బురపరిచే బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఏకధాటిగా 72 గంటల ఐదు నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2015లో విరాగ్ మానే అనే క్రికెటర్ 50 గంటల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ చేయగా, తాజాగా సిద్దార్థ్.. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడంలో విరాగ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. తనలో ఎక్స్ట్రా టాలెంట్ ఉందిన ప్రపంచానికి తెలియజేయడానికే ఈ ప్రదర్శనను చేసినట్లు మోహితే చెప్పుకొచ్చాడు. మోహితే ఈ ఫీట్ సాధించడంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ పర్సనల్ కోచ్ జ్వాలా సింగ్ కీలకంగా వ్యవహరించాడు. మోహితే ఈ రికార్డు సాధించడం కోసం జ్వాలా సింగ్‌ను మెంటార్‌గా నియమించుకున్నాడు. చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ -
పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లి..
Kohli Croses 10000 Runs In T20 Cricket: ఐపీఎల్-2021 సెకండ్ ఫేస్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కాని 10000 పరుగుల మైలరాయిని దాటేశాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ తొలి బంతికి సింగల్ తీయడం ద్వారా ఓవరాల్ టీ20 కెరీర్లో పది వేల పరుగులను పూర్తి చేశాడు. భారత జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున మొత్తం 314 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 133కు పైగా స్ట్రైక్ రేట్‌తో 10000 పరుగులను పూర్తి చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం పొట్టి క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 447 మ్యాచ్‌ల్లో 14,273 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 564 మ్యాచ్‌ల్లో సెంచరీ, 56 హాఫ్ సెంచరీల సాయంతో 11 వేల పైచిలుకు పరుగులు సాధించాడు. వీరి తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (436 మ్యాచ్‌ల్లో 10,808 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (304 మ్యాచ్‌ల్లో 10,017 పరుగులు) రికార్డును అధిగమించాడు. చదవండి: అరుదైన 600 వికెట్ల క్లబ్లో చేరిన టీమిండియా పేసర్ -
నవ ఇంగ్లండ్ నిర్మాత
సాక్షి క్రీడా విభాగం: గత కొన్నేళ్లలో వన్డేల్లో భారీగా పరుగులు సాధించిన, రికార్డులు నమోదు చేసిన కోహ్లి, రోహిత్, గేల్, డివిలియర్స్ తదితర ఆటగాళ్లతో కూడిన జాబితాను చూస్తే ఇయాన్ మోర్గాన్ పేరు కనిపించదు. అతను ఓపెనర్ కాకపోవడమే అందుకు ప్రధాన కారణం. మోర్గాన్ తన కెరీర్లో ఎక్కువ భాగం ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్ కూడా తమ జట్టుకు ఫినిషర్‌గానే అతడిని చూసింది. అయితే మొదటి నుంచీ అతని బ్యాటింగ్ శైలి దూకుడుగానే ఉంటుంది. రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అరుదైన ఆటగాళ్లలో మోర్గాన్ కూడా ఒకడు. ఐర్లాండ్‌లో పుట్టిన అతను తన మాతృదేశం తరఫునే అరంగ్రేటం చేశాడు. స్కాట్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అయిన మోర్గాన్... 99 పరుగుల వద్ద రనౌట్ అయి ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మరచిపోలేని విధంగా మార్చుకున్నాడు! దాదాపు మూడేళ్ల పాటు ఐర్లాండ్‌కు ఆడిన (23 వన్డేలు) అనంతరం అతడిని ఇంగ్లండ్ సాదరంగా ఆహ్వానించింది. అనంతరం 2010 టి20 ప్రపంచ కప్‌ను గెలుచున్న ఇంగ్లండ్ జట్టులో మోర్గాన్ కీలక పాత్ర పోషించాడు. మధ్యలో టెస్టు క్రికెటర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, అది తన వల్ల కాదని గుర్తించి రెండేళ్లకే గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్ అనుభవంతో అతని బ్యాటింగ్‌లో మరింత ధాటి పెరిగింది. ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌గా మోర్గాన్ స్థానానికి తిరుగు లేకుండా పోయింది. మోర్గాన్ కెరీర్లో మేలి మలుపు 2014 క్రిస్మస్ సమయంలో వచ్చింది. వన్డేల్లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చూసీ చూసీ విసుగెత్తిన బోర్డు ఉన్నపళంగా కుక్‌ను తప్పించేసి మోర్గాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. రెండు నెలల తర్వాత జరిగిన ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగింది. బంగ్లా చేతిలో ఓటమితో క్వార్టర్ ఫైనల్ అవకాశం పోయింది. ఇంకా నాయకుడిగా కుదురుకోని మోర్గాన్ కూడా విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత జట్టు ప్రక్షాళన కార్యక్రమం సాగింది. వన్డేల నుంచి సీనియర్లు అండర్సన్, బ్రాడ్, బెల్లను తప్పించడంలో మోర్గాన్‌దే కీలక పాత్ర. ఆ తర్వాత విధ్వంసక బ్యాట్స్‌మెన్‌తో జట్టును నింపి స్వయంగా చెలరేగి ఆడుతూ సహచరులలో స్ఫూర్తిని నింపాడు. అంతే...ఇంగ్లండ్ కొత్త ప్రస్థానం మొదలైంది. వన్డేల్లో ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసిన జట్టు మళ్లీ అదే రికార్డును బద్దలు కొట్టింది. 2015 ప్రపంచ కప్ తర్వాత ఈ వరల్డ్ కప్‌కు ముందు ఏకంగా 18 సార్లు 350కు పైగా స్కోర్లు నమోదు చేస్తే నాలుగు సార్లు 400 పరుగులు దాటింది. వన్డేల్లో నంబర్‌వన్‌గా అవతరించిన ఇంగ్లండ్... మోర్గాన్ నాయకత్వంలో ఆడిన 13 వన్డే సిరీస్‌లలో 12 గెలుచుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఫేవరెట్‌గా చూస్తున్నారంటే అదంతా గత నాలుగేళ్లలో మోర్గాన్ నాయకత్వంలో వచ్చిన మార్పే కారణం. ఒక ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అత్యధికంగా 22 సిక్సర్లు (2007లో) కొడితే ఇవాళ ఒక్క మ్యాచ్‌లోనే జట్టు 25 సిక్సర్లు బాదింది. తన బ్యాటింగ్‌తో పాటు ఇదే జోరును జట్టు కొనసాగిస్తే వరల్డ్ కప్ విజేతగా ఈ ‘ఐరిష్ మ్యాన్’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. 2003 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాలో ఉండి ప్రేక్షకుడిగా చూశాను. కాడిక్ బౌలింగ్‌లో పక్కకు జరుగుతూ మిడ్‌వికెట్ మీదుగా టెండూల్కర్ కొట్టిన భారీ సిక్సర్ దాదాపు మైదానం బయటకు వెళ్లింది. నా జీవితంలో అలాంటి భారీ సిక్సర్ ఎప్పుడూ చూడలేదు. మ్యాచ్ గురించి నాకు ఆ సిక్సర్ తప్ప ఏమీ గుర్తు లేదు. అప్పటినుంచి సిక్సర్ల మోజు పెరిగిపోయిందంతే. –ఒక ఇంటర్వ్యూలో మోర్గాన్ -
రోహిత్ శర్మ రికార్డులు
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. సీఎస్కేపై 25 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 7 అర్ధసెంచరీలు బాదాడు. డేవిడ్ వార్నర్ (6), శిఖర్ ధావన్(6), కోహ్లి (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న రికార్డును రోహిత్ శర్మ సవరించాడు. 17 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. యూసఫ్ పఠాన్, ఎంఎస్ ధోని (16)లను అధిగమించి టాప్కు దూసుకెళ్లాడు. సురేశ్ రైనా 14 సార్లు, గౌతమ్ గంభీర్ 13 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నారు. విరాట్ కోహ్లి, అజింక్య రహానే 12 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నారు. లక్కీ చెపాక్..! చెపాక్ స్టేడియం రోహిత్ శర్మకు కలిసొచ్చింది. ఈ మైదానంలో అతడు బరిలోకి దిగిన ఆరు సార్లు విజయాన్ని అందుకున్నాడు. డెక్కన్ చార్జర్స్ తరపున రెండు సార్లు(2008, 2010), ముంబై ఇండియన్స్ ఆటగాడిగా (2012, 2013), కెప్టెన్‌గా (2015, 2019) నాలుగు పర్యాయాలు గెలుపు దక్కించుకున్నాడు. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో చేసిన అర్థసెంచరీ చెపాక్‌లో రోహిత్‌కు మొదటిది కావడం విశేషం. -
ధనాధన్ ధోని.. రికార్డులు
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పలు ఘనతలు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి కెప్టెన్‌గా మహి నిలిచాడు. ఇప్పటివరకు 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని 42.03 సగటుతో 4330 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఐపీఎల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బాట్స్‌మన్‌గా కూడా ‘మిస్టర్ కూల్’ రికార్డు కెక్కాడు. 203 సిక్సర్లలో మూడో స్థానానికి చేరాడు. క్రిస్ గేల్(323), ఏబీ డివిలియర్స్(204) అతడి కంటే ముందున్నారు. రోహిత్ శర్మ(190), సురేశ్ రైనా(190), విరాట్ కోహ్లి(186) కూడా ధోనికి దగ్గరలో ఉన్నారు. కాగా, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(84)ను ధోని మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్లో ధోనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. (చదవండి.. ధోని మమ్మల్ని భయపెట్టాడు: కోహ్లి) -
కోహ్లి.. కేక!
గాలె: పరుగుల యంత్రంగా ముద్రపడిన విరాట్ కోహ్లి ఒక్కో రికార్డును తన పేరిట లిఖించుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో అతడు మనో ఘనత సాధించాడు. సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును తిరగరాశాడు. విదేశాల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. లిటిల్ మాస్టర్ 19 ఇన్నింగ్స్‌లో వెయ్యి పూర్తిచేస్తే, కోహ్లి కేవలం 17 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. గ్యారీ సోబర్స్(13 ఇన్నింగ్స్), అలిస్టర్ కుక్(14), బాబ్ సింప్సన్(16) కోహ్లి కంటే ముందున్నారు. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును అంతకుముందు కోహ్లి అధిగమించాడు. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో అతడు ఈ రికార్డు సృష్టించాడు. సచిన్ 232 వన్డేల్లో సెకండ్ బ్యాటింగ్‌లో 17 సెంచరీలు చేస్తే.. 'ఛేజింగ్ హీరో' కేవలంలో 102 వన్డేల్లో 18 సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మరో రికార్డు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అజేయ శతకంతో కోహ్లి మరో ఘనత అందున్నాడు. టెస్టుల్లో తన బ్యాటింగ్ సగటును 50 దాటించాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని ఫార్మాట్లలో 50పైగా సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు.