కోహ్లి.. కేక!
గాలె: పరుగుల యంత్రంగా ముద్రపడిన విరాట్ కోహ్లి ఒక్కో రికార్డును తన పేరిట లిఖించుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో అతడు మనో ఘనత సాధించాడు. సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును తిరగరాశాడు. విదేశాల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. లిటిల్ మాస్టర్ 19 ఇన్నింగ్స్‌లో వెయ్యి పూర్తిచేస్తే, కోహ్లి కేవలం 17 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. గ్యారీ సోబర్స్(13 ఇన్నింగ్స్), అలిస్టర్ కుక్(14), బాబ్ సింప్సన్(16) కోహ్లి కంటే ముందున్నారు.
వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును అంతకుముందు కోహ్లి అధిగమించాడు. ఛేజింగ్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో అతడు ఈ రికార్డు సృష్టించాడు. సచిన్ 232 వన్డేల్లో సెకండ్ బ్యాటింగ్‌లో 17 సెంచరీలు చేస్తే.. 'ఛేజింగ్ హీరో' కేవలంలో 102 వన్డేల్లో 18 సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో మరో రికార్డు
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అజేయ శతకంతో కోహ్లి మరో ఘనత అందున్నాడు. టెస్టుల్లో తన బ్యాటింగ్ సగటును 50 దాటించాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని ఫార్మాట్లలో 50పైగా సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు.