
ఛాంపియన్స్ ట్రోఫీ-20525లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆ దేశ మాజీ క్రికెటర్ల బుద్ది మాత్రం మారలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం భారత్‌పై విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కించపరిచి మాట్లాడాడు. విరాట్ కోహ్లి కంటే పాక్ ఆటగాడు బాబర్ ఆజం ఎంతో బెటర్ అని అతడు విమర్శించాడు.
మీకు ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. బాబర్ ఆజంతో విరాట్ కోహ్లిని దయచేసి పోల్చవద్దు. బాబర్ ముంగిట విరాట్ కోహ్లి జీరో. మనం ఇక్కడ ఎవరు మంచి ఆటగాడు అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం. పాకిస్తాన్ క్రికెట్ పతనం గురించి మాట్లాడుతున్నాము. ప్రణాళిక లేదు, వ్యూహాలు లేవు, జవాబుదారీతనం లేదు. పాక్ క్రికెట్ నాశనం అవుతోంది అని మొహ్సిన్ ఖాన్ ARY న్యూస్‌తో పేర్కొన్నారు.
కాగా ఈ మెగా టోర్నీలో బాబర్ ఆజం విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లి మాత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చెలరేగాడు. దీంతో తమ జట్టుపై విరాట్ సెంచరీ చేయడాన్ని పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లిపై తమ అక్కసును వెల్లగక్కుతున్నారు.
అయితే మొహ్సిన్ ఖాన్‌కు భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. విరాట్ కోహ్లికి బాబర్‌కు పోలికా, కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా మెగా టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో గ్రూపు స్టేజిని టీమిండియా ఆజేయంగా ముగించింది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: 'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు
Comments
Please login to add a commentAdd a comment