England Vs India 1st Test Match Day 1 Score Updates
ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పై చేయి
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఇంగ్లండ్‌పై టీమిండియా పైచేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(76), శుబ్‌మన్ గిల్(14) పరుగులతో ఉన్నారు.
రోహిత్ శర్మ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 70 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..
80 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శుబ్‌మన్ గిల్ వచ్చాడు.
జైశ్వాల్ హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
9 ఓవర్లలో టీమిండియా స్కోరు: 63-0
భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 41, రోహిత్ శర్మ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్..
తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ జైశ్వాల్ ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. క్రీజులో జైశ్వాల్(18), రోహిత్ శర్మ(1) పరుగులతో ఉన్నారు. 3ఓవర్లకు భారత్ స్కోర్: 22/0
246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(70) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో స్పిన్నర్లు చెలరేగారు. రవీంద్ర జడేజా, అశ్విన్ తలా 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
61.3: అశ్విన్ బౌలింగ్లో మార్క్‌వుడ్ బౌల్డ్ అయ్యాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో జాక్ లీచ్ క్రీజులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో భాగంగా మార్క్‌వుడ్ రూపంలో అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ జమైంది. ఇక ఇప్పటికే జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నారు.
బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ
60.2: జడేజా బౌలింగ్‌లో సిక్స్ బాది ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మార్క్ వుడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 61 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 233-8
ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ డౌన్
193 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన హార్ట్‌లీ.. జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయాడు. క్రీజులోకి మార్క్ వుడ్ వచ్చాడు.
56 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 184/7
ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 56 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(22), టామ్ హార్ట్‌లీ(20) పరుగులతో ఉన్నారు.
ఏడో వికెట్ డౌన్
155 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కేఎస్ భరత్ క్యాచ్ పట్టడంతో రెహాన్ అహ్మద్ (13) ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ (13) క్రీజ్‌లో ఉన్నాడు.
ఆరో వికెట్ డౌన్.. ఫోక్స్ ఔట్
137 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన బెన్ ఫోక్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఐదో వికెట్ డౌన్.. జో రూట్ ఔట్
లంచ్ విరామం తర్వాత ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జో రూట్.. జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో బెన్ ఫోక్స్ వచ్చాడు. 37 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 128/5
నాలుగో వికెట్ డౌన్
121 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 37 పరుగులతో మంచి టచ్‌లో కన్పించిన బెయిర్ స్టోను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
►33 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 118/3, క్రీజులో జో రూట్(26), జానీ బెయిర్ స్టో(37) పరుగులతో ఉన్నారు.
లంచ్ విరామానికి ఇంగ్లండ్ స్కోర్: 108/3
మొదటి రోజు లంచ్ విరామానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(18), జానీ బెయిర్ స్టో(32) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా ఒక్క వికెట్ సాధించారు.
24 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 95/3
వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కష్టల్లో పడ్డ ఇంగ్లండ్‌ను బెయిర్ స్టో(21), జో రూట్(16) అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 24 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 95/3
సిరాజ్ సూపర్ క్యాచ్..
ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ(20) ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్‌తో క్రాలీని పెవిలియన్‌కు పంపాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
58 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు.
తొలి వికెట్ డౌన్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బెన్ డకెట్.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 58/1
5 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/0
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వికెట్ కీపర్‌గా శ్రీకర్ భరత్‌కు ఛాన్స్ లభించింది. ఇక ఇంగ్లండ్ జట్టు కూడా మూడు స్పిన్నర్లు, ఒక పేసర్‌తో ఆడుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్),యశస్వి జైస్వాల్,శుభమన్ గిల్,శ్రేయస్ అయ్యర్,కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజా,శ్రీకర్ భరత్,అక్షర్ పటేల్,రవిచంద్రన్ అశ్విన్,జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలీ,బెన్ డకెట్,ఒల్లీ పోప్,జో రూట్,జానీ బెయిర్‌స్టో,బెన్ స్టోక్స్ (కెప్టెన్),బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్),రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ,మార్క్ వుడ్,జాక్ లీచ్
Comments
Please login to add a commentAdd a comment