
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు తమ లాగే ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మొత్తం 14 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్ కాకుండా) ఆడుతుంది. ఇందులో ఏడు తమ సొంత మైదానంలో ఆడనుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్.. సీఎస్‌కే, సన్‌రైజర్స్, లక్నో, గుజరాత్, ఢిల్లీతో తలో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లు..
మార్చి 23 (ఆదివారం)- సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)
మార్చి 29 (శనివారం)- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)
మార్చి 31 (సోమవారం)- కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
ఏప్రిల్ 4 (శుక్రవారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (లక్నో)
ఏప్రిల్ 7 (సోమవారం)- ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
ఏప్రిల్ 13 (ఆదివారం)- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 17 (గురువారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
ఏప్రిల్ 20 (ఆదివారం)- సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
ఏప్రిల్ 23 (బుధవారం)- సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 27 (ఆదివారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
మే 1 (గురువారం)- రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (జైపూర్)
మే 6 (మంగళవారం)- గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
మే 11 (ఆదివారం)- పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
మే 15 (గురువారం)- ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment