స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్ల తేడాతో టీమిండియా వెన్ను విరిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ విజయంలో వైస్ కెప్టెన్ ఓలీ పోప్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పోప్(196) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలపై ఓ లూక్కేద్దం. భారత ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫలమ్యననేని చెప్పుకోవాలి.
పేలవ బ్యాటింగ్..
230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు చతికల పడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్బుతంగా రాణించిన టీమిండియా బ్యాటర్లు.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెతులేత్తేశారు. కనీసం ఇంగ్లండ్ బౌలర్లను టార్గెట్ చేసి ఒత్తడిలోకి నెట్టే ప్రయత్నం చేయలేదు. వచ్చిన వారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.
వరల్డ్ క్రికెట్‌లో స్పిన్‌కు అద్బుతంగా ఆడుతారని పెరు గాంచిన భారత బ్యాటర్లు.. ఆ స్పిన్ ముందే తలవంచారు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఖాతా కూడా తెరవలేదు. కచ్చితంగా రెండో టెస్టులో మాత్రం భారత తమ తప్పులను సరిదిద్దుకోవాల్సిందే.
కొంపముంచిన ఫీల్డింగ్..
ఇక మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్‌లో కూడా తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓలీ పోప్‌కు రెండు సార్లు భారత ఫీల్డర్లు అవకాశమిచ్చేసారు. తొలుత 116 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టగా.. 180 పరుగుల వద్ద రాహుల్ సైతం సునయాస క్యాచ్‌ను జారవిడిచాడు.
అక్షర్ పటేల్ విడిచిపెట్టిన క్యాచ్‌కు భారీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. ఈ మ్యాచ్‌లో పోప్ ఏకంగా 196 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. ఒకవేళ అక్షర్ ఆ క్యాచ్‌ను అందుకుని ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment