రోహిత్ శర్మతో బుమ్రా (PC: BCCI)
IND vs ENG, 5th Test, Day 3- Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసి సిరీస్‌ను 4-1తో గెలిచింది.
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్, పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు.
ఇందుకు గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో మైదానంలో దిగలేదని తెలిపింది. కాగా నొప్పి తీవ్రతరమైతే హిట్‌మ్యాన్ కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా ధర్మశాల టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతడు 103 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. యువ జట్టుతో రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 4-1తో గెలవడం విశేషం.
ఇక ఐదో టెస్టులో టీమిండియా గెలిచిన అనంతరం సెలబ్రేషన్స్ సమయంలో రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. జట్టును అభినందిస్తూ సంతోషం పంచుకున్నాడు.
UPDATE: Captain Rohit Sharma has not taken the field on Day 3 due to a stiff back.#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) March 9, 2024
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
— BCCI (@BCCI) March 9, 2024
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
Comments
Please login to add a commentAdd a comment