dharmashala
-
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్‌గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్‌కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
బీసీసీఐ సంచలనం.. ఒక్కో మ్యాచ్‌కు ఏకంగా రూ. 45 లక్షలు
టెస్టు క్రికెట్ ప్రాధాన్యం పెంచేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాడు. పురుషుల సీనియర్ జట్టులో భాగమైన క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు. ఆటగాళ్లను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు.. వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా పేర్కొన్నాడు. 2022-23 సీజన్ నుంచి టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును అమలు చేస్తామని.. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు ఇదొక అదనపు రివార్డు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ. 45 లక్షలు ఒక సీజన్లో టీమిండియా షెడ్యూల్లో తొమ్మిది టెస్టులు ఉన్నాయనకుంటే.. ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్ ఉండవు. అయితే, 5-6 మ్యాచ్‌లలో భాగమై తుదిజట్టులో ఆడితే 30 లక్షల చొప్పున.. బెంచ్‌కే పరిమితం అయితే 15 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారు. అదే విధంగా.. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లలో భాగమై తుదిజట్టులో ఆడితే రూ. 45 లక్షలు, బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. టీమిండియా విజయం తర్వాత ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం తర్వాత జై షా ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. బజ్‌బాల్ అంటూ ఇంగ్లండ్ అలా.. బీసీసీఐ ఇలా బజ్‌బాల్ అంటూ సంప్రదాయ క్రికెట్ రూపురేఖల్నే మార్చేలా ఇంగ్లండ్ దూకుడైన ఆట తీరుతో ముందుకు సాగుతుంటే.. బీసీసీఐ మాత్రం ఈ ఫార్మాట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు కచ్చితంగా రంజీలో ఆడాలంటూ నిబంధన విధించిన బోర్డు.. ఆదేశాలను ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టెస్టు క్రికెట్‌కు తాము పెద్దపీట వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మేరకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: IND Vs ENG 5th Test: అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే I am pleased to announce the initiation of the 'Test Cricket Incentive Scheme' for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the 'Test Cricket Incentive Scheme' will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk — Jay Shah (@JayShah) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్‌గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే
IND vs ENG, 5th Test, Day 3- Rohit Sharma: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసి సిరీస్‌ను 4-1తో గెలిచింది. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగలేదు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించాడు. ఇందుకు గల కారణాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి వెల్లడించింది. రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా శనివారం నాటి మూడో రోజు ఆటలో మైదానంలో దిగలేదని తెలిపింది. కాగా నొప్పి తీవ్రతరమైతే హిట్‌మ్యాన్ కొన్ని రోజులపాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధర్మశాల టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అతడు 103 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండానే.. యువ జట్టుతో రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 4-1తో గెలవడం విశేషం. ఇక ఐదో టెస్టులో టీమిండియా గెలిచిన అనంతరం సెలబ్రేషన్స్ సమయంలో రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. జట్టును అభినందిస్తూ సంతోషం పంచుకున్నాడు. UPDATE: Captain Rohit Sharma has not taken the field on Day 3 due to a stiff back.#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
#Ash: వారెవ్వా.. 4.2 ఓవర్లలోనే మూడు వికెట్లు..
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్. ఓవరాల్‌గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్‌లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసి ఐదో వికెట్‌ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్‌నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్‌లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్‌లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్‌లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్‌కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్‌బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్‌క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్‌కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్‌దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, దేవ్‌దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
ధనాధన్ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. Wood's got pace? Sarfaraz has the answer 😎#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSport pic.twitter.com/htRkcp57X1 — JioCinema (@JioCinema) March 8, 2024 చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్ తండ్రి -
అలా చేయడం ముమ్మాటికి తప్పే: గిల్‌పై తండ్రి విమర్శలు
India vs England, 5th Test Day 2: టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి అతడి తండ్రి, చిన్ననాటి కోచ్ లఖ్విందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా కాకుండా.. వన్‌డౌన్‌లో ఆడాలనుకున్న గిల్ నిర్ణయం తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. కాగా అండర్ 19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టిన పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ జోడీగా జట్టులో పాతుకుపోయాడు. అయితే, ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ మూడోస్థానానికి డిమోట్ అయ్యాడు. ఛతేశ్వర్ పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. కొత్త పాత్రలో ఒదిగేక్రమంలో ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వరుసగా 10 ఇన్నింగ్స్పాటు ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు గిల్. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసేందుకు అలవాటు పడ్డాడు. తాజాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో శతకంతో సత్తా చాటిన గిల్.. ధర్మశాలలోనూ సెంచరీ(110)తో చెలరేగాడు. స్టోక్స్ బృందంతో జరుగుతున్న నామమాత్రపు ఐదో టెస్టులో రోహిత్‌తో కలిసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు గిల్ తండ్రి లఖ్విందర్ ధర్మశాలకు విచ్చేశాడు. ఈ సందర్భంగా పుత్రోత్సాహంతో పొంగిపోతూనే.. అతడి ఆట తీరుపై విమర్శలు చేశాడు. ‘‘తను ఓపెనర్‌గానే కొనసాగాల్సింది. వన్‌డౌన్‌లో ఆడటం సరైన నిర్ణయం కానేకాదు. డ్రెసింగ్‌రూంలో ఎంత ఎక్కువసేపు కూర్చుంటే.. అంతగా ఒత్తిడి పెరుగుతుంది. నంబర్ 3 అనేది ఓపెనింగ్ స్థానమూ కాదు.. అలాగని మిడిలార్డరూ కాదు. కాబట్టి సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఏదేమైనా తనదైన సహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా అనుకున్న ఫలితాలను రాబట్టగలడు. అయినా.. తన నిర్ణయాలలో నేను జోక్యం చేసుకోను. కేవలం తనకు శిక్షణ ఇవ్వడం వరకు నా బాధ్యత. తనిప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోగల పెద్దవాడై పోయాడు. తను టీనేజర్‌గా ఉన్నపుడు మాత్రమే తన తరఫున నేను నిర్ణయాలు తీసుకునేవాడిని’’ అని లఖ్విందర్ సింగ్ తెలిపాడు. Apni ballebaazi se jeete har dil, kamaal khele Shubman Gill 💯🫶#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/VBpIakUekG — JioCinema (@JioCinema) March 8, 2024 -
అదెట్లా అవుట్.. కానేకాదన్న రోహిత్! అంపైర్‌దే తప్పు!
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు.. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను ఇంగ్లిష్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని.. షార్ట్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సరిగ్గానే అంచనా వేసి దానిని మిస్ చేశాడు. అయితే, బాల్ రోహిత్ కుడికాలి ప్యాడ్‌ను రాసుకుంటూ వెళ్లి కీపర్‌కు చిక్కింది. కానీ.. ఇంగ్లండ్ మాత్రం క్యాచ్ అవుట్‌కు అప్పీలు చేసింది. అయితే, అనూహ్యంగా అంపైర్ జోయెల్ విల్సన్ రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న హిట్‌మ్యాన్ వెంటనే రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. బంతి బ్యాట్‌ను తాకలేదని రీప్లేలో స్పష్టంగా తేలడంతో థర్డ్ అంపైర్ రోహిత్ శర్మను నాటౌట్‌గా ప్రకటించాడు. Rohit reminding of Ben stokes to ICC elite umpire Joel Wilson, #INDvENG pic.twitter.com/COcitjOyW8 — That_Lazy_Guy 😴 (@Slow_low_) March 7, 2024 ధర్మశాల వేదికగా గురువారం నాటి తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఫీల్డ్ అంపైర్ తనను అవుట్‌గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నట్లుగా రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఇందులో రోహిత్ ప్రదర్శించిన హావభావాలకు నెటిజన్లు తమదైన శైలిలో భాష్యాలు చెబుతున్నారు. ‘‘అదెట్లా అవుట్ అంపైర్ జీ.. కానేకాదు! ముందే చెప్పానుగా!.. అన్నట్లు హిట్‌మ్యాన్ నవ్వుతూనే.. సెటైరికల్‌గా ఓ చూపు చూశాడు. నిజంగా రోహిత్ సూపర్ కదా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ శతకం(103) పూర్తి చేసుకున్నాడు. అతడికి టెస్టుల్లో ఇది 12వది కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా 48వది. చదవండి: స్టోక్స్ ‘మ్యాజిక్’ బాల్.. రోహిత్ క్లీన్‌బౌల్డ్!.. ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్ The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️ Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm — JioCinema (@JioCinema) March 8, 2024 -
శుబ్‌మన్ గిల్ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 101 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా అయితే శుబ్‌మన్ 11వ అంతర్జాతీయ సెంచరీ. ఈ సిరీస్‌లో మాత్రం గిల్‌కు ఇది రెండో సెంచరీ. కాగా జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 160 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్‌మ్యాన్ కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 102 పరుగులతో గిల్ క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది. చదవండి: #RohitSharma: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్.. 48వ సెంచరీ Apni ballebaazi se jeete har dil, kamaal khele Shubman Gill 💯🫶#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/VBpIakUekG — JioCinema (@JioCinema) March 8, 2024 -
IND VS ENG 5th Test: జానీ బెయిర్‌స్టోకు వింత అనుభవం
ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోకు వింత అనుభవం ఎదురైంది. ఇవాళ (మార్చి 7) ధర్మశాల వేదికగా భారత్‌తో తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెయిర్‌స్టో.. యాదృచ్చికంగా ఇదే వేదికపై తన వందో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడాడు. ఇలా తన కెరీర్లో వందో వన్డే, వందో టెస్ట్ మ్యాచ్ ఒకే వేదికపై ఆడటంతో బెయిర్‌స్టోకు ధర్మశాల మైదానం చిరస్మరణీయంగా మారింది. కెరీర్లో అరుదైన వంద మ్యాచ్‌ల మైలురాయిని రెండు ఫార్మాట్లలో ఒకే వేదికపై అందుకోవడంతో ఈ మైదానం బెయిర్‌స్టోకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ వేదికపై జరిగిన తన వందో వన్డేలో హాఫ్ సెంచరీ (వన్డే వరల్డ్‌కప్ 2023లో బంగ్లాదేశ్‌పై 52 పరుగులు) సాధించిన బెయిర్‌స్టో.. తన వందో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 29 పరుగులకే పరిమితమయ్యాడు. Dharamsala has been a memorable ground for Jonny Bairstow🏟️❤️ pic.twitter.com/1grLKRQy3o — CricTracker (@Cricketracker) March 7, 2024 ఈ ఇన్నింగ్స్‌లో 18 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి మాంచి దూకుడుగా కనిపించాడు. అయితే కుల్దీప్ అతని జోరుకు కళ్లెం వేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో దృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో మరో ఇన్నింగ్స్ మిగిలుంది కాబట్టి, ఆ ఇన్నింగ్స్‌లోనైనా సెంచరీనో, హాఫ్ సెంచరీలో చేసి ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకోవాలని బెయిర్‌స్టో భావిస్తుంటాడు. ఇదిలా ఉంటే, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ‘బజ్‌బాల్’ను కట్టడి చేసి.. బ్యాటింగ్‌లో అదరగొట్టి!
India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్ మాయాజాలంతో చుక్కలు చూపించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు. కుల్దీప్, అశ్విన్ స్పిన్ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic) ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్(1/17) దక్కింది. 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙇𝙞𝙠𝙚 𝙏𝙝𝙚𝙨𝙚! R Ashwin 🤝 Kuldeep Yadav Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/hJyrCS6Hqh — BCCI (@BCCI) March 7, 2024 అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma) ఇక తొలి రోజే ఇంగ్లండ్ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్‌గా వెనుదిరగగా.. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్ శర్మ 52, శుబ్‌మన్ గిల్ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
Ind vs Eng: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్‌తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్‌లో తొమ్మిదవ ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ మూడు సిక్స్‌లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్‌గా జైస్వాల్ అవతరించాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టి గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్‌పై 26వ సిక్సర్‌ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్‌కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్ అవసరం కాగా.. జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్‌లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా ధర్మశాల మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు 26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ మీద(9 ఇన్నింగ్స్) 25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్) 22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్) 21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ మీద(39 ఇన్నింగ్స్) 21- రిషభ్ పంత్ ఇంగ్లండ్ మీద (21 ఇన్నింగ్స్). Yashasvi goes BIG & how! 🔥 Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K — BCCI (@BCCI) March 7, 2024 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్.. భారత తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టు ఆరంభమైంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కుల్దీప్ అదరగొడుతున్నాడు. బెన్ డకెట్(27), జాక్ క్రాలే(79), ఒలీ పోప్(11) రూపంలో టాపార్డర్ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్.. మిడిలార్డర్ బ్యాటర్లు జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0)లను కూడా అవుట్ చేశాడు. కాగా స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్‌లను ఈ చైనామన్ బౌలర్ అధిగమించాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు. తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్లు 1871 - కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) 2205 - అక్షర్ పటేల్(Axar Patel) 2520 - జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వివిలవిల్లాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. అశ్విన్ రెండు, జడ్డూ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ క్రాలే మినహా మిగితా బ్యాటర్లు నిరాశపరిచారు. హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్.. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి మార్క్ వుడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమలో స్లిప్‌లో ఉన్న రోహిత్ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/RkDk3S3gqY — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 7, 2024 -
పెట్రోల్ ట్యాంకు మీద కిట్ పెట్టి.. ఆ తర్వాత నన్నూ కూర్చోబెట్టి!
R Ashwin's Emotional Tribute On 100th Test: ‘‘క్రికెట్ టోర్నీల్లో ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ వేరు. అందుకే చాలా మంది టీ20 క్రికెట్ ఆడి ఐపీఎల్‌లోకి రావాలని భావిస్తారు. వాళ్ల కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే, ఒక్క విషయం మాత్రం ఆశావహ క్రికెటర్లందరూ గుర్తుపెట్టుకోవాలి. టెస్టు ఫార్మాట్ అనేది జీవితం నేర్పలేని పాఠాలెన్నింటినో నేర్పిస్తుంది. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే.. జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే మంత్రం. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి.. ప్రతికూలతలను ఎలా అధిగమించాలన్న విషయాలను బోధిస్తుంది. నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగుతున్నాయి. నాతో పాటు చెన్నైలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కూడా ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాడు. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. దురదృష్టవశాత్తూ ఆయన ఇక్కడ లేరు. చిన్నతనంలో.. నా క్రికెట్ కిట్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టి.. ఆ తర్వాత నన్ను కూడా ముందు కూర్చోబెట్టుకుని.. కోచింగ్ క్యాంపునకు తీసుకువెళ్లేవాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన.. తన కుమారుడు జీవితంలో.. కెరీర్లో ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్నారు. మా అమ్మ, మా తాతయ్య సహకారంతోనే ఆయన నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది ఇక నా భార్య.. నన్ను పెళ్లి చేసుకునే సమయంలో నా ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుందో ఆమెకు తెలియదు. అయినా.. ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉంది. నాకు ఇద్దరు ముద్దులొలికే పిల్లలు ఉన్నారు. వాళ్లు కూడా గత కొన్నేళ్లుగా నా క్రికెట్ జర్నీని అర్థం చేసుకుంటూ ఆస్వాదించగలుగుతున్నారు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత్ తరఫున 100వ టెస్టు బరిలో దిగిన తరుణంలో.. తాను క్రికెటర్‌గా ఎదగడంలో తన తండ్రి రవిచంద్రన్ పాత్ర.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడంలో తన భార్య ప్రీతి అండదండగా నిలిచిన తీరును గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన టెస్టు గురువారం మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇక ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా చెన్నై ఆల్‌రౌండర్ అశూ చరిత్రకెక్కాడు. చదవండి: టీమిండియా స్టార్ సంచలన నిర్ణయం?! Number 9⃣9⃣ gets ready for his 💯th Test Match! 👏👏 📽️ WATCH 🔽 - Life, Cricket & Beyond ft. @ashwinravi99#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank — BCCI (@BCCI) March 7, 2024 -
టీమిండియాతో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ధర్మశాల వేదికగా టీమిండియాతో రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇవాళ ప్రకటించారు. ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్ట్‌లో ఆడిన ఓలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ అదనపు పేసర్‌ను బరిలోకి దించుతుందని అంతా ఊహించారు. అయితే ఇంగ్లండ్ మేనేజ్మెంట్ పేసర్ స్థానంలో మరో పేసర్కే అవకాశం ఇచ్చింది. మొత్తంగా ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మార్క్ వుడ్‌తో పాటు వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తుది జట్టుకు ఎంపికయ్యారు. రాబిన్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వుడ్.. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్, రాజ్‌కోట్ మ్యాచ్‌ల్లో ఆడిన వుడ్ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చకపోవడంతో నాలుగో టెస్ట్‌కు ఎంపిక కాలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వుడ్ 55.5 సగటున కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. రాబిన్సన్ విషమానికొస్తే.. ఈ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను పేలవ ప్రదర్శన కనబర్చి తుది జట్టులో (ఐదో టెస్ట్) స్థానం కోల్పోయాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఆడిన రాబిన్సన్ కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రాబిన్సన్కు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
సాకులు చెప్పలేదు.. ఉదయం 5.30 గంటలకే రోహిత్ ఇలా!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్య క్రీడా భారత్ రూపుదిద్దుకునే కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొనడం రోహిత్ హుందాతనానికి నిదర్శనమని ప్రశంసించారు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగింట మూడు విజయాలతో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది. అయితే, నాలుగు- ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ సతీసమేతంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు. గుజరాత్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)కు పయనం కావాల్సింది. అయితే, అంతకంటే ముందు భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్పూర్ నియోజకవర్గంలోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ఖేల్ మహాకుంభ్ 3.0 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఖేల్ మహాకుంభ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉదయం ఐదున్నర గంటలకే రోహిత్ శర్మ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ రోహిత్ అనుకుంటే.. మార్చి 7న ఆరంభం కానున్న ఐదో టెస్టును సాకుగా చూపి ఇక్కడికి రాకుండా మా ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండవచ్చు. కానీ అతడికి భవిష్య క్రీడా భారత్ ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటోందని తెలుసు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఈవెంట్ ఆరంభించిన అనంతరం రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో బిలాస్‌పూర్‌కు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు. చదవండి: 100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు Swung for the fences and had a blast with Hitman @ImRo45 and The Wall Rahul Dravid at the grand opening of #SansadKhelMahakumbh 3.0 at Luhnu Cricket Stadium, Bilaspur. Truly a game to remember! pic.twitter.com/ENRaSOr6Y8 — Anurag Thakur (मोदी का परिवार) (@ianuragthakur) March 5, 2024 -
100th Test: కెప్టెన్ అయితే బాగుండేది!.. అశ్విన్ భావోద్వేగం
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ధర్మశాలలో ‘సెంచరీ’ పూర్తి చేసుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్టు సందర్భంగా అశూ ఈ ఫీట్ అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో మాట్లాడుతూ అశ్విన్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కెప్టెన్ అయితే బాగుండేది.. అశ్విన్ భావోద్వేగం ‘‘నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు. ఎన్నో సవాళ్లు. ప్రతికూల సమయంలో.. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది?’ అని బాధపడేవాడిని. అయితే, క్లిష్ట పరిస్థితులు, ఒత్తిళ్లను దాటినందు వల్లే ఈరోజు నాకంటూ ఈ గుర్తింపు వచ్చిందని, ఈ స్థాయికి చేరుకోగలిగానని అనిపిస్తోంది. చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ‘నీకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది’ అని అంటూ ఉంటారు. కానీ.. అది ఎప్పటికీ జరుగదనే విషయం నాకు తెలుసు. అందుకే మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటాను’’ అని అశూ భావోద్వేగానికి లోనయ్యాడు. వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇదిలా ఉంటే.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అశ్విన్‌ను కాదని.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఈ అంశం గురించి ప్రస్తావనకు రాగా అశ్విన్ హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘బ్యాటర్లతో పోలిస్తే బౌలర్లను ద్వితీయ శ్రేణి కిందే పరిగణిస్తారు. నేను ఒక్క మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే పక్కనపెట్టేస్తారు. అదే వేరే వాళ్లకు విఫలం కావడానికి మరిన్ని ఛాన్సులు ఇస్తారు. నాకు ఆ స్వార్థం లేదు అయినా, నేను మనశ్శాంతిగానే ఉండగలుగుతాను. ఎందుకంటే.. కొన్ని కఠిన వాస్తవాలను అంగీకరించకతప్పదని నాకు తెలుసు. ఐదు రోజుల ఆట ముగిసిన తర్వాత జట్టు గెలిచిందా లేదా అన్న విషయానికి ప్రాధాన్యం ఇస్తాను. టీమిండియా గెలిస్తే నాకంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అంతేగానీ స్వప్రయోజనాల కోసం జట్టు ప్రయోజనాలను తాకట్టుపెట్టాలనే స్వార్థం నాకు లేదు’’ అని అశ్విన్ ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఈ మేరకు జియో సినిమా షోలో అశూ వ్యాఖ్యలు చేశాడు. 500 వికెట్ల క్లబ్లో చేరిన ఘనుడు కాగా ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ మూడో టెస్టు సందర్భంగా అశ్విన్ 500 వికెట్ల క్లబ్(టెస్టు)లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో అశూతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో కూడా తన వందో టెస్టు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి.. అశ్విన్ సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా వందో టెస్టు సెలబ్రేట్ చేస్తారని అభిమానులు భావించారు. అయితే, రోహిత్ ఇప్పటికే జట్టుతో చేరడంతో అశూకు ఆ ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
ప్రత్యేక హెలికాప్టర్‌తో ధర్మశాలలో ల్యాండ్ అయిన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన రోహిత్.. తిరిగి టీమిండియాతో జత కట్టాడు. Jamnagar ✈️Dharamsala Captain Rohit Sharma's normal duties resume.pic.twitter.com/4CKlGqjW5H — CricTracker (@Cricketracker) March 5, 2024 ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు వేదిక అయిన ధర్మశాలలో హిట్‌మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్‌కు హెలికాప్టర్‌ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్‌మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్‌లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
Anant- Radhika: తిరుగు పయనం.. భయ్యాకు కోపం వస్తే అంతే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో చేరనున్నాడు. నాలుగు- ఐదో టెస్టు మధ్య లభించిన విరామానికి స్వస్తి పలికి.. ఆటపై దృష్టి సారించనున్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సత్తా చాటింది. తదుపరి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టుకు భారత జట్టు సిద్ధం కానుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న రాంచి మ్యాచ్ ముగియగా.. మార్చి 7న ధర్మశాల మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మధ్యలో దొరికిన విరామ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా తమ చిన్న కుమారుడి కోసం నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో భార్య రితికాతో కలిసి పాల్గొన్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అత్యంత వైభవోపేతంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్‌మ్యాన్‌ను చుట్టుముట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అయితే, అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అతడి స్థానంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?! ‘రోహిత్ సహచర ఆటగాళ్లను అందుకే తిడతాడు’ -
ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్.. టీమిండియాకు శుభవార్త
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా అభిమానులకు శుభవార్త తెలిసింది. మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే ఆఖరి మ్యాచ్‌కు పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని సమాచారం. వర్క్ లోడ్ కారణంగా నాలుగో టెస్ట్‌లో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐదో టెస్ట్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు ఓ మింగుడుపడని వార్త కూడా వినిపిస్తుంది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆఖరి మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం రాహుల్‌ను అతి త్వరలో లండన్‌కు పంపించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు ఆడిన రాహుల్.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా తొడ కండరాల సమస్య తలెత్తడంతో తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజా సమాచారం నిజమైతే రాహుల్ ఆఖరి టెస్ట్‌లో ఆడటం అనుమానమే. కాగా, స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియాను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత కారణాల చేత విరాట్ కోహ్లి, గాయం కారణంగా మొహమ్మద్ షమీ దూరం కాగా.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజా, బుమ్రా గాయాలు, ఇతరత్రా కారణాల చేత మధ్యలో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. సీనియర్ల గైర్హాజరీ, గాయాల సమస్య వేధిస్తున్నప్పటికీ.. యంగ్ ఇండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. -
దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్లో కివీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 28న ధర్మశాల వేదికగానే ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు దాదాపు 6 రోజుల బ్రేక్ రావడంతో ధర్మశాలలోని సుందరమైన ప్రదేశాలను కివీస్ జట్టు ఆటగాళ్లు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో బౌధ్దమత గురువు దలైలామాను ఆయన నివాసంలో కివీస్ ఆటగాళ్లు కలిశారు. క్రికెటర్లతో పాటు వారి కుటంబ సభ్యులు కూడా ఉన్నారు. దలైలామాతో కలసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, శాంట్నర్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. -
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. హార్దిక్ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. పాయింట్ల పట్టికలో ఆగ్రస్ధానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ధర్మశాల వేదికగా ఆక్టోబర్ 20న భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా కాలిమడమకు గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను విడిచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం స్కానింగ్ తరలించగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హార్దిక్ కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. జట్టులోకి సూర్యకుమార్ యాదవ్.. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ స్ధానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రానున్నట్లు తెలుస్తోంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందన సూర్యను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని టీమిండియా మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గత కొంతకాలంగా వన్డేల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సూర్య.. ఈ మెగా టోర్నీకి ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తన రిథమ్‌ను తిరిగి పొందాడు. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్ స్ధానంలో పేసర్ మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా. -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
లివింగ్‌స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
లివింగ్‌స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్(48 బంతుల్లో 94, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. అథర్వ టైడే 55, ప్రబ్‌సిమ్రన్ సింగ్ 22 పరుగులు చేశారు. ఆఖర్లో లివింగ్‌స్టోన్ చెలరేగి ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగ ఉండడంతో ఏం చేయలేకపోయాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. టార్గెట్ 214.. పంజాబ్ కింగ్స్ 12 ఓవర్లలో 100/2 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అథర్వ టైడే 48, లివింగ్‌స్టోన్ 27 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ గోల్డెన్ డక్.. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 47/1 పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అథర్వ టైడే 23, ప్రబ్‌సిమ్రన్ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు. రొసౌ విధ్వంసం.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు, పంజాబ్ టార్గెట్ 214 ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. రిలీ రొసౌ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ 162/2 ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిలీ రొసౌ ఐపీఎల్లో తొలి అర్థశతకం సాధించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరంభం నుంచి దాటిగా ఆడిన రొసౌ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దంచుతున్న పృథ్వీ షా, రొసౌ.. 14 ఓవర్లలో ఢిల్లీ 138/1 పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. పృథ్వీ షా 54, రిలీ రొసౌ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ సామ్ కరన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. పృథ్వీ షా 46, రొసౌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 93/0 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 46, పృథ్వీ షా 45 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 61/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పృథ్వీ షా 35, డేవిడ్ వార్నర్ 34 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవరల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 35/0 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 25, పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా 64వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ Back in Dharamshala after 1️⃣0️⃣ years, #PBKS win the 🪙 & elect to field first! Will the hosts be able to keep their #IPL2023 hopes alive? 👀#IPLonJioCinema #TATAIPL #PBKSvDC #EveryGameMatters | @PunjabKingsIPL @DelhiCapitals pic.twitter.com/Ut2NBzlWsj — JioCinema (@JioCinema) May 17, 2023 ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదలగ్గా.. పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ కీలకం. అయితే మ్యాచ్‌లో గెలిచినప్పటికి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
BGT 2023: ఆసీస్‌తో భారత్ మూడో టెస్టు.. వేదిక మారింది: బీసీసీఐ ప్రకటన
India Vs Australia 3rd Test: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1 నుంచి ఆరంభం కానున్న ఈ మ్యాచ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదిక కానుంది. హోల్కర్ స్టేడియంలో రోహిత్ సేన- ప్యాట్ కమిన్స్ బృందంతో తలపడనుంది. అందుకే మార్చారు ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ధర్మశాల మైదానంలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్‌పై పచ్చికను కొత్తగా పరిచారు. వాళ్లకు బ్యాడ్ న్యూస్ పిచ్ పరీక్షించడం సహా మరికొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇక్కడ టెస్టు మ్యాచ్ నిర్వహణ సమంజసం కాదని భావించిన బోర్డు.. వేదికను మారాల్చని నిర్ణయించుకుంది. ధర్మశాలకు ప్రత్యామ్నాయంగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను పరిశీలించిన బీసీసీఐ.. ఆఖరికి ఇండోర్ వైపే మొగ్గు చూపింది. హిమాచల్ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, పిచ్ పూర్తిస్థాయిలో రూపొందని నేపథ్యంలో వేదికను మార్చినట్లు తెలిపింది. దీంతో ప్రతిష్టాత్మక మ్యాచ్ ప్రతక్ష్యంగా చూడాలని భావించిన వైజాగ్, బెంగళూరు, గుజరాత్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరువగా ఇదిలా ఉంటే.. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరింత చేరువైంది. మిగిలిన టెస్టులు ఎక్కడంటే మొదటి టెస్టు విజయంలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు. ఇక ఇరు జట్ల మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. మూడో టెస్టు ఇండోర్, నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ ILT20 2023 Winner: ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తొలి చాంపియన్‌గా అదానీ గ్రూప్ జట్టు Ind Vs Pak: ప్రపంచకప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్‌తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్‌కు బ్యాకప్‌గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్‌ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రష్యా వరుడు, ఉక్రెయిన్ వధువు.. ధర్మశాలలో ఒక్కటైన ప్రేమజంట
యుద్ధమంటే మనిషికీ, మనిషికీ మధ్య విభజన రేఖ. ప్రేమతో ఆ విభజన రేఖను చెరిపేశారు రష్యా యువకుడు, ఉక్రెయిన్ యువతి. ఆరు నెలలుగా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఆ ద్వేషాన్ని ప్రేమతో జయించొచ్చని నిరూపించారు రష్యాకు చెందిన సెర్జెయ్ నొవికోవ్ ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన ఎలోనా బమ్రోకా. వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది కాలంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరంకోట్లో నివాసం ఉంటున్నారు. అయితే ధర్మశాలలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు సొంత ఇంటిదగ్గరే ఉన్నామన్న భావన కలిగించేలా స్థానికులే సంప్రదాయ క్రతువులన్నీ పూర్తి చేశారు. జానపద నృత్యాలతో పండుగను తలపించారు. ధర్మశాల సమీపంలోని దివ్య ఆశ్రమ్ ఖరోటాలో పండితుడు సందీప్ శర్మ వేద మంత్రాలు చదువుతుండగా ఇద్దరూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారి పొరుగునే ఉంటున్న వినోద్ శర్మ... కన్యాదానం చేశారు. పెళ్లికి వధూవరుల మిత్రులు కూడా హాజరై విదేశీ పెళ్లిని పక్కా దేశీ స్టైల్లో ఘనంగా జరిపించారు. చదవండి: 42 అడుగుల గోళ్లు.. గిన్నిస్ రికార్డు బద్దలు -
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
Kiara Advani Shares Her Near Death Experience In Dharamshala: 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. దెయ్యాలంటే భయమా అని అడిగిన ప్రశ్నకు.. 'నాకు దెయ్యాలంటే భయం లేదు. కానీ దెయ్యం సినిమాలు చూడను. రాత్రిపూట ఒక్కదాన్నే నిద్రపోతుంటే భయపడతాను. అందుకే ఆ జోనర్ సినిమాల జోలికి వెళ్లను.' అని తెలిపింది కియరా. అంతేకాకుండా తన కాలేజ్ రోజుల్లో జరిగిన మరో విషయం గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ''కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మశాల టూర్ వెళ్లాను. మంచు ఎక్కువగా కురవడంతో నాలుగురోజులపాటు మేం హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు కరెంట్ లేదు. తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకలేదు. వేడికోసం ఏర్పాటు చేసుకున్న మంట కూడా ఆరిపోతుందనుకున్నాం. నాలుగోరోజు రాత్రి గదిలో అందరం నిద్రపోతున్నప్పుడు మా పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. అది చూసిన నా ఫ్రెండ్ మా అందర్నీ నిద్రలేపింది. మేమంతా కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టారు. ఆరోజు చావుని దగ్గర నుంచి చూసినట్లనిపించింది. అదృష్టం కొద్దీ అక్కడి నుంచి బయటపడ్డాం.' అని కియరా పేర్కొంది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
Ind Vs Sl: నీకు కూడా కావాలా.. రా తీస్కో.. నువ్వు మరీనూ రోహిత్.. వైరల్
Ind Vs Sl T20 Series: రోహిత్ శర్మ.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ముఖ్యంగా స్వదేశంలో పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు హిట్‌మ్యాన్. ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆటగాళ్లను రొటేట్ చేస్తూనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో మైదానంలో ఆటగాళ్లు చిన్న చిన్న తప్పిదాలు చేసినా సహించే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. అక్కడిక్కడే వార్నింగ్‌లు ఇస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు. ఆట విషయం పక్కనపెడితే సహచర క్రికెటర్లతో రోహిత్ ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయి.. వారిసి ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా తనలోని హాస్యచతురతను మరోసారి బయపెట్టాడు హిట్‌మ్యాన్. మ్యాచ్‌కు వేదికైన ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం చల్లగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ కాఫీని ఆస్వాదిస్తుండగా.. కెమెరాలు అతడి మీద ఫోకస్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్ శర్మ తాను బిగ్‌స్క్రీన్ మీద కనబడుతున్నానని తెలుసుకుని.. కెమెరామెన్‌కు కాఫీ ఆఫర్ చేశాడు. ఆ తర్వాత నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోక్లిప్ను బీసీసీఐ షేర్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం ధర్మశాలలో జరుగననున్న మూడో టీ20లోనూ విజయం సాధించి లంకను క్లీన్‌స్వీప్ చేసేందుకు రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. చదవండి: Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్ శర్మ MS Dhoni IPL Promo: గుర్తుపట్టలేనంతగా మారిన ఎంఎస్ ధోని.. ఏం జరిగింది T20 WC 2022- Virat Kohli: ప్రపంచకప్ ప్రోమో వీడియో! బిగ్గెస్ట్ ప్లేయర్‌గా కోహ్లి.. టీమిండియా కెప్టెన్ రోహిత్ బాబూ! Just what you need in the cold Dharamsala weather ☕️@ImRo45 pic.twitter.com/xUgz8W9ERR — BCCI (@BCCI) February 26, 2022 -
Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్ శర్మ
Ind Vs Sl 3rd T20: స్వదేశంలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా శ్రీలంకతో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 27న జరుగబోయే ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన జోష్‌లో 3-0 తేడాతో లంకను వైట్‌వాష్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లలో భాగంగా పలు ప్రయోగాలు చేసిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి సిరీస్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం. మున్ముందు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది(నవ్వులు). మేము సిరీస్ గెలిచాం. కానీ కొంతమందికి ఆడే అవకాశం రాలేదు. మరికొంత మంది టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే... అంతిమంగా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. అదే సమయంలో ఆటగాళ్లలో సానుకూల దృక్ఫథం నింపడం ముఖ్యం’’ అని పేర్కొన్నాడు. కాగా ధర్మశాల వేదికగా టీమిండియా- శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయి. చదవండి: MS Dhoni IPL Promo: గుర్తుపట్టలేనంతగా మారిన ఎంఎస్ ధోని.. ఏం జరిగింది 11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls — BCCI (@BCCI) February 26, 2022 -
Ind Vs Sl 2nd T20: 16 మ్యాచ్‌లు ఆడితే.. పాపం 12 మ్యాచ్‌లలో ఓటమే!
India Vs Sri Lanka T20 Series: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో గెలుపుపై కన్నేసింది. శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక వరుస విజయాల ప్రపంచ రికార్డును నెలకొల్పాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. మొదటి మ్యాచ్‌లో ఓటమితో డీలా పడిన శ్రీలంక ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప గెలిచే సూచనలు కనిపించడం లేదు. వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, కుశాల్ మెండిస్ వంటి ఆటగాళ్లు దూరం కావడంతో ఆతిథ్య జట్టుతో పోలిస్తే మరింత బలహీనంగా అనిపిస్తోంది. శనివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ నేపథ్యంలో.. ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, ముఖాముఖి రికార్డు తదితర వివరాలు.. ఎక్కడ, ఎప్పుడు? భారత్ వర్సెస్ శ్రీలంక- రెండో టీ20 హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల ఫిబ్రవరి 26(శనివారం)- రాత్రి ఏడు గంటలకు ఆరంభం తుదిజట్ల అంచనా: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేశ్అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్. శ్రీలంక: నిరోషన్ డిక్వెలా(వికెట్ కీపర్), పాథుమ్ నిసంక, చరిత్ అసలంక, జనిత్ లియానగే, ధనుంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, జెఫ్రే వాండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లాహిరు కుమార. పిచ్ వాతావరణం ధర్మశాల మైదానంలో చివరి టీ20 మ్యాచ్‌ల 2016లో జరిగింది. కాబట్ ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమే. ఇంకా వర్ష సూచన కూడా ఉంది. ముఖాముఖి పోరులో రికార్డులు ఇప్పటి వరకు టీమిండియా- శ్రీలంక మధ్య 23 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 15, లంక ఏడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక సొంతగడ్డపై శ్రీలంకపై 9-2 తేడాతో భారత జట్టు విజయాల పరంగా అద్బుత రికార్డు కలిగి ఉంది. మొత్తంగా భారత్‌లో 16 టి20లు ఆడిన శ్రీలంక 12 మ్యాచ్‌లలో ఓడింది. చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే.. -
ఉప్పెనలా వరదలు.. నీటమునిగిన ధర్మశాల
-
ఊహించని ఉపద్రవం.. ధర్మశాలలో ఆర్తనాదాలు
Dharamshala Cloud Burst కమ్ముకున్న నల్ల మేఘాలు, ఆ వెంటనే భారీ వర్షాలు.. హఠాత్తుగా ముంచుకొచ్చిన వరదలతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో. ముఖ్యంగా భాగ్సు నాగ్ ఏరియాలో వరదల్లో చిక్కుకుపోయిన వందల మంది సాయం కోసం కేకలు వేస్తున్నారు. సిమ్లా: కుంభవృష్టితో ధర్మశాల నీట మునిగింది. సోమవారం ఉదయం వరకు మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కొండలపై నుంచి నీళ్లు.. భాగ్సునాగ్ నాలా ఉప్పొంగడంతో ధర్మశాలలోకి నీరు చొచ్చుకువచ్చింది. బురద నీటి ప్రవాహం, కార్లు కొట్టుకుపోవడం, కట్టలు తెగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Himachal Pradesh rains wreak havoc in #Dharamshala. pic.twitter.com/J60nmYNKJp — Ayushi Agarwal (@ayu_agarwal94) July 12, 2021 #HimachalPradesh Surge in water level of #Bhagsunag nullah in #Dharamshala following heavy rainfall. pic.twitter.com/S7f5dscHt8 — αѕℓαм кнαη ᴀɴᴛɪ ᴡᴀʀ ᴀᴄᴛɪᴠɪꜱᴛ. (@aslamkhanbombay) July 12, 2021 As rains lash down in #Dharamshala shanties of safai karamcharis get washed out by the river in spate. This community has been demanding proper & safe housing for the last 5 years. HP govt & admin is accountable. They should be given immediate relief by providing shelter & food. pic.twitter.com/MfcKRJRZU6 — Endangered Himalaya (@EndangeredHimal) July 12, 2021 ఆ వీడియోలు అక్కడి ప్రజల నిస్సహయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తమను కాపాడాలంటూ చాలామంది సోషల్ మీడియాలోనే వీడియోలు పెడుతున్నారు. ఇక మాన్హి నది ఉప్పొంగడంతోనూ వరదలు మరింత పొటేత్తాయి. Orange Alert in #Dharamshala in #HimachalPradesh after a huge cloud burst pic.twitter.com/D52FHzN0Wk — Holidays Hunt (@HolidaysHunt) July 12, 2021 This is Gaggal Bridge.#Dharamshala#HimachalPradesh pic.twitter.com/F2jL1suMGd — Aryan Rajput🇮🇳 (@AryanRajput21) July 12, 2021 Hoping everyone is safe.🙏 #dharamshala pic.twitter.com/80qP8IXZ1y — Srejan Shankar (@SrejanShankar) July 12, 2021 లాక్డౌన్ తర్వాత ఆంక్షలు సడలించడం, పైగా వారాంతం కావడంతో చాలామంది టూరిస్టులు అక్కడికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఊడిపడ్డ వరదల్లో వాళ్లు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కురవడం, వరద ఉధృతి పెరుగుతుండడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని ధర్మశాల అధికారులు చెప్తున్నారు. Flash flood in Bhagsu Nag, #Dharamshala due to heavy rainfall. #HimachalPradesh (Video credit: SHO Mcleodganj Vipin Chaudhary) ANI pic.twitter.com/O3kbHOToji — Jagran English (@JagranEnglish) July 12, 2021 -
వర్షార్పణం
ధర్మశాల: ఊహించినట్లే జరిగింది... భారత్, దక్షిణాఫ్రికా పోరుకు వరుణుడు సహకరించలేదు. గురువారం ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కాదు కదా కనీసం టాస్ వేసే అవకాశం కూడా లేకుండానే ఆట ముగిసిపోయింది. ఉదయంనుంచి నిరంతరాయంగా కురిసిన వాన ఏ దశలోనూ తెరిపినివ్వలేదు. కనీసం వర్షం ఆగితే పిచ్‌ను పరిశీలించాలని అంపైర్లు భావించగా...అదీ సాధ్యం కాలేదు. నిర్ణీత సమయంకంటే అదనంగా దాదాపు నాలుగు గంటల పాటు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ధర్మశాల అభిమానులకు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశ ఎదురైంది. గత సెప్టెంబరులో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడే భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగాల్సింది. అప్పుడు కూడా భారీ వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లక్నోలో జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఎలాగూ ఈ మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా చూసే అవకాశమే లేదు. -
సెలైవా ఉపయోగించకుంటే బంతిని షైన్ చేయలేం..
న్యూఢిల్లీ: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఆటను కొనసాగిస్తామని టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. వైరస్ ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో బంతిని షైన్ చేసేందుకు లాలాజలం(సెలైవా) ఉపయోగించాలా లేదా అన్న విషయంపై స్పష్టతకు రాలేదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో గురువారం జరుగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన భువీ.. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘‘సెలైవా ఉపయోగించకుంటే బంతిని షైన్ చేయలేం. దాంతో బ్యాట్స్‌మెన్ మా బౌలింగ్‌ను చీల్చిచెండాడుతారు. అప్పుడు.. బౌలింగ్‌లో పస లేదని మీరే అంటారు. కాబట్టి దీనికి పరిమితి పెట్టాలా లేదా అసలే వాడకూడదా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నాం. జట్టు సమావేశం పూర్తయిన తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుంది. టీం డాక్టర్ సలహాలు, సూచనల ప్రకారం నడుచుకుంటాం.(కరోనా ఎఫెక్ట్ : మాస్క్‌తో చహల్) ఇక కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం భారత్‌లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మేం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ నిరంతరం మా వెంటే ఉంటారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతులు తరచుగా కడుక్కోవడం వంటి వాటి ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అయితే మాపై ప్రేమ కురిపించే అభిమానులను దూరం పెట్టడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో తప్పదు’’ అని భువీ చెప్పుకొచ్చాడు. కాగా భారత్‌కు చేరుకున్న ప్రొటీస్ జట్టు సైతం మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఇక కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులతోనూ కరచాలనం చేయకూడదని సఫారీలను ఆదేశించినట్టు ఆ జట్టు ప్రధాన కోచ్ బౌచర్ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ హెల్త్ సూపర్వైజర్ను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.(కరోనాతో వ్యక్తి మృతి : భారత్‌లో తొలి కేసు..!) -
కరోనా ఎఫెక్ట్ : మాస్క్‌తో చహల్
ధర్మశాల : కరోనా ఎఫెక్ట్ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు పలు రకాల క్రీడలు కరోనా వైరస్ దాటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ముఖానికి మాస్క్ తొడిగిన ఫోటో ఒకటి తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రసుత్తం చహల్ ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాహల్ ముఖానికి మాస్క్ వేసుకోవడంతో అతనికి వైరస్ ఏమైనా సోకిందా అని అభిమానులు కంగారు పడిపోయారు. కానీ అదేం లేదంటూ చాహల్ తేల్చేశాడు. (ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్) మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటి వైరస్లు అయినా మన దగ్గరకు రాలేవని చహల్ ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. కరోనా ప్రభావం తగ్గేవరకు ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు మొదటి వన్డే జరిగే ధర్మశాలకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. కాగా చహల్ ఒకరోజు ఆలస్యంగా జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ధర్మశాలకు వెళ్లే సమయంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఇలా దర్శనమిచ్చాడు. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?) మరోవైపు స్వదేశానికి చేరుకున్న ప్రొటీస్ జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. ప్రసుత్తం కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులతోనూ ఎలాంటి కరచాలనం చేయకుడదని జట్టును ఆదేశించినట్టు బౌచర్ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఒక మెడికల్ హెల్త్ సూపర్వైజర్ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కాగా ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ధర్మశాల వేదికగా జరగనుంది. కరోనా వైరస్ దాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం లక్షకు పైగా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 4వేలకు పైగా చేరుకుంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 50 కోవిడ్ కేసులు నమోదైనట్లు తేలింది.(కోవిడ్ గుప్పిట్లో ఇటలీ) 😷 😷 ✈️✈️ pic.twitter.com/BnCyJCuf4V — Yuzvendra Chahal (@yuzi_chahal) March 10, 2020 -
ధర్మశాలలో మోదీ.. అభివృద్ధిపై ప్రశంసలు
ధర్మశాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం జైరాం థాకూర్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రధానికి పుష్పాలతో స్వాగతం పలికారు. ధర్మశాలలో జరుగుతున్న రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ భేటీని ప్రధాని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా హిమాచల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని గడిచిన రెండేళ్లలో హిమాచల్ ప్రదేశ్ గణనీయ అభివృద్ధిని సాధించిందన్నారు. -
ఆసుపత్రిలో చేరిన దలైలామా
ధర్మశాల: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఛాతి సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ధర్మశాల నుంచి ఢిల్లీకి వచ్చిన దలైలామా మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల కొన్ని రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఢిల్లీలోనే ఏప్రిల్ 6న ముగిసిన గ్లోబల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న దలైలామా, సోమవారం ధర్మశాలకు వెళ్లారు. కానీ అనారోగ్యం కారణంగా మరుసటి రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. మొదటిసారిగా 1959లో దలైలామా భారత్‌కు వచ్చారు. టిబెట్, చైనా ఆక్రమణకు గురికావడంతో, తప్పించుకొని భారత్ చేరుకున్న దలైలామా అప్పటి నుంచి హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసం ఉంటున్నారు. బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ సాంప్రదాయానికి తనను తాను వారసుడిగా దలైలామా గతంలో ప్రకటించుకున్నారు. -
ప్రత్యేక పూజలు చేయడంలేదు
రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర శనివారం మొదలైంది. వారం పది రోజులపాటు సాగే ఈ ట్రిప్‌లో రజనీ పలు దేవాలయాలను సందర్శించి, ధ్యానం చేసి, ‘యోగాద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ వందేళ్ల వేడుకల్లో పాల్గొని చెన్నై చేరుకుంటారు. ‘‘ఇటీవల పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలనుకోవడంలేదు. ఎప్పటిలానే ఇది కూడా ఓ స్పిరిచ్యువల్ జర్నీ అంతే’’ అని రజనీ పేర్కొన్నారు. ముందు ధర్మశాల వెళ్లిన రజనీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి శివాలయాన్ని దర్శించారాయన. ఆ తర్వాత రిషికేష్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ (వైఎస్ఎస్) వందేళ్ల వేడుకల్లో పాల్గొంటారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ అభ్యర్థి మృతి
ధర్మశాల : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్తున్న ఓ యువకుడు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన హర్యానా రాష్ర్టంలోని ధర్మశాలకు 50 కి.మీ దూరంలో జరిగింది. స్థానికంగా నివాసముంటన్న ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా పాప్రొలా గ్రామం వద్ద హర్యానా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం మాండి-పఠాన్‌కోట్ జాతీయరహదారిపై జరిగింది. మృతుడు స్థానికంగా నివాసముంటున్న జుగల్(22)గా గుర్తించారు. పాలంపూర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరవ్వడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో గ్రామస్తులు జాతీయ రహదారిని బ్లాక్ చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన వాళ్లని చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
'మసూద్ తలను ఇవ్వండి'
సిమ్లా: భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌పై నిరసన గళం తీవ్రతరమైంది.ఒకవేళ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించాలనుకుంటే ముందుగా పాకిస్తాన్ మిలిటెంట్ మసూద్ అజహర్ తలను భారత్‌కు అప్పగించాలంటూ మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ మంత్రి మేజర్ విజయ్ సింగ్ మంకోతియా డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంకోతియా నేతృత్వంలో సమావేశమైన మాజీ సైనికులు బీసీసీఐని హెచ్చరించారు. 'ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ను ధర్మశాలలో నిర్వహించాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజహర్ తలను అప్పగించాలి. దాదాపు ఏడు వేల మంది కశ్మీర్ మీదుగ పాకిస్తాన్ నుంచి మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండా ధర్మశాల స్టేడియంలో ఎగురుతుంది. అప్పుడు పరిస్థితులు మరింత క్షీణిస్తాయి. పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించడానికి మేము వ్యతిరేకం. దానికోసం ఎందకైనా వెళతాం. ఇప్పటికే ఆపరేషన్ బలిదాన్(త్యాగం)ను చేపట్టడానికి సమాయత్తమయ్యాం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి బెదిరింపులకు దిగింది. ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామంటోంది. 'భారత్‌కు వచ్చేందుకు మాకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. మేం కూడా రావాలనుకుంటున్నాం. కానీ మాకు భరోసా కావాలి. ఈ విషయమై వారు ఒక ప్రకటన చేస్తే మాకు భద్రత కల్పించగలరని భరోసా లభిస్తుంది. నేను బీసీసీఐతో మాట్లాడాను. వారు ప్రైవేటుగా భరోసా ఇస్తున్నారు. అంతర్గత రాజకీయాల వల్ల బహిరంగ ప్రకటన చేయలేమంటున్నారు. పాక్ జట్టు రావాలని కోరుతున్నారు. కానీ, బహిరంగ ప్రకటన తప్పకుండా ఇవ్వాల్సిందే.ఇందుకు ప్రకటన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. దీనిపై చివరినిమిషం వరకు వేచిచూస్తాం. ప్రకటన రాకపోతే చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడం' అని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు.