అశ్విన్ తిప్పేస్తున్నాడు (PC: BCCI)
టీమిండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వందో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా ఈ అరుదైన మైలురాయికి చేరుకున్న అశూ.. ధర్మశాలలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తున్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గింగిరాలు తిరిగే బంతితో ప్రత్యర్థి జట్టు టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
శనివారం మొదలైన మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో అశ్విన్ ఆరంభం(1.5 ఓవర్)లోనే ఓపెనర్ బెన్ డకెట్(2)ను బౌల్డ్ చేశాడు.
అనంతరం మరో ఓపెనర్ జాక్ క్రాలే(1- 5.3వ ఓవర్ వద్ద)ను కూడా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19- 9.2 ఓవర్ వద్ద) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకుని టాపార్డర్ పతనాన్ని శాసించాడు ఈ చెన్నై బౌలర్.
ఓవరాల్‌గా శనివారం నాటి ఆటలో తన బౌలింగ్‌లో వేసిన 4.2 ఓవర్లలోనే అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ జానీ బెయిర్ స్టో(39) రూపంలో నాలుగో వికెట్ దక్కించుకోగా.. బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసి ఐదో వికెట్‌ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు ముందు అశూకు నాలుగు వికెట్లు దక్కగా.. కుల్దీప్ ఒక వికెట్ తీశాడు. ఇక టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment