న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు | Hardik Pandya to miss India vs New Zealand, Surya kumar yadav get placeL: Reports | Sakshi
Sakshi News home page

India vs New Zealand: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌ దూరం! జట్టులోకి విధ్వంసకర ఆటగాడు

Published Fri, Oct 20 2023 6:27 PM | Last Updated on Fri, Oct 20 2023 6:32 PM

Hardik Pandya to miss India vs New Zealand, Surya kumar yadav get placeL: Reports - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. పాయింట్ల పట్టికలో ఆగ్రస్ధానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ధర్మశాల వేదికగా ఆక్టోబర్‌ 20న భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు.

గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా కాలిమడమకు గాయమైంది. దీంతో అతడు ఫీల్డ్‌ను విడిచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం స్కానింగ్‌ తరలించగా అతడి గాయం తీవ్రమైనదిగా తేలింది. అతడు కోలుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హార్దిక్‌ కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.

జట్టులోకి సూర్యకుమార్‌ యాదవ్‌.. 
ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ స్ధానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ రానున్నట్లు తెలుస్తోంది. ధర్మశాల పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉన్నందన సూర్యను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడించాలని టీమిండియా మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కాగా గత కొంతకాలంగా వన్డేల్లో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన సూర్య.. ఈ మెగా టోర్నీకి ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తన రిథమ్‌ను తిరిగి పొందాడు. ఇక బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌ స్ధానంలో పేసర్‌ మహ్మద్‌ షమీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: IPL 2024: ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement