టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో టెస్ట్ అనంతరం లభించిన విరామంలో వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన రోహిత్.. తిరిగి టీమిండియాతో జత కట్టాడు.
Jamnagar ✈️Dharamsala
— CricTracker (@Cricketracker) March 5, 2024
Captain Rohit Sharma's normal duties resume.pic.twitter.com/4CKlGqjW5H
ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు వేదిక అయిన ధర్మశాలలో హిట్‌మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ల్యాండ్ అయ్యాడు. మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీసీసీఐయే స్వయంగా రోహిత్‌కు హెలికాప్టర్‌ను అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 7 నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల ముందస్తు వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు రోహిత్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అన్ని రంగాల సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరందరిలో భారత క్రికెటర్లు ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment