
Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్ శర్మ
Ind Vs Sl 3rd T20: స్వదేశంలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా శ్రీలంకతో నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 27న జరుగబోయే ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన జోష్‌లో 3-0 తేడాతో లంకను వైట్‌వాష్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
కాగా ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లలో భాగంగా పలు ప్రయోగాలు చేసిన రోహిత్ సేన.. ఆఖరి మ్యాచ్‌లో పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి సిరీస్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం. మున్ముందు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది(నవ్వులు). మేము సిరీస్ గెలిచాం. కానీ కొంతమందికి ఆడే అవకాశం రాలేదు.
మరికొంత మంది టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే... అంతిమంగా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. అదే సమయంలో ఆటగాళ్లలో సానుకూల దృక్ఫథం నింపడం ముఖ్యం’’ అని పేర్కొన్నాడు. కాగా ధర్మశాల వేదికగా టీమిండియా- శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయి.
చదవండి: MS Dhoni IPL Promo: గుర్తుపట్టలేనంతగా మారిన ఎంఎస్ ధోని.. ఏం జరిగింది
11th T20I win on the bounce for #TeamIndia 👏👏@Paytm #INDvSL pic.twitter.com/zsrm3abCls
— BCCI (@BCCI) February 26, 2022