టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు 8 నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయ్యర్‌ను ఎంపిక చేసింది. కాగా దేశీవాళీ క్రికెట్‌లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించినందు అయ్యర్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అదేవిధంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అయితే తన తప్పు తెలుసుకున్న అయ్యర్ గత రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ఆడాడు. అంతేకాకుండా జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో అయ్యర్‌కు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నాయి.
గంభీర్‌కు అయ్యర్‌కు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్-2024 విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు అయ్యర్ కెప్టెన్ కాగా.. గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు. గంభీర్ సూచనలతోనే అయ్యర్‌ను మళ్లీ సెలక్టర్లు పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది. అయ్యర్ కాంట్రాక్ట్‌పై కూడా బీసీసీఐ పునారాలోచనచేయనున్నట్లు సమాచారం. ఇక అయ్యర్‌తో పాటు బీసీసీఐ అగ్రహానికి గురైన మరో క్రికెటర్ ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి అని క్రీడా వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది.
కిషన్ రీ ఎంట్రీ ఎప్పుడు?
కాగా గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు.
కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్‌కు ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి.
దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ సీజన్ మొత్తం ఆడాల్సిందే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్డేల్లో అయ్యర్‌కు డబుల్ సెంచరీ ఉన్న సంగతి తెలిసిందే.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment