
కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర (PC: BCCI X)
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఆఖరి టెస్టు ఆరంభమైంది.
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కుల్దీప్ అదరగొడుతున్నాడు. బెన్ డకెట్(27), జాక్ క్రాలే(79), ఒలీ పోప్(11) రూపంలో టాపార్డర్ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్.. మిడిలార్డర్ బ్యాటర్లు జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0)లను కూడా అవుట్ చేశాడు.
కాగా స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అక్షర్ పటేల్‌లను ఈ చైనామన్ బౌలర్ అధిగమించాడు.
అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్ యాదవ్.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు.
తక్కువ బంతుల్లోనే టెస్టుల్లో 50 వికెట్ల మార్కు అందుకున్న భారత బౌలర్లు
1871 - కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)
2205 - అక్షర్ పటేల్(Axar Patel)
2520 - జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)
Comments
Please login to add a commentAdd a comment