
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో చేరనున్నాడు. నాలుగు- ఐదో టెస్టు మధ్య లభించిన విరామానికి స్వస్తి పలికి.. ఆటపై దృష్టి సారించనున్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది.
హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సత్తా చాటింది. తదుపరి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టుకు భారత జట్టు సిద్ధం కానుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న రాంచి మ్యాచ్ ముగియగా.. మార్చి 7న ధర్మశాల మ్యాచ్ ఆరంభం కానుంది.
ఈ మధ్యలో దొరికిన విరామ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా తమ చిన్న కుమారుడి కోసం నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో భార్య రితికాతో కలిసి పాల్గొన్నాడు.
గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అత్యంత వైభవోపేతంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్‌మ్యాన్‌ను చుట్టుముట్టారు.
అయితే, అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అతడి స్థానంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్‌మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి.
చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?!
‘రోహిత్ సహచర ఆటగాళ్లను అందుకే తిడతాడు’
Comments
Please login to add a commentAdd a comment