అంపైర్ నిర్ణయంపై రోహిత్ రియాక్షన్ వైరల్ (PC: BCCI/Jio Cinema)
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు.. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను ఇంగ్లిష్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని.. షార్ట్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు.
ఈ బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ సరిగ్గానే అంచనా వేసి దానిని మిస్ చేశాడు. అయితే, బాల్ రోహిత్ కుడికాలి ప్యాడ్‌ను రాసుకుంటూ వెళ్లి కీపర్‌కు చిక్కింది. కానీ.. ఇంగ్లండ్ మాత్రం క్యాచ్ అవుట్‌కు అప్పీలు చేసింది.
అయితే, అనూహ్యంగా అంపైర్ జోయెల్ విల్సన్ రోహిత్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న హిట్‌మ్యాన్ వెంటనే రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. బంతి బ్యాట్‌ను తాకలేదని రీప్లేలో స్పష్టంగా తేలడంతో థర్డ్ అంపైర్ రోహిత్ శర్మను నాటౌట్‌గా ప్రకటించాడు.
Rohit reminding of Ben stokes to ICC elite umpire Joel Wilson, #INDvENG pic.twitter.com/COcitjOyW8
— That_Lazy_Guy 😴 (@Slow_low_) March 7, 2024
ధర్మశాల వేదికగా గురువారం నాటి తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఫీల్డ్ అంపైర్ తనను అవుట్‌గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నట్లుగా రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది. ఇందులో రోహిత్ ప్రదర్శించిన హావభావాలకు నెటిజన్లు తమదైన శైలిలో భాష్యాలు చెబుతున్నారు.
‘‘అదెట్లా అవుట్ అంపైర్ జీ.. కానేకాదు! ముందే చెప్పానుగా!.. అన్నట్లు హిట్‌మ్యాన్ నవ్వుతూనే.. సెటైరికల్‌గా ఓ చూపు చూశాడు. నిజంగా రోహిత్ సూపర్ కదా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ శతకం(103) పూర్తి చేసుకున్నాడు. అతడికి టెస్టుల్లో ఇది 12వది కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 48వది.
చదవండి: స్టోక్స్ ‘మ్యాజిక్’ బాల్.. రోహిత్ క్లీన్‌బౌల్డ్!.. ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్
The Rohit Rumble Show in Dharamshala🏔️🏟️
— JioCinema (@JioCinema) March 8, 2024
Another well-deserved Test 💯for #TeamIndia's maverick skipper 🙌#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/A686RXXgCm
Comments
Please login to add a commentAdd a comment