jamnagar
-
అనంత్ అంబానీ వంతారాకు కొత్త అతిధులు
అనంత్ అంబానీ స్థాపించిన 'వంతారా' (Vantara) గురించి అందరికి తెలుసు. జామ్‌నగర్‌లో ఉన్న ఈ వన్యప్రాణుల రెస్క్యూ కేంద్రానికి మూడు ఆఫ్రికన్ ఏనుగులు విచ్చేసాయి. ఇందులో రెండు ఆడ ఏనుగులు, మరొకటి మగ ఏనుగు. వీటి వయసు 28 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం.వంతారాను ట్యునీషియాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల అధికారులు సంప్రదించి, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఏనుగుల పోషణ కష్టమైందని వెల్లడించింది. సుమారు 20ఏళ్ల క్రితం నాలుగు సంవత్సరాల వయసున్న 'అచ్తామ్, కనీ, మినా' అనే ఏనుగులు బుర్కినా ఫాసో నుంచి ట్యునీషియాలోని ఫ్రిగ్యుయా పార్కుకు వచ్చాయి. అప్పటి నుంచి అవి సుమారు 23 సంవత్సరాలు అక్కడి సందర్శకులను కనువిందు చేశాయి.ప్రస్తుతం ట్యునీషియాలో వాటి పోషణ భారమైంది. దీంతో భారతదేశంలోని వంతారాకు తరలించాలని నిశ్చయించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఏనుగులను ప్రత్యేకమైన చార్టర్డ్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వంతారాకు విచ్చేసిన ఆఫ్రికా ఏనుగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెటర్నరీ అధికారులు వెల్లడించారు. ఏనుగులకు జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అచ్తామ్కు స్ప్లిట్ టస్క్ & మోలార్ టూత్ ఇన్ఫెక్షన్ ఉంది. కని ఏనుగు గోళ్లు పగిలినట్లు చెబుతున్నారు. కాబట్టి వీటికి సరైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏనుగులకు ప్రత్యేకమైన వసతిని కూడా వంతారాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
మాహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?
జామ్‌నగర్ రాజకుటుంబం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ కుటుంబం తదుపరి వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ అజేయ్ జడేజాను ఎంపికచేసింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్సింహ్జీ.. అజయ్ జడేజాను అధికారికంగా తన వారసుడిగా ప్రకటించారు. "పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజైనా దసరా పర్వదినం సందర్భంగా, అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు సింహాసనాన్ని అధిష్టించనున్నాడు. ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. థంక్యూ ఆజేయ్" అని ఓ ప్రకటనలో శత్రుసల్యాసిన్హ్జీ పేర్కొన్నారు. కాగా అజయ్ జడేజా వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన జామ్‌నగర్ రాజకుటుంబానికి భారత క్రికెట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీవాళీ క్రికెట్లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్సింహ్జీ K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టారు.ఇక జడేజా క్రికెట్లో కూడా తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాడు. 1990లో భారత క్రికెట్ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు. 1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్ ప్రాతినిథ్యం వహించాడు.ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్ సగటు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చినవే కావడం గమనార్హం.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య
జామ్‌నగర్: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ మండపాలలో భక్తుల రద్దీ నెలకొంది. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా తన నియోజకవర్గం జామ్‌నగర్ నార్త్‌లోని గణేశుని మండపంలో లడ్డూలు తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రివాబా జడేజా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య. ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా గణేష్ మహోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నాం. మా గణేశుడికి 4,000 లడ్డూలు నైవేద్యంగా పెడుతున్నాం. లడ్డూలను 50 మందికి పైగా మహిళలు తయారు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. #WATCH | Gujarat | BJP MLA Rivaba Jadeja says, "Ganesh Mahotsav is being organised and celebrated across the country... Here, 4,000 Laddus are being offered to lord Ganesh and for it, more than 50 of our sisters are working. I extend my greetings to all on this occasion and I… https://t.co/TytG9H0ii0 pic.twitter.com/bgjmgrznCB— ANI (@ANI) September 14, 2024ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2024 టీ 20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. రవీంద్ర జడేజా కూడా తన భార్యలాగే రాజకీయాల వైపు దృష్టి సారిస్తూ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. రవీంద్ర గతంలో తన భార్య రివాబా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. పలు రోడ్ షోలలో కూడా కనిపించారు. ఆయన భార్య రివాబా ఐదేళ్ల క్రితం బీజేపీలో చేరారు. 2022లో ఆమె జామ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.ఇది కూడా చదవండి: ఒకే ఈతలో 13 కుక్కపిల్లలు -
Jamnagar: ఎక్కడ చూసినా.. బురద, దుర్వాసన
జామ్‌నగర్: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జామ్‌నగర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మీడియా బృందం జామ్ నగర్లో పర్యటించింది. జామ్‌నగర్‌లో వరదలు, వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. 500కు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.వర్షాల అనంతం జామ్‌నగర్‌లోని తీన్ బత్తి చౌక్ ప్రాంతంలోని బద్రీ కాంప్లెక్స్ బేస్మెంట్లో నీరు నిలిచిపోయి, బురద పేరుకుపోయింది. విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. కాంప్లెక్స్‌లో వర్షాలకు ముద్దయిన సరుకులను సంబంధిత దుకాణాల యజమానులు ట్రాక్టర్లలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నారు.ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మదీనా మసీదు సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. మీడియాను చూసిన అక్కడి మహిళలు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకున్నారు.ఘాచీ కి ఖడ్కీలో వర్షాల అనంతరం పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్లపై అడుగుతీసి అడుగువేయలేనంతగా బురద పేరుకుపోయింది. -
Anant- Radhika: తిరుగు పయనం.. భయ్యాకు కోపం వస్తే అంతే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో చేరనున్నాడు. నాలుగు- ఐదో టెస్టు మధ్య లభించిన విరామానికి స్వస్తి పలికి.. ఆటపై దృష్టి సారించనున్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సత్తా చాటింది. తదుపరి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టుకు భారత జట్టు సిద్ధం కానుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న రాంచి మ్యాచ్ ముగియగా.. మార్చి 7న ధర్మశాల మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మధ్యలో దొరికిన విరామ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా తమ చిన్న కుమారుడి కోసం నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో భార్య రితికాతో కలిసి పాల్గొన్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అత్యంత వైభవోపేతంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్‌మ్యాన్‌ను చుట్టుముట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అయితే, అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అతడి స్థానంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?! ‘రోహిత్ సహచర ఆటగాళ్లను అందుకే తిడతాడు’ -
మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు: ఉపాసన ట్వీట్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ ఉపాసన- రామ్ చరణ్ ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఫంక్షన్లో పలువురు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆదివారంతో ముగిశాయి. తాజాగా ఈ వేడుకలకు హాజరైన ఉపాసన- రామ్ చరణ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. 'అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా జీ- ముఖేశ్ జీ అతిథ్యం సాటిలేనిది.. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన వ్యక్తులతో.. అద్భుతమైన సమయం వెచ్చించినందుకు సంతోషంగా ఉందంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Congratulations Anant & Radhika & the whole Ambani Family. Nita Ji & Mukesh Ji your hospitality is unmatched. Thank you. Wonderful times with wonderful people pic.twitter.com/IzcrOxHN5X — Upasana Konidela (@upasanakonidela) March 4, 2024 -
ప్రీ వెడ్డింగ్‌లో రజినీకాంత్.. మరి ఇంత చీపా?
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలామ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైనా వెట్టైయాన్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజినీకాంత్ సందడి చేశారు. తన భార్య లతా, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా.. వేడుకలకు వెళ్తున్న రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. అయితే ఆమెను రజినీకాంత్ పక్కకు వెళ్లు అనేలా తన చేతులతో సంజ్ఞ చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజినీకాంత్ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు.. కానీ పేద ప్రజలకు, అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ..' స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి.. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అంటూ కామెంట్ చేశారు. 'అదే ఆయన అసలు రంగు' అని ఒకరు రాయగా.. రజినీకాంత్ చీప్ బిహేవియర్' అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. Cheapest behaviour from #Rajinikanth!pic.twitter.com/uw0opzNdsZ — Kolly Censor (@KollyCensor) March 3, 2024 -
నా జీవితం పూలపాన్పు కాదు
జామ్‌నగర్: అక్షరాలా ఆకాశమంత పందరి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుక. ఆహూతులుగా ప్రపంచ స్థాయి సినీ, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు. అంతటా ఆనందం వెల్లివిరుస్తున్న వేళ. పెళ్లికొడుకు కాబోతున్న తన చిన్న కుమారుడు అనంత్ మాట్లాడిన మాటలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని కంటతడి పెట్టించాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటైన సువిశాలమైన ప్రాంగణం ఇందుకు వేదికైంది. మూడు రోజుల వేడుకల్లో తొలి రోజు శుక్రవారం అనంత్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచీ తనను వేధిస్తూ వస్తున్న ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు. ‘‘అంతా అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పేమీ కాదు. భరించలేని బాధల వాడిముళ్లు చిన్ననాటి నుంచీ విపరీతంగా వేధించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆరోగ్య సమస్యలు! కానీ అన్ని బాధలను అధిగమిస్తూ వచ్చానంటే మా అమ్మానాన్నే కారణం! నన్నెంతో అపురూపంగా చూసుకున్నారు. నిరంతరం నా వెన్నంటి నిలిచారు. నా జీవితంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పెళ్లి వేడుకను నాకు అత్యంత స్పెషల్‌గా మలచేందుకు వాళ్లు, నా కుటుంబ సభ్యులు ఎంతగా కష్టపడ్డారో నాకు మాత్రమే తెలుసు. వాళ్లెవరూ కొద్ది నెలలుగా రోజుకు 3 గంటల కంటే నిద్రే పోలేదు. వేడుకలను ఇంత గొప్పగా తీర్చిదిద్ది నన్ను సంతోషపెట్టేందుకు రోజుకు కనీసం 20 గంటల పాటు కఠోరంగా శ్రమిస్తూ వచ్చారు’’ అంటూ ఆద్యంతం ఎమోషనల్‌గా మాట్లాడారు. అనంత్ మాటలను ఆహూతులతో పాటు ఆసాంతం వింటూ, ఆ క్రమంలో ముప్పిరిగొన్న రకరకాల భావోద్వేగాల నడుమ ముకేశ్, నీతా అంబానీ దంపతులు తడి నిండిన కళ్లతో కుమారున్ని ఆప్యాయంగా చూసుకుంటూ ఉండిపోయారు. దాంతో అందరి మనసులూ భారమయ్యాయి. దిగ్గజాల సందడి అనంత్, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచీ ప్రముఖులంతా తరలివచ్చారు. పారిశ్రామిక, సినీ, క్రికెట్ దిగ్గజాలంతా వేడుకల్లో పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, పారిశ్రామిక దిగ్గజాలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్, దీపికా పడుకొణె, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీతో పాటు పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కూడా వీరిలో ఉన్నారు. 1,000 మందికి పైగా వీఐపీలు పాల్గొన్న ఈ వేడుకల్లో ప్రముఖ పాప్ సింగర్ రిహానా ప్రధానాకర్షణగా నిలిచారు. డైమండ్స్, రూడ్బోయ్, పోరిటప్ వంటి తన ఆల్‌టైం హిట్ నంబర్స్‌కు ఆడి పాడి ఆహూతులను ఉర్రూతలూగించారు. ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు అరిజిత్సింగ్ తదితరులు ఆహూతులను తమ గానంతో అలరించారు. -
అనంత్-రాధిక పెళ్లి సందడి : జోరుగా సన్నాహాలు, లేజర్ లైట్ షో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీచిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి సందడికి సంబంధించి రోజుకో ముచ్చట వార్లల్లోనిలుస్తోంది. తాజాగా గుజరాత్‌లోని జామ్ నగర్లో నిర్వహించిన లేజర్ లైట్ షో ఆకర్షణీయంగా నిలుస్తోంది. అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌తో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్,బిజినెస్ వర్గాల్లో ఎదురు చూస్తున్నాయి. ఈ జంట జూలై 12న మూడుముళ్ల వేడకను నిర్వహించేందుకు ఇరుకుటుంబాలుఏర్పాటు ముమ్మరం చేశాయి. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌కు ముందు మార్చి 1- ఏప్రిల్ 2024 ప్రీ వెడ్డింగ్ వేడులకు సన్నాహాలు ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) శ్రీకృష్ణుడి థీమ్‌తో లేజర్ లైట్షో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముందు అంబానీకుటుంబం లేజర్ లైట్ షోను ఏర్పాటు చేసిందట. శ్రీకృష్ణుడి థీమ్‌తో జామ్‌నగర్‌లో అందమైన లేజర్ లైట్ షోని విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తల్లీ కొడుకుల మధ్య అందమైన బంధాన్ని, పచ్చదనంలో తిరుగుతున్న ఏనుగును, నీలి ఆకుపచ్చ రంగులలో జామ్‌నగర్ మ్యాప్‌ను చూపించే దృశ్యాలు విశేషంగా నిలుస్తున్నాయి. అంతేకాదు వివాహానికి ముందు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 కొత్త ఆలయాలను ప్రారంభించనున్నారు. అతిరథమహాథులు, డ్రెస్‌కోడ్, గిఫ్ట్‌లు అలాగే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముఖేష్ అంబానీ ప్రముఖ అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారట. ఖతార్ ప్రధాన మంత్రి, భూటాన్ రాజు ,రాణి సాహా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్, స్టీఫెన్ స్క్వార్జ్మాన్, డిస్నీ CEO, బాబ్ ఇగర్,అడోబ్ సీఈఓ, శంతను నారాయణ్ లాంటి ప్రముఖులున్నారు. అలాగే అతిథులకు కూడా మూడు రోజులపాటు విభిన్న దుస్తుల కోడ్ ఉంటుంది. దీంతోపాటు అతిథులకు బ్రహ్మాండమైన బహుమతులను కూడా ఇవ్వబోతున్నారట. -
గుజరాత్ : రవీంద్ర జడేజా సతీమణి రివాబా గెలుపు
-
జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభా ఎన్నికల సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’ ఆసక్తి కరంగా సాగుతున్నాయి. జడేజా సతీమణి రివాబా.. బీజేపీ తరపున జామ్‌నగర్ నార్త్ నుంచి పోటీలో నిలిచారు. భార్యను గెలిపించడానికి జడేజా విస్తృత ప్రచారం చేశాడు. అయితే జడేజా తండ్రి, అనిరుధ్‌సిన్హ్, సోదరి నయ్‌నబా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వాట్సాఫ్‌లో చక్కర్లు కొడుతోంది. తమ్ముడిలాంటోడు.. గెలిపించండి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బిపింద్రసిన్హ్ తనకు తమ్ముడు లాంటివాడని, అతడిని గెలిపించాలని నార్త్ జామ్‌నగర్ ఓటర్లను అనిరుధ్‌సిన్హ్ కోరారు. ముఖ్యంగా రాజ్‌పుత్‌లు అతడికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో జడేజా కుటుంబంలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’పై గుజరాత్ ఓటర్లు చర్చించుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జడేజా సోదరి నయ్‌నబా.. జామ్‌నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్చార్జిగా ఉన్నారు. జడేజా వర్సెస్ జడేజా జామ్‌నగర్ నార్త్‌లో పోటీని ‘జడేజా వర్సెస్ జడేజా’గా చూడాల్సిన అవసరం లేదని నయ్‌నబా పేర్కొన్నారు. విభిన్న సైద్ధాంతికత కలిగిన కుటుంబాలు జామ్‌నగర్‌లో చాలా ఉన్నాయని వెల్లడించారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నా... తమ కుటుంబాల మధ్య ఎటువంటి వివాదాలు లేవన్నారు. తనవారంతా బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. అది ఆయన వ్యక్తిగత విషయం మామగారి వీడియోపై రివాబా తనదైన శైలిలో స్పందించారు. ఒకే పార్టీలో రెండు పార్టీలకు చెందిన వారు ఉండడం కొత్త విషయమేమి కాదని అన్నారు. ‘నా మామగారిలా కాకుండా మరో పార్టీకి చెందిన కార్యకర్తగా ఆయన మాట్లాడారు. అది ఆయన వ్యక్తిగత విషయం. జామ్‌నగర్ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. జామ్‌నగర్ మాకు ఎన్నో ఇచ్చింది. నా భర్త ఇక్కడే పుట్టి, కెరీర్ ఆరంభించాడ’ని రివాబా పేర్కొన్నారు. అయితే తన భర్త మాత్రం తనకే అండగా ఉన్నాడని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కాగా, గుజరాత్ మొదటి విడత ఎన్నికలు గురువారం ముగిశాయి. నార్త్ జామ్‌నగర్‌లో ఈ రోజు పోలింగ్ జరిగిన 89 నియోజకవర్గాల్లో ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది డిసెంబర్ 8న తేలుతుంది. (క్లిక్ చేయండి: ఏ మ్యానిఫెస్టోలో ఏముంది?) -
రిలయన్స్ సపోర్టుతో ‘జూ’.. వ్యతిరేక పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో నిర్మిస్తున్న జంతు ప్రదర్శనశాల(GZRRC)కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సపోర్టుతో జామ్‌నగర్‌లో గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ జూకు జంతువులను సేకరించడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక, సెంట్రల్ జూ అథారిటీ ద్వారా జూ, రెస్క్యూ సెంటర్‌కు గుర్తింపు మంజూరులో ఎటువంటి చట్టపరం కానీ అంశం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లో లాజిల్ లేదంటూ వ్యాఖ్యలు చేసింది. కాగా, జూ ఏర్పాటును సవాలు చేస్తూ ఓ కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్ జూకు ఉన్న అనుభవం, సామర్థ్యం దృష్ట్యా జూ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. అలాగే, సదరు జూలోని భారత్‌లోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి జంతువులను తీసుకురావడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో GZRRC పిటిషన్లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చింది. జూలో జంతువుల సంక్షేమం, రక్షణ, పునరావాసం కోసం కట్టుబడి ఉన్నట్టు సంస్థ హెడ్ ధన్రాజ్నత్వాని తెలిపారు. జూలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు, వైద్యులు, క్యూరేటర్లు, జీవశాస్త్రవేత్తలు, జంతుశాస్త్రజ్ఞులు, ఇతర నిపుణుల పనితీరు గురించి స్పష్టం చేశారు. దీంతో, GZRRC వివరణపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్ -
గుజరాత్లో వరుణ విలయం
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్‌దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్‌నగర్‌లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలో కొంత ఊరట నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. థానె జిల్లా మిరాభయందర్ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. రాయ్‌గఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు తెలంగాణ, రాజసాŠత్న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
త్వరలో ఆయుష్ వీసా
గాంధీనగర్: ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్ మార్క్‌తో ఆ ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల సదస్సును ప్రారంభించాక హీల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్, డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్ ఉత్పత్తులకు మార్కింగ్ ఇస్తారని మోదీ చెప్పారు. ‘‘సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్ కావాలి’’ అన్నారు. దహోద్‌లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ పెడతామన్నారు. 1800 కోట్ల డాలర్ల విలువ 2014కు పూర్వం ఆయుష్ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువని, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటిందని మోదీ తెలిపారు. సంప్రదాయ వైద్య స్టార్టప్‌లకు ఆయుష్ శాఖ సాయం చేస్తుందన్నారు. ఈ రంగం నుంచి యూనికార్న్‌లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు) వస్తాయన్నారు. ఆయుష్ ఈమార్కెట్ పోర్టల్‌ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తామని మోదీ తెలిపారు. విదేశీ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని టెడ్రోస్ చెప్పారు. భారత్, మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్ చర్చలు జరిపారు. టెడ్రోస్ కాదు.. తులసీ భాయ్ హీల్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌కు ప్రధా ని మోదీ తులసీ భాయ్ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు. (చదవండి: పాల ఉత్పత్తిలో భారత్ టాప్) -
రిలయన్స్ సబ్సిడరీకి ‘సిన్‌గ్యాస్’ బదిలీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జామ్‌నగర్ సిన్‌గ్యాస్ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుబంధ సంస్థకు బదలాయించనుంది. ఈ ప్రాజెక్టుకు మరింత విలువను చేకూర్చడమే ఈ చర్యల ప్రధానోద్దేశమని రిలయన్స్ ప్రకటించింది. ఇంధన ఉత్పత్తిలో ఉపయోగించే ఈ సిన్‌గ్యాస్ (సింథసిస్ గ్యాస్) అనేది హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అలాగే కొంత మొత్తంలో కార్బన్ డయాక్సై డ్లతో కూడిన సమ్మేళనం. ఘన హైడ్రోకార్బన్ ఇంధనాన్ని గ్యాసిఫికేషన్ చేయడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ‘ఈ బదలాయింపు అనేది సిన్‌గ్యాస్ విలువను అన్‌లాక్ చేయడానికి తోడ్పడుతుంది అలాగే కంపెనీ ప్రధాన ఇంధన వనరుగా పునరుత్పాదకాల వైపు మళ్లడానికి సహాయపడుతుంది’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇంధన వ్యయాల్లో తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించడానికి అలాగే నమ్మకమైన ఇంధన సరఫరాకు సిన్‌గ్యాస్ భరోసాగా నిలుస్తోంది. జామ్‌నగర్ రిఫైనరీలో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. -
కోరిక తీర్చమన్నారు.. విషయం సీఎంకు చేరింది!
జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఆర్ మేనేజర్, సూపర్వైజర్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహిళా అటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితేశ్ పాండే తెలిపారు. ఈ విషయం తెలిసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. కొంతమంది కాంట్రాక్టు మహిళా అటెండెంట్లు తమపై కొందరు ఉన్నతాధికారులు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారి కోరికను తిరస్కరించిన కొందరు మహిళా అటెండెంట్లను జూన్ 16న విధుల నుంచి తొలిగించినట్లు పేర్కొన్నారు. వార్డ్ బాయ్స్ ద్వారా తమకు ఈ ప్రతిపాదనలు చేయిస్తున్నారని అన్నారు. వారి కోరికను తిరస్కరించిన వారికి మూడు నెలలుగా జీతం చెల్లించకుండా తొలగించారని వివరించారు. కాగా దీనిపై జామ్ నగర్ బి డివిజన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 354, 354-ఎ, 354-బి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితీశ్ పాండే అన్నారు. ఇక ఈ ఆరోపణలపై సమగ్ర నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది. చదవండి: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు -
ప్రేయసికి అవమానం: ప్రతీకారం తీర్చుకున్నాడు
రాజ్‌కోట్: ఐదేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళసెల్వన్ కన్నన్.. 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా చిత్రీకరించి,సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమె సహా వైద్య విద్యార్ధులందరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు విభిన్న రీతిని ఎంచుకొని, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీకారేచ్ఛలో భాగంగా నిందితుడు ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్లో మెడికల్ కాలేజీల సమాచారం సేకరించి, ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్ధులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గతేడాది డిసెంబర్లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
ఆశ్చర్యపరుస్తున్న బుల్లి సచిన్
అహ్మదాబాద్: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లను దేవుళ్లగా కొలిచేవారికి మన దేశంలో కొదవ లేదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఎంతో మంది వారి స్థాయితో సంబంధం లేకుండా వారి టాలెంట్‌తో టీం ఇండియాలో స్థానం దక్కించుకొని గొప్ప ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఒక ఆణిముత్యానికి సంబంధించిన వీడియోని ఈఎస్పీఎన్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. (‘ధోని కెప్టెన్ కాకుండా ఉంటే?: గంభీర్) జామ్‌నగర్‌కు చెందిన మిలాన్ పటేల్ అనే బుడ్డోడు పిట్టకొంచెం కూత ఘనం అనే చందాన ఒక్కొక్క బాల్‌ను బౌండరీలు దాటేలా కొట్టాడు. తన చిన్న చేతుల్లో ఎంత శక్తి ఉందో అంతటిని ఉపయోగించి ఒక్కో బంతిని చుట్టూ ఉండే భవనాలంత ఎత్తుకు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఈఎస్పీఎన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మన దేశంలో అవకాశం రావాలే కానీ వీధికొక సచిన్ ఉన్నాడని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ షాట్స్‌కు తుఫాన్ రావడం ఒక్కటే మిస్ అయ్యింది అని మరొకరు కామెంట్ చేశారు. (చెమట పట్టకపోతే ఏం చేస్తారు?) -
కాంగ్రెస్‌లోకి హార్దిక్
సాక్షి, అహ్మదాబాద్ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరతారనే సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే హార్దిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి హార్దిక్ పోటీ చేస్తారని ఆయన సన్నిహుతులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పుణమ్బన్ మాడమ్ బీజేపీ తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పటేల్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ని ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో పబ్లిక్ ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. గత కొద్ది కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పట్టు కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చింది. (చదవండి : ఇక ఢిల్లీలో పోరాడతా: హార్దిక్) -
గుజరాత్లో అమానుషం
-
జై జవాన్.. జై కిసాన్
నేడు కచ్ చిట్టచివరి రైతులు, జవాన్లకు నర్మదా నీళ్లు * గుజరాత్‌లోని సౌరాష్ట్ర నర్మదా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ప్రధాని * సీఎంగా ఉన్నప్పుడు నీటి పరిరక్షణను ప్రోత్సహించానన్న మోదీ జామ్‌నగర్: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్లో రైతులకు చేరువయ్యే ప్రయత్నాల్ని ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే మొదలుపెట్టేశారు. ప్రధాని పదవి చేపట్టాక మంగళవారం తొలిసారి గుజరాత్లో ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పటేళ్ల వర్గానికి పట్టున్న జామ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సనోసరలో ‘సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ సాగునీటి ప్రాజెక్టు’(సౌనీ)ను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... జై జవాన్, జైకిసాన్ నినాదంతో సౌనీ ప్రాజెక్టు కోసం కష్టపడ్డామని, ఇప్పుడు రైతులతో పాటు జవాన్లు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గుజరాత్ మోదీ పర్యటనను తప్పుపట్టిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ..‘తాయిలాలు ఎరవేసి మీరు ఎన్నికల్లో గెలవవచ్చు. కానీ మేం వాటిని నమ్మం. మార్పు, అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 15 ఏళ్లు కష్టపడ్డాం’ అని చెప్పారు. నీటి పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెప్పిన మోదీ... గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలన్న తన ఆశయాన్ని ఆ సమయంలో ప్రజలు అర్థం చేసుకోలేదన్నారు. ‘ 2001లో నేను మొదటిసారి గుజరాత్ సీఎం అయ్యాక... కరెంటు సరఫరా పెంచాలనే డిమాండ్‌కు బదులు నీటి నిర్వహణపై దృష్టి పెడితే బాగుంటుందని రైతులకు తరచుగా చెప్పేవాడిని. రెండు మూడేళ్లు రైతులు అర్థం చేసుకునేలా చేయడంలో విఫలమయ్యా. ఆ సమయంలో రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నా. నేను మాత్రం నా ఆలోచనకే కట్టుబడి ఉన్నాను. తుంపర, బిందు సేద్యం, సూక్ష్మ సాగునీటి పరికరాలు వాడుతూ నీటిని పరిరక్షించాలనే నా ఆలోచనను అంగీకరించినందుకు రైతులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నర్మదా నీళ్లు కచ్‌లోని చివరి ప్రాంతానికి కూడా చేరుతూ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. గతంలో కచ్‌లో పనిచేసే బీఎస్ఎఫ్ జవాన్లు ఒంటెలపై నీటిని తెప్పించుకునేవారు. ఇప్పుడు స్నానానికి కూడా వారు నర్మదా నీటినే వాడుతున్నారు’ అంటూ మోదీ ప్రసంగించారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో పనిచేశామని, నర్మదా నీరు రైతుల జీవితాల్ని మార్చేసిందన్నారు. -
డ్రైనేజీలో పడిన మహిళా ఎంపీ
జామ్‌నగర్: తన నియోజక వర్గంలో ప్రజా సమస్యలు వినడానికి వెళ్లిన ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె నీల్చున్న డ్రైనేజీ స్లాబ్ ఒక్క సారిగా కుప్పకూలడంతో అమాంతం 10 అడుగుల లోతులో ఉన్న డ్రైనేజీ నీళ్లలో పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్‌లోని జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ ఎంపీగా ఉన్న పూనమ్.. సోమవారం తన నియోజక వర్గంలోని ప్రజల సమస్యలను వినేందుకు వెళ్లారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో అధికారులు పేదల ఇళ్లు కూల్చేయడంతో.. అక్కడ ఉన్న బాధితులతో ఎంపీ మాట్లాడుతుండగా, ఒక్క సారిగా ఆమె నిల్చున్న డ్రైనేజీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ఎంపీ 10 అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోయారు. వెంటనే పక్కనున్న అధికారులు, కార్యకర్తలు ఆమెకు సహాయం చేసి బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.