అనంత్ అంబానీ స్థాపించిన 'వంతారా' (Vantara) గురించి అందరికి తెలుసు. జామ్‌నగర్‌లో ఉన్న ఈ వన్యప్రాణుల రెస్క్యూ కేంద్రానికి మూడు ఆఫ్రికన్ ఏనుగులు విచ్చేసాయి. ఇందులో రెండు ఆడ ఏనుగులు, మరొకటి మగ ఏనుగు. వీటి వయసు 28 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం.
వంతారాను ట్యునీషియాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల అధికారులు సంప్రదించి, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఏనుగుల పోషణ కష్టమైందని వెల్లడించింది. సుమారు 20ఏళ్ల క్రితం నాలుగు సంవత్సరాల వయసున్న 'అచ్తామ్, కనీ, మినా' అనే ఏనుగులు బుర్కినా ఫాసో నుంచి ట్యునీషియాలోని ఫ్రిగ్యుయా పార్కుకు వచ్చాయి. అప్పటి నుంచి అవి సుమారు 23 సంవత్సరాలు అక్కడి సందర్శకులను కనువిందు చేశాయి.
ప్రస్తుతం ట్యునీషియాలో వాటి పోషణ భారమైంది. దీంతో భారతదేశంలోని వంతారాకు తరలించాలని నిశ్చయించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఏనుగులను ప్రత్యేకమైన చార్టర్డ్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారత్‌కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వంతారాకు విచ్చేసిన ఆఫ్రికా ఏనుగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెటర్నరీ అధికారులు వెల్లడించారు. ఏనుగులకు జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అచ్తామ్‌కు స్ప్లిట్ టస్క్ & మోలార్ టూత్ ఇన్‌ఫెక్షన్ ఉంది. కని ఏనుగు గోళ్లు పగిలినట్లు చెబుతున్నారు. కాబట్టి వీటికి సరైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏనుగులకు ప్రత్యేకమైన వసతిని కూడా వంతారాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment