రిలయన్స్‌ సపోర్టుతో ‘జూ’.. వ్యతిరేక పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు | SC Dismisses PIL Against GZRRC Zoo In Gujarat Jamnagar | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ సపోర్టుతో ‘జూ’.. వ్యతిరేక పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Published Sat, Aug 20 2022 9:16 PM | Last Updated on Sat, Aug 20 2022 9:17 PM

SC Dismisses PIL Against GZRRC Zoo In Gujarat Jamnagar - Sakshi

భారత​ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఊరట లభించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుతో నిర్మిస్తున్న జంతు ప్రదర్శనశాల(GZRRC)కు అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

వివరాల ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సపోర్టుతో జామ్‌నగర్‌లో గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. కాగా,  ఈ జూకు జంతువులను సేకరించడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇక, సెంట్రల్ జూ అథారిటీ ద్వారా జూ, రెస్క్యూ సెంటర్‌కు గుర్తింపు మంజూరులో ఎటువంటి చట్టపరం కానీ అంశం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌లో లాజిల్‌ లేదంటూ వ్యాఖ్యలు చేసింది. 

కాగా, జూ ఏర్పాటును సవాలు చేస్తూ ఓ కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్‌ జూకు ఉన్న అనుభవం, సామర్థ్యం దృష్ట్యా జూ ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. అలాగే, సదరు జూలోని భారత్‌లోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి జంతువులను తీసుకురావడాన్ని నిషేధించాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో GZRRC పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చింది. జూలో జంతువుల సంక్షేమం, రక్షణ, పునరావాసం కోసం కట్టుబడి ఉన్నట్టు సంస్థ హెడ్‌ ధన్‌రాజ్‌నత్వాని తెలిపారు. జూలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు, వైద్యులు, క్యూరేటర్లు, జీవశాస్త్రవేత్తలు, జంతుశాస్త్రజ్ఞులు, ఇతర నిపుణుల పనితీరు గురించి స్పష్టం చేశారు. దీంతో, GZRRC వివరణపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.  అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. 

ఇది కూడా చదవండి:  కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్‌ సవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement