zoo
-
జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!
ఆరిలోవ : విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు తోడ్పాటు అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వన్యప్రాణులను జూ అధికారులు దత్తత ఇస్తున్నారు. ఇందుకు దాతలు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దాతల పేరుతో జూ సిబ్బంది వాటికి ఆహారం అందిస్తారు. జూలో ఏ జంతువు, ఏ పక్షిని దత్తత తీసుకొంటే వాటి ఎన్‌క్లోజరు వద్ద వాటి ఫొటోతో పాటు దాతల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.అవి సందర్శకులకు స్పష్టంగా కనిపించే విధంగా ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పలువురు దాతల పేర్లతో కూడిన బోర్డులను వారు దత్తత తీసుకొన్న వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద సిద్ధం చేశారు. ఆకర్షణీయంగా దాతల పేర్లతో బోర్డులు జూ పార్కులో వివిధ జాతులకు చెందిన జంతువులు, రకరకాల పక్షులు, తాబేళ్లు, మొసళ్లు, పాములు జూకి వెళుతున్న సందర్శకులను అలరిస్తుంటాయి. ఆయా ఎన్క్లోజర్ల వద్ద దాతల బోర్డులు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూలో వందల కొలది వన్యప్రాణులు, పక్షులు ఉన్నాయి. వాటిపై ప్రేమ, వాత్సల్యం చూపుతూ జూ అధికారులకు సహకరిస్తున్నారు. వాటిని దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఆహారం అందించడానికి బాధ్యతగా తీసుకొని సహాయపడుతున్నారు. ఇక్కడ తెల్ల పులి, ఖఢ్గమృగం, జిరాఫీ తదితర పెద్ద జంతువులను పలు కంపెనీలు ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. మరికొన్ని చిన్న జంతువులు, పక్షులను కూడా కొందరు నెల, ఆరు నెలలు పాటు దత్తత తీసుకొని ఆహారం అందిస్తున్నారు. » ఫ్లూయంట్ గ్రిడ్ లిమిటెడ్ జిరాఫీని ఒక ఏడాది పాటు దత్తత తీసుకొంది. దీంతో ఆ కంపెనీ పేరు, జిరాఫీ చిత్రపటంతో దాని ఎన్‌క్లోజరు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు.. » ఎన్‌క్లోజరు వద్ద ఐఓసీఎల్ కంపెనీ ఖఢ్గమృగాన్ని ఏడాది కాలం దత్తత తీసుకొన్నారు. దాన్ని మళ్లీ మరో ఏడాది దత్తత కొనసాగించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. ఖఢ్గమృగం ఉన్న చిత్రపటంపై లిమిటెడ్ పేరుతో బోర్డును దాని ఎన్‌క్లోజరు వద్ద ఏర్పాటు చేశారు. » ఆర్సిలోర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్(ఏఎన్/ఎంఎస్) తెల్ల పులిని ఒక సంత్సరం పాటు దత్తత తీసుకొంది. తెల్లపులుల ఎన్‌క్లోజరు వద్ద ఆ కంపెనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. » వీటితో పాటు మరికొందరు ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల, ఒక్కరోజు కూడా ఇక్కడ వన్యప్రాణులకు ఆహారం అందించడానికి దత్తత తీసుకొన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.ఆదాయం పన్ను మినహాయింపు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. వాటి కోసం ఒక రోజు, నెల, ఏడాది వారిగా అయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయం పన్నులో మినహాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ దత్తత పద్ధతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులకు ఆహారం అందిస్తున్నారు. దాతలు ముందుకు రావాలి జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు రావాలి. వాటికి ఆహారం అందించడంలో భాగస్వాములు కావాలి. ఇప్పటికే కొందరు దాతలు సంస్థల పరంగా, వ్యక్తిగతంగా ముందుకు వచ్చి కొన్ని జంతువులను, పక్షులను వారం, నెల, ఏడాది కాలానికి ఆహారం అందించడానికి వన్యప్రాణులను దత్తత తీసుకొన్నారు.ఎక్కువమంది దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తే మూగజీవాలకు సహకరించినవారవుతారు. దాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. – మంగమ్మ, జూ క్యూరేటర్ ఆహారం ఇలా... సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పళ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పళ్లు ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పళ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికీ వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
సింహాలకు హీటర్లు.. పాములకు కంబళ్లు
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్కులోని జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూపార్కులోని సింహాలు, పులులు వంటి భారీకాయం కలిగిన జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే వాటికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అవి ఉండేచోట హీటర్లను అమర్చారు. ఈ హీటర్లు రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇదేవిధంగా శీతాకాలంలో జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. పాముల వంటి సరీసృపాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కంబళ్లను వినియోగిస్తున్నారు.జింకలు, ఇతర చిన్న జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక గడ్డిని వాటి ఎన్క్లోజర్లలో ఉంచుతున్నారు. తద్వారా అవి వెచ్చదనంలో ఉండేలా చూస్తున్నారు. జలచరాలకు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూ పశువైద్యాధికారి యోగేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో ప్రతి జాతి జంతువుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇది కూడా చదవండి: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
శంకర్ దయాళ్ శర్మకు ఏనుగు గిఫ్ట్.. అసలు ఆ కథేంటి?
ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు."Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024 ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. -
బర్డ్ ఫ్లూ కలకలం: వియత్నాంలో 47 పులుల మృతి
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024 ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ఈ H5N1 వైరస్ ఇన్ఫెక్షన్లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్ -
జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం
అబూజా: నైజీరియాలోని ఓ జూలో ఆదమరిచి ఉన్న ఉద్యోగిని సింహం కొరికి చంపింది. ఒగున్ రాష్ట్రం అబియోకుటలో ఉన్న మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. బబజీ దౌలే(35) అనే సుశిక్షు తుడైన జూ కీపర్ అందులోని సంహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటారు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి దౌలే సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నారు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచే ఆహారం వేయడం ప్రారంభించారు. ఆ సింహం అనుకోకుండా ఆయనపై దాడి చేసి, మెడను నోట కరుచుకుంది. దీంతో, సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు. -
పాండాలకు బదులు..
బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని థాయ్జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది. ఆ ఎన్‌క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్‌క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్లైన్లో 14 లక్షల మంది షేర్చేశారు. గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి. -
1000 ఎకరాల్లో కొత్త జూపార్క్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు వెలుపల వెయ్యి ఎకరాల్లో కొత్త జూపార్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూపార్క్‌లో ఉంచాలని చెప్పారు. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొలి్పన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. పట్టణ అటవీకరణను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘స్పీడ్’(స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ)పై సమీక్షలో భాగంగా శుక్రవారం సచివాలయంలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతగిరిలో హెల్త్ టూరిజం అభివృద్ధి..అనంతగిరిలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందంటూ, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇనిస్టిట్యూట్ తరహాలో అక్కడ నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. వెల్నెస్సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులు ఆసక్తిగా ఉంటే సంప్రదింపులు జరపాలని, ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహా్వనించాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానాన్ని రూపొందించాలని, పర్యాటక రంగంలో ముందున్న రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. బంగారు తాపడం పనుల్లో వేగం పెంచండి యాదగిరిగుట్ట ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు తక్షణమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భక్తులకు సౌకర్యాల కల్పన, విడిది చేసేందుకు కాటేజీల నిర్మాణంపై దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రామప్ప ఆలయం ఆకృతిలో కీసరగుట్ట ఆలయాన్ని అధునాతన సాంకేతికతను వినియోగించి పునర్నిర్మించాలని చెప్పారు. పర్యాటకంపై వేర్వేరు పాలసీలు టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణాతో పాటు వసతి సౌకర్యం, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా పర్యాటక ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్నిచోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ పద్ధతిలో.. హరిత హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వీటి నిర్వహణ నిరంతరం మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని రేవంత్ చెప్పారు. పర్యాటక రంగంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా టూరిజం అభివృద్ధి జరగాలన్నారు. హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలి హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసే హెల్త్ హబ్‌లో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించేందుకు వన్ స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమే‹Ùరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండివేములవాడ ఆలయ విస్తరణపై సీఎం ఆదేశాలుసాక్షి, హైదరాబాద్/వేములవాడ: వేములవాడ ఆలయ విస్తరణ డిజైన్లు, నమూనాలకు వెంటనే శృంగేరి పీఠం అనుమతులు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో సహా వేములవాడ ఆలయ అర్చకులు సీఎంను కలిశారు. ఆలయ విస్తరణకు బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. అధికారులు బదులిస్తూ శృంగేరి పీఠానికి వెళ్లి అను మతులు తీసుకోవలసి ఉందని చెప్పడంతో.. వెంటనే వెళ్లి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ ఈవో వి నోద్, స్థపతి వల్లి నాయగం, ప్రధానార్చకుడు ఉమేశ్ శర్మ, అధికారులు రాజేశ్, రఘునందన్ తదితరులున్నారు. -
అత్యంత వృద్ధ స్లోత్ మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ స్లాత్ పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూపార్కులో కన్నుమూసింది. 54 ఏళ్ల ఈ స్లోత్‌ను జాన్ అని పిలిచేవారు. అది గత వారం కన్నుమూసినట్లు జూ తెలిపింది. 1969లో పుట్టిన జాన్ తొలుత హాంబర్గ్ జూలో నివసించింది. తర్వాత క్రెఫెల్డ్ జూకు మారి 38 ఏళ్లుగా అక్కడే గడిపింది. మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వృద్ధ స్లోత్గా 2021లో గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ మగ స్లోత్కు 22 మంది సంతానం. ఏటా ఏప్రిల్ 30న దాని పుట్టిన రోజు సంబరాలు అట్టహాసంగా జరిగేవి. స్లోత్ల జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లు. బద్ధకానికి మారుపేరు! స్లోత్‌ను అత్యంత బద్ధకస్తురాలైన జీవిగా చెబుతారు. ఇది క్షీరదం. వీటిలో ఆరు రకాలుంటాయి. అన్నీ చెట్ల కొమ్మల మీదే నివసిస్తాయి. మరో చెట్టుపైకి వెళ్లడానికి మాత్రమే కిందకు దిగుతాయి. నేలపై నిమిషానికి కేవలం ఐదడుగుల వేగంతో, చెట్లపైనైతే 15 అడుగుల వేగంతో కదులుతాయి. చూట్టానికి ఎలుగుబంటికి దగ్గరగా, అందంగా ఉంటాయి. ఆకులు, పళ్లు తింటాయి. చెట్ల రసాలు తాగుతాయి. అన్నట్టూ, వీటి జీర్ణ వ్యవస్థ కూడా అత్యంత నెమ్మదిగా పని చేస్తుందట! -
Video: టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. జస్ట్ మిస్
అమెరికాలో ఓ మహిళా హల్చల్ చేసింది. న్యూజెర్సీలోని కోహన్‌జిక్ జూ వద్ద బెంగాల్ టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4 pic.twitter.com/DPRFi5xFg1— Steve Keeley (@KeeleyFox29) August 21, 2024 ఇదిలా ఉండగా కోహన్‌జిక్ జూలో రెండు బెంగాల్ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు. -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్‌లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్‌క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
‘అడవి’లోకి అభిషేక్ శర్మ.. మృగరాజును చూశారా? (ఫొటోలు)
-
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్‌కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్‌నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్‌నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
వన్యప్రాణులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్‌లో అత్యధికులు లైక్ చేసిన రీల్‌కు రూ. 5000, తరువాత ఉన్న రీల్‌కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు. -
అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులే తమకు స్ఫూర్తి అని వెల్లడించారు. తండ్రి నుంచి టాటా నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పటికి కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నానని స్పష్టం చేశారు. కంపెనీల విషయంలో లేదా వ్యాపారాల విషయంలో తన తండ్రి ముఖేష్ అంబానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారని. ప్రతి రోజూ వారి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉన్నానని అన్నారు. బిజినెస్ మాత్రమే కాకుండా తమ కుటుంబమంతా వన్య ప్రాణుల పట్ల ధరతో ఉంటామని వెల్లడిస్తూ.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ కంపెనీ ఒక 'జూ' ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూ అభివృద్ధిలో కూడా తన తల్లినద్రులే స్ఫూర్తి అని చెప్పారు. ఏనుగుల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, అందులో 200 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయని చెప్పారు. ఏనుగులు మాత్రమే కాకుండా జూలో మొత్తం 100 జాతుల కంటే ఎక్కువ జీవులు ఉన్నాయని, అరుదైన లేదా అంతరించిపోతున్న జంతువులను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి జంతువులోనూ దేవుణ్ణి చూస్తున్నట్లు అనంత్ అంబానీ వివరించారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? జూలో సంరక్షులు సుమారు 3000 నుంచి 400 మంది ఉన్నారని, వారందరూ ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు.. జూలో సౌరశక్తిని మాత్రం ఉపయోగిస్తున్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారు. మొత్తం మీద అంబానీ ఫ్యామిలీ జీవులను రక్షించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Reliance Foundation announces Vantara - a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India. Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID...We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8 — ANI (@ANI) February 26, 2024 -
‘నైనిటాల్’లో పెరిగిన రెడ్ పాండా జనాభా
ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్ పేరొందింది. స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు .. రెడ్ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్లో రెడ్ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, నేడు వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. నైనిటాల్ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
అనంత్-రాధిక పెళ్లి: అంబానీ ఫ్యామిలీకి భారీ ఊరట
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి భారీ ఊరట లభించింది. గుజరాత్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో చిన్నకుమారుడు అనంత్ వివాహాన్ని జరపడానికి వీల్లేందంటూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేవలం భయం ఆధారంగా స్వీకరించలేమంటూ ధర్మాసంన ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రాహుల్ నరులా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశాలించిన కోర్టు మేరకు తీర్పునిచ్చింది ఈ ఏడాది జూన్‌లో వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మెగా జూలో పెళ్లి అంటే ఇక్కడ జంతువులకు హాని కలిగిస్తుందనీ, ముఖేష్ అంబానీకి చెందిన మెగా జూ (గ్రీన్స్ జూలాజికల్, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ GZRRC)పై చర్యలు తీసుకునేలా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది, జంతు ప్రేమికుడు రాహుల్ నరులా హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీన్ని పరిశీలించి న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, గిరీష్ కథ్పాలియాతో కూడిన ధర్మాసనం దీనిని స్వీకరించలేమని పేర్కొంది. జంతు సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు త్రిపుర హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన హై-పవర్డ్ కమిటీ (HPC) ఈవెంట్‌ను పర్యవేక్షించేందుకు, జంతువులకు ఎలాంటి హానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. (టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!) ప్రైవేట్ ఈవెంట్లో జంతువులను ఉపయోగిస్తారనే ఆరోపణ నిరాధారమైందని సెంటర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా గుజరాత్‌లోని జామ్నగర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ ఖావ్డి గ్రామంలో280 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూపార్క్ ఉంది. అంతేకాదు దీన్ని అనంత్పె అంబానీ పెట్ ప్రాజెక్ట్‌గా, బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్‌గా భావిస్తారు. అటు అనంత్ -రాధిక పెళ్లిపై అధికారికర ధృవీకరణ ఏదీ రానప్పటికీ, ఈ గ్రాండ్ వెడ్డింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరి పెళ్లి కార్డు ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. (అంబానీ ఇంట పెళ్లి సందడి: అతిథులకు అదిరిపోయే గిఫ్ట్..?!) -
పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్!
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు.. -
'మాలి' ఇక లేదు!
పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే... నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్‌లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు. అంతేగాదు ఆ ఏనుగును థాయ్‌లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. ఎలా ఈ జూకి వచ్చిందంటే.. శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్‌కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్‌లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం. చనిపోవడానికి కారణం.. ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు. (చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది)