వన్యప్రాణులపై రీల్స్‌ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి! | Make Reels on Wildlife And You Will Get RS 5000, Know Details About This Competition In Kanpur - Sakshi
Sakshi News home page

Uttar Pradesh: వన్యప్రాణులపై రీల్స్‌ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!

Published Tue, Mar 26 2024 9:27 AM | Last Updated on Tue, Mar 26 2024 3:02 PM

Make Reels on Wildlife Get RS 5000 - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి  వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్‌ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్‌ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో  బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్‌ దర్శన్‌’ అనే పేరు పెట్టారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్‌ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్‌లో అత్యధికులు లైక్ చేసిన రీల్‌కు రూ. 5000, తరువాత ఉన్న రీల్‌కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement