సింగపూర్: సింగపూర్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కోవిడ్ -19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ అయిన డాక్టర్ సోంజా లూజ్ పేర్కొన్నారు. తాజాగా సింగపూర్ దేశంలో సుమారు 3,397 కేసులు ఉన్నాయని దేశం మొత్తంగా చూస్తే సుమారు 2 లక్షలకు పైగా కేసులు ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
(చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’)
ఈ నేపథ్యంలోనే సింగపూర్ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కరోనా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదీ కాక సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో సహా తేలికపాటి లక్షణాలను కనిపించాయని వైల్డ్ లైఫ్ గ్రూప్ తెలిపింది. అలాగే నైట్ సఫారీకి చెందిన ముగ్గురు కీపర్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది.
దీంతో ఆసియాటిక్ సింహాల పార్క్ నైట్ సఫారిని మూసేసినట్లు వైల్డ్ లైఫ్ గ్రూప్ అధికారులు చెప్పారు. ఈమేరకు వైల్డ్‌లైఫ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సోంజా లూజ్ మాట్లాడుతూ..."సాధారణంగా, వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావు. కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని మేము భావిస్తున్నాము. అయితే, తదుపరి చికిత్స అవసరమైతే గనుక యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్ ఇస్తాం" అని చెప్పారు.
(చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment