గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా? | Buy Lions In Cheaper Rates Than Buffaloes At Pakistan | Sakshi
Sakshi News home page

గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా?

Published Fri, Jul 29 2022 1:19 PM | Last Updated on Fri, Jul 29 2022 5:31 PM

Buy Lions In Cheaper Rates Than Buffaloes At Pakistan - Sakshi

Lions at cheaper rates than buffaloes.. అక్కడ గేదె కంటే తక్కువ ధరలో సింహాలను కొనుగోలు చేయవచ్చు. సింహాలను కొనుక్కోవచ్చంటూ జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్‌ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. 

లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్‌ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్‌లో ఒక గేదె ధర ఆన్‌లైన్ మార్కెట్‌లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్‌.. ఎందరికో ఆదర్శం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement