safari park
-
గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్ బ్లాంక్ ఇదేనేమో..
వన్య ప్రాణుల మధ్యకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఇప్పటికే పలు సందర్బాల్లో అటవీశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా అడవుల్లోకి టూరిస్టులు వెళ్లినప్పుడు అక్కడున్న జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వాటిని ఏ మాత్రం రెచ్చగొట్టినా అవి దాడి చేస్తాయి. అయితే, తాజాగా సింహం ఎదుటపడిన ఓ వ్యక్తి మృగరాజు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సఫారీ ముందు భాగంలో కూర్చుని జంతువులను పరిశీలిస్తున్నాడు. ఇంతలో సఫారీ వెనుక నుంచి ఓ సింహం ముందుకు వచ్చింది. దీంతో, ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి.. అలాగే, సింహాన్ని చూస్తూ ఉండిపోయాడు. బస్తీ మే సవాల్.. ఫేస్ టూ ఫేస్ అన్నట్టుగా.. అతను సింహాన్ని.. మృగరాజు అతడి చూస్తూ కొన్ని సెకన్లు ఉండిపోయారు. ఈ సందర్భంగా అతడు.. ఎంతకు కదలకపోవడంతో సింహం ఏమనుకుందో ఏమో.. కొద్దిసేపటి తర్వాత ముందుకు వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. బ్రతుకు జీవుడా.. అన్నట్టు సింహం దాడి నుంచి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లేటెస్ట్ క్రూగర్ అనే యూజర్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అతడు సింహానికి మర్యాద ఇవ్వడం వల్లే తనను మృగరాజు ఏమీ చేయలేదని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Latest Sightings - Kruger (@latestkruger) -
గేదె ధర కన్నా సింహం రేటు తక్కువ.. ఎక్కడో తెలుసా?
Lions at cheaper rates than buffaloes.. అక్కడ గేదె కంటే తక్కువ ధరలో సింహాలను కొనుగోలు చేయవచ్చు. సింహాలను కొనుక్కోవచ్చంటూ జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దాయాది దేశమైన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్లో ఒక గేదె ధర ఆన్లైన్ మార్కెట్లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది. ఇక, లాహోర్ సఫారీ జూ యాజమాన్యం.. జూ లోని 12 సింహాలను ఆగస్టు మొదటి వారంలో విక్రయించి డబ్బు సంపాదించాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అమ్మకానికి ఉన్న సింహాలలో.. మూడు ఆడ సింహాలు ఉన్నాయి. .@SalmanSufi7 .@sherryrehman .@WWFPak This SALE must not take place, how is this practising conservation ? The Lahore Safari Zoo management hopes to sell as many as 12 of its lions in the first week of August to raise money. Pls Help https://t.co/FfrlVOh1oF — Anika 🐘🦍🦧🦒🐋🐬 (@anikasleem) July 28, 2022 ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
మా ప్రైవసీకి భంగం కల్గిస్తారా.. ఎత్తిపడేసింది..
ప్రిటోరియా: సాధారణంగా చాలా మంది సరదాగా గడపటానికి జంతువుల సఫారీలకు, అభయారణ్యాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో సందర్శకులు.. క్రూరమృగాలను, ప్రత్యేక జీవులను దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడతారు. వీటికోసం ఆయా పార్కులలో ప్రత్యేక వాహానాలు ఉంటాయి. అయితే, ఒక్కొసారి జంతువులను చూసే క్రమంలో.. సందర్శకులు అనుకొకుండా ఆపదలకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్‌లో గత ఆదివారం(నవంబరు28) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలాటి గేమ్ రిజర్వ్‌లోని క్రూగెర్ నేషనల్ పార్కులో... కొందరు సందర్శకులు ప్రత్యేక వాహనంలో గైడ్ సహయంతో ఏనుగుల సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత.. ఏనుగుల దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత.. గట్టిగా అరవడం ఆరంభించారు. వీరిని గమనించిన ఏనుగుల గుంపు కాస్త బెదిరిపోయింది. వారి వాహనం ఏనుగుల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికా ఏనుగు వారు ప్రయాణిస్తున్న వాహనం వైపు ఘీంకరించుకుంటూ వచ్చింది. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నట్లు..’ వారి వాహనాన్ని తొండం సహయంతో పక్కకు నెట్టి, కిందకు పడేసింది. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాహనం నుంచి దూకి పారిపోయారు . అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేవు. వాహనం మాత్రం తుక్కుతుక్కయ్యింది. శీతాకాలంలో ఏనుగులు మేటింగ్‌లో పాల్గొంటాయి. వాటి ఏకాంతానికి అంతరాయం కల్గినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాయని రిజర్వ్ మేనెజర్ హవ్మెన్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను.. సందర్శకులలో ఒక వ్యక్తి రికార్డు చేశాడు. అతను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏనుగు ఎంత భయంకరంగా ఉంది..’, ‘కొంచెంలో బతికి బట్టకట్టారు..’, ‘మీరు ఏనుగుకు దొరికితే అంతే సంగతులు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Too much intrusion will take your life in Wilderness. However, wild animals keeps on forgiving us since long.#responsible_tourism specially wildlife tourism should be educational rather recreational. हांथी के इतना घुसा नही जाता 🙏 watch second video too pic.twitter.com/AOKGZ2BAjB — WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021 -
సింహం కారు మీదకు ఎక్కి ..
-
కారు డోర్ ఓపెన్ చేయాలని చూసింది..కానీ
సాధారణంగా సఫారీ పార్క్‌లో సింహాలు వాహనాలను వెంబడించడం గమనిస్తూనే ఉంటాం. ఇంతకుముందు కూడా దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఒక సింహం కారు మీదకు ఎక్కి కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో సింహం దర్జాగా ఒక కారు మీదకు ఎక్కి కూర్చుంది. తర్వాత కారు డోర్ ఓపెన్ చేయాలని ప్రయత్నించినా డోర్ లాక్ చేసి ఉండడంతో ఓపెన్ కాలేదు. దీంతో కొద్దిసేపటి వరకు కారుపై అలాగే ఉండిపోయింది. అయితే అదే సమయంలో మరో రెండు సింహాలు వచ్చి కారును మొత్తం పరిశీలించాయి. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ మెల్లగా తన వాహనాన్ని కదిలించడంతో సింహం కిందకు దిగి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. సఫారీ పార్క్‌కి వెళ్లే వీక్షకులు తమ సొంత వాహనాల్లో వెళితే ఎంత ప్రమాదకరమనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియోనూ రెడ్డిట్ అనే సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ' అదృష్టం బాగుంది కాబట్టి ఆ సింహాలు కారును ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఒకవేళ వాటికి చిర్రెత్తికొచ్చి కారుపై దాడి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకమీదట సఫారీ పార్క్‌కు వెళ్లేవారు సొంత వాహనాల్లో కాకుండా బస్‌లో వెళితే బాగుంటుందని నెటిజన్లు హెచ్చరించారు. -
కెమెరామెన్‌ను కొమ్ములతో కుమ్మేసింది!
సాధారణ ఫొటోగ్రఫీ కంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారమే. వన్యప్రాణులను చిత్రీకరించే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. జంతువుల మూడ్‌పైనే వారి రక్షణ ఆధారపడుతుంది. సింహం, పులుల వంటి మృగాలతో పోలిస్తే శాకాహార జీవులతో కాస్త చనువుగా ఉన్నా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. అయితే నైరుతి ఇంగ్లండ్‌లోని వైల్ట్షైర్ జంతువుల పార్కులో ఉండే సిసిల్ అనే గొర్రె మాత్రం ఇందుకు మినహాయింపు. తనను వీడియోలో బంధించేందుకు వచ్చిన ఓ కెమెరామెన్‌ను కొమ్ములతో కుమ్మేసింది. చివరకు పార్కు నిర్వాహకులు కలుగజేసుకుని వెనక్కి పిలవడంతో శాంతించి..అతడిని వదిలేసింది. ‘సఫారీ పార్కుల్లో దాగున్న వన్యప్రాణుల జీవితంలోని దృశ్యాల ఆవిష్కరణ’ పేరిట బీబీసీ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం విల్ట్‌షైర్‌లోని పార్కులో వీడియోషూట్ చేసేందుకు బీబీసీ కెమెరామెన్ ఎంతో ఉత్సాహంగా వెళ్లాడు. అయితే ఆ పార్కులో రౌడీగా పేరొందిన సిసిల్ను పార్కు నిర్వాహకులు కెమెరామెన్‌కు పరిచయం చేశారు. తను చాలా మొండిదని, ఎవరైనా తనకు నచ్చని పనిచేస్తే వెంటనే వాళ్ల పనిపడుతుందని చెబుతుండగానే అది నెమ్మదిగా కెమెరామెన్ దగ్గరికి వెళ్లింది. వీడియో తీసేందుకు కెమెరా సెట్ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అతడిపై కొమ్ములతో విరుచుకుపడింది. ఈ తతంగాన్నంతా పక్కనే ఉండి గమనిస్తున్న పార్కు సిబ్బంది మాత్రం ఇది షరామామూలే అన్నట్లుగా నవ్వుతుండటంతో కెమెరామెన్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీబీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఆఫ్రికాలో నివసించే అరుదైన రకానికి చెందిన ఈ గొర్రె చేష్టలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘మీ దగ్గర కెమెరా ఉంటే..దానికి పదునైన కొమ్ములు ఉన్నాయి. ఎంత కోపం వచ్చిందో అందుకే అలా కుమ్మింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
బోనులో నైట్ సఫారీ!
సాక్షి, సిటీబ్యూరో: తొమ్మిది రకాల అడవులు..140 జాతుల జంతువులు..సింగపూర్ నైట్ సఫారీ పార్కునే మించేలా..ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేలా కొత్వాల్‌గూడలో 125 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయాలనకున్న నైట్ సఫారీ పార్కు ప్రాజెక్టు అటకెక్కినట్లు తెలుస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ఏడాది క్రితం తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. గతేడాది జూన్ 24న బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కొత్వాల్‌గూడలోని స్థలాన్ని పరిశీలించి మరో రెండు నెలల్లో డిజైన్లు సమర్పిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు అంశం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఆసక్తి కనబరిచినా తదనంతర పరిస్థితుల్లో దీన్ని పట్టించుకునేవారే కరువవడంతో ఆ ఊసే లేకుండా పోయింది. అయితే ఇప్పటికైనా నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై ఇటు హెచ్ఎండీఏ, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటంతో పాటు హిమాయత్‌సాగర్ ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు. నేపథ్యమిదే... సింగపూర్ నైట్ సఫారీ పార్కులో ఉన్నట్టుగానే ట్రామ్ లేదా ట్రాయ్ ట్రైన్ ద్వారా సందర్శకులు దాదాపు గంటపాటు జంతువులను రాత్రి సమయాల్లో చూసే వీలుకల్పించనున్నారు. చిమ్మచీకటిలో కలియ తిరుగుతూ వన్య ప్రాణుల కదలికలను దగ్గరి నుంచి చూసే అనుభూతిని కలిగించనున్నారు. మధ్యమధ్యలో ఏర్పాటుచేసిన ప్రత్యేక లైట్ల వెలుగులో జంతువులు తచ్చాడుతూ అటుఇటు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. జంతువులకు ఇబ్బంది కలగకుండా ఈ లైట్ చాలా డిమ్‌గా ఉంచనున్నారు. సహజంగా ఏర్పడిందా అన్నట్టుగా సృష్టించే ఈ ఆడవిలో దాదాపు 140 జాతులకు చెందిన జంతుజాలం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దాదాపు 1200 జంతువులు తీసుకురావాలని నిర్ణయించారు.. విదేశీ జంతువులతో పాటు స్థానికంగా ఉండే జంతువులు నక్కలు, జీబ్రాలు, జింకలు, కోతులు, కొండెంగలు, సింహాలు, కుందేళ్లు...ఇలా వివిధ రకాల జంతువులను తీసుకొస్తామని అధికారులు చెప్పారు. అలాగే మధ్యమధ్యలో నీళ్లు జాలువారేలా ఏర్పాట్లు, అక్కడక్కడ ఏర్పాటుచేసే చిన్నచిన్న కుంటల్లో మొసళ్లు కూడా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే సింగపూర్ నైట్ సఫారీ పార్క్ ముందు గిరిజనుల ప్రదర్శనలు ఉన్నట్టుగానే ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు, బసచేసేందుకు ప్రత్యేక కాటేజ్‌లు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే సందర్శకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు రెస్టారెంట్లు కూడా ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రచించారు. రాత్రి సమయాల్లో నైట్ సఫారీ చూసేందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికైనా కదలిక వచ్చేనా... గతేడాది జూన్‌లో నైట్ సఫారీ పార్కు ఏర్పాటు తెరపైకి వచ్చినా తదనంతర రాజకీయ పరిస్థితులతో ఆ అంశం కనుమరుగైంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరుగడంతో హెచ్ఎండీఏ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ నైట్ సఫారీ పార్కు ఏర్పాటుపై దృష్టి సారించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిద్వారా మంచి ఆదాయం రావడంతో పాటు ప్రపంచస్థాయిలో పర్యాటకంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. -
క్రిమియా తైగన్ సఫారీ పార్క్‌లో సింహం హల్చల్
-
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
-
అర క్షణం ఆలస్యమై ఉంటే..
ఆమ్స్టర్డ్యామ్, నెదర్లాండ్ : ఫ్రెంచ్ కుటుంబం త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. నెదర్లాండ్‌లోని సఫారీ పార్కుకు ఓ ఫ్రెంచ్ కుటుంబం టూర్‌కు వెళ్లింది. పార్కు మధ్యలో చిరుతల గుంపు కనిపించడంతో కారును అక్కడే కాసేపు నిలిపారు. కారులో నుంచి బయటకు దిగారు. సాహసం చేసిన మహిళ చిరుతల దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. ఆమె చేతిలో నెలల వయసున్న బిడ్డ ఉండటం గమనార్హం. చిరుతలు దాడి చేయడానికి యత్నించడంతో షాక్‌కు గురైన వారు కారు వైపు పరుగులు తీశారు. చిరుతలు వేగంగా చేరుకునే లోపు కారులోకి ఎక్కడంతో ప్రమాదం తప్పిపోయింది. ఘటనపై సఫారీ పార్కు అధికారులు విచారణకు ఆదేశించారు. -
విషాదం: చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది
కంపాలా: ఉగాండలోని క్వీన్ ఎలిజిబెత్ నేషనల్ పార్క్‌లో చిన్నారి ఉదంతం విషాదంగా ముగిసింది. మూడేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత చంపి తినేసింది. చిన్నారి పుర్రె, దుస్తుల అవశేషాలను అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ డోరీన్ అయేరా కొడుకు ఎలిషా నబుగ్యేరే(3) ఆయాతో క్వార్టర్స్ బయట ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి వెనకాలే వచ్చిన చిరుత ఒక్క దూటుతో లాక్కెల్లింది. ఆయా అరుపులు విన్న సిబ్బంది కాల్పులు ప్రారంభించగా చిరుత పొదల్లోకి పారిపోయింది. వెంటనే భారీగా అటవీ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆదివారం ఉదయం పిల్లాడి పుర్రె, దుస్తులు లభ్యం కావటంతో చిన్నారి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. క్వార్టర్స్ వద్ద కంచె(ఫెన్సింగ్) లేకపోవటంతోనే చిరుత దాడి చేసిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసినట్లు ఫారెస్ట్ అధికారి బషీర్ హంగ్ ప్రకటించారు. చిరుత మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో దానిని మట్టుపెట్టుందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి?
ఫొటో చూడగానే గుండె జారిపోలే.. మరి ఈ ఫొటోను తీసినోడి పరిస్థితేంటి? అతడికైతే పై ప్రాణాలు పైనే పోయాయట. పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ అతీఫ్ సయీద్. ఈ చిత్రాన్ని లాహోర్ సఫారీ పార్కులో తీశాడు. ఓ రోజు సఫారీ పార్కులో ఫొటోలు తీయడానికి బయల్దేరిన అతీఫ్‌కు ఈ మృగరాజు కనిపించిందట. మహా అందంగా ఉందే అంటూ.. కెమెరా తీసుకుని కారు దిగాడు. చాలా దగ్గరగా తీస్తే.. బాగుంటుందని చెప్పి.. గడ్డిలో నక్కుతూ.. దీని దగ్గరకు పోయాడట. అంతవరకూ బాగానే ఉంది కానీ.. ఫొటో తీసేటప్పుడు వచ్చే ‘క్లిక్’ సౌండ్ ఈ మృగరాజు చెవిన పడింది. అంతే.. ఉగ్ర నరసింహుడి రూపమెత్తింది. అతీఫ్ పైకి దూసుకొచ్చింది. ఒక క్షణం లేటైతే.. అతీఫ్ దానికి ఆహారమైపోయేవాడే.. అతడి టైమ్ బాగుంది. అందుకే ఒలింపిక్ పతకం కోసం పరిగెట్టినట్లు పరిగెత్తి.. కారులో దూరి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే.. పరిగెత్తే ముందు తన కెరీర్లోనే ది బెస్ట్‌గా నిలిచిపోయే ఈ ఫొటోను కూడా క్లిక్‌మనిపించాడు.