Viral Video: Lion Sees Man In Jeep, See What Happens Next - Sakshi
Sakshi News home page

Viral Video: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్‌ బ్లాంక్‌ ఇదేనేమో..

Published Tue, Mar 21 2023 6:12 PM | Last Updated on Tue, Mar 21 2023 6:30 PM

Lion Sees Man In Jeep See What Happens Next Video Viral - Sakshi

వన్య ప్రాణుల మధ్యకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఇప్పటికే పలు స​ందర్బాల్లో అటవీశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా అడవుల్లోకి టూరిస్టులు వెళ్లినప్పుడు అక్కడున్న జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వాటిని ఏ మాత్రం రెచ్చగొట్టినా అవి దాడి చేస్తాయి. అయితే, తాజాగా సింహం ఎదుటపడిన ఓ ‍వ్యక్తి మృగరాజు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సఫారీ ముందు భాగంలో కూర్చుని జంతువులను పరిశీలిస్తున్నాడు. ఇంతలో సఫారీ వెనుక నుంచి ఓ సింహం ముందుకు వచ్చింది. దీంతో, ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి.. అలాగే, సింహాన్ని చూస్తూ ఉండిపోయాడు. బస్తీ మే సవాల్‌.. ఫేస్‌ టూ ఫేస్‌ అన్నట్టుగా.. అతను సి​ంహాన్ని.. మృగరాజు అతడి చూస్తూ కొన్ని సెకన్లు ఉండిపోయారు. 

ఈ సందర్భంగా అతడు.. ఎంతకు కదలకపోవడంతో సింహం ఏమనుకుందో ఏమో.. కొద్దిసేపటి తర్వాత ముందుకు వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. బ్రతుకు జీవుడా.. అన్నట్టు సింహం దాడి నుంచి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లేటెస్ట్‌ ‍క్రూగర్‌ అనే యూజర్‌ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అతడు సింహానికి మర్యాద ఇవ్వడం వల్లే తనను మృగరాజు ఏమీ చేయలేదని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement