lion enclosure
-
తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. గుర్తు తెలియని వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్లోకి దూకాడు. దీంతో సందర్శకుడిని సింహం నోట కరచుకొని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం. ఎస్వీ జూపార్క్‌లో సింహం దాడి ఘటనపై స్పందించిన జూ అధికారులు.. ఎస్వీ జూ పార్క్ క్యురేటర్ మీడియాతో మట్లాడారు. ‘మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో సింహం ఎంక్లోజర్లోకి ఓ వ్యక్తి దూకి వెళ్ళాడు. జూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసే లోపే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళాడు. సింహం మెడ ప్రాంతంలో నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళడంతో మృతి చెందాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించాం. అతను ఒక్కడే వచ్చాడు. పోలీసులుకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాం. పోస్ట్‌మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలింపు’ అని తెలిపారు. -
గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. మైండ్ బ్లాంక్ ఇదేనేమో..
వన్య ప్రాణుల మధ్యకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఇప్పటికే పలు సందర్బాల్లో అటవీశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా అడవుల్లోకి టూరిస్టులు వెళ్లినప్పుడు అక్కడున్న జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వాటిని ఏ మాత్రం రెచ్చగొట్టినా అవి దాడి చేస్తాయి. అయితే, తాజాగా సింహం ఎదుటపడిన ఓ వ్యక్తి మృగరాజు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సఫారీ ముందు భాగంలో కూర్చుని జంతువులను పరిశీలిస్తున్నాడు. ఇంతలో సఫారీ వెనుక నుంచి ఓ సింహం ముందుకు వచ్చింది. దీంతో, ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి.. అలాగే, సింహాన్ని చూస్తూ ఉండిపోయాడు. బస్తీ మే సవాల్.. ఫేస్ టూ ఫేస్ అన్నట్టుగా.. అతను సింహాన్ని.. మృగరాజు అతడి చూస్తూ కొన్ని సెకన్లు ఉండిపోయారు. ఈ సందర్భంగా అతడు.. ఎంతకు కదలకపోవడంతో సింహం ఏమనుకుందో ఏమో.. కొద్దిసేపటి తర్వాత ముందుకు వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. బ్రతుకు జీవుడా.. అన్నట్టు సింహం దాడి నుంచి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను లేటెస్ట్ క్రూగర్ అనే యూజర్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అతడు సింహానికి మర్యాద ఇవ్వడం వల్లే తనను మృగరాజు ఏమీ చేయలేదని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Latest Sightings - Kruger (@latestkruger) -
హైదరాబాద్: జూపార్క్ సఫారీ జోన్లోకి పోటెత్తిన వరద నీరు
-
జూలోకి వరద నీరు.. లయన్ సఫారీ మూసివేత
సాక్షి, హైదరాబాద్: మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లో కారణంగా వరదనీరు జూపార్కులోకి ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో జూ అధికారులు వర్షపు నీరు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్ సఫారీలోని వన్యప్రాణులను నైట్ ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు. సందర్శకులు లయన్ సఫారీ వైపు వెళ్లకుండా సందర్శనను పూర్తిగా మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. (క్లిక్: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్) మంచినీటి సరఫరా యథాతథం కృష్ణా ఫేజ్–1 జంక్షన్ మరమ్మతు పనులు వాయిదా వేయడంతో బుధవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటిసరఫరా జరగనుందని జలమండలి ప్రకటించింది. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించిన విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. (క్లిక్: హైదరాబాద్ లో అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?) -
నెహ్రూ జూపార్కులో యువకుడి హల్చల్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నెహ్రూ జూపార్కులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. ఈ క్రమంలో యువకుడు.. సింహం ఎన్‌క్లోజర్‌లో దూకేందుకు ప్రయత్నం చేశాడు. చాలా సేపు .. సింహం ఎన్‌క్లోజర్‌కు దగ్గరలోనే కూర్చోని ఉన్నాడు. దీన్నిగమనించిన సందర్శకులు జూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ యువకుడిని అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడి సందర్శకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. -
సింహానికే సవాలు విసిరాడు
-
సింహానికే సవాలు విసిరాడు
న్యూఢిల్లీ : ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి వెళ్లిన సంఘటన కలకలం రేపింది. మెటల్ గ్రిల్స్ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అంతేకాకుండా సింహానికి దగ్గరగా వెళ్లి దాని ముఖంలో ముఖం పెట్టి చూశాడు. నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాలు విసిరాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగినప్పుడు జూ లో ఉన్న సందర్శకులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తిని బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌గా గుర్తించామన్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని తెలిపారు. అయితే జూ సిబ్బంది అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటకు తీసుకోచ్చారని వెల్లడించారు. అయితే అత్యంత పటిష్టంగా ఉండాల్సిన మెటల్ గ్రిల్స్ దాటి ఓ వ్యక్తి లోనికి వెళ్లడంతో.. జూ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. -
పులి బోనులోకి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఓ మందబాబు హల్చల్ చేశాడు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం జూ పార్క్ సందర్శనకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఒక్కసారిగా పులి ఇంక్లోజర్లోనికి దూకేశాడు. అదృష్టవశాత్తు పులి అతన్ని గమనించలేదు. ఇంతలో సందర్శకుల అరుపులు, కేకలతో పులి డెన్లోనికి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన జూలాజికల్ పార్క్ అధికారులు సమయస్ఫూర్తితో పులులను డెన్లోకి తీసుకువెళ్లారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో జూకు వచ్చిన సందర్శకులు ఈ పరిమాణంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. జూ అధికారులు అతన్ని అదుపులోకి స్థానిక పోలీసులకు అప్పగించారు. బతుకు దెరువు కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. సందర్శకుడు సురక్షితంగా బయటపడడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.